చిదంబరం (సినిమా)

జి. అరవిందన్ దర్శకత్వంలో 1985లో విడుదలైన మలయాళ సినిమా.

చిదంబరం, 1985 మార్చి 8న విడుదలైన మలయాళ సినిమా. జి. అరవిందన్ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించిన ఈ సినిమా సి.వి. శ్రీరామన్ రాసిన ఒక చిన్న కథ ఆధారంగా తెరకెక్కింది.[1] [2][3][4] ఇందులో భరత్ గోపి, స్మితా పాటిల్, శ్రీనివాసన్, మోహన్ దాస్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా భారత జాతీయ చలనచిత్ర పురస్కరాలలో ఉత్తమ చలనచిత్రం అవార్డును, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వంతోపాటు ఐదు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది .

చిదంబరం
చిదంబరం సినిమా పోస్టర్
దర్శకత్వంజి. అరవిందన్
స్క్రీన్ ప్లేజి. అరవిందన్
కథసి.వి. శ్రీరామన్
నిర్మాతజి. అరవిందన్
తారాగణంభరత్ గోపి
స్మితా పాటిల్
శ్రీనివాసన్
మోహన్ దాస్
ఛాయాగ్రహణంషాజీ ఎన్. కరున్
సంగీతంజి. దేవరాజన్
నిర్మాణ
సంస్థ
సూర్యకాంతి
పంపిణీదార్లుఎస్ఏజె మూవీస్
విడుదల తేదీ
1985, మార్చి 8
సినిమా నిడివి
100 నిముషాలు
దేశంభారతదేశం
భాషమళయాలం

నటవర్గం మార్చు

  • శ్రీనివాసన్ (మునియాండి)
  • భరత్ గోపి (శంకరన్)
  • స్మితా పాటిల్ (శివకామి)
  • ఇన్నోసెంట్
  • నేదుముడి వేణు
  • మురళి (చెరియాన్)
  • డా. మోహన్‌దాస్ (జాకబ్‌)
  • జేమ్స్

పాటలు మార్చు

జి. దేవరాజన్ సంగీతం అందించాడు.

క్రమసంఖ్య పాట గాయకులు సాహిత్యం నిడివి (ని:సె)
1 అట్టిలేపోకుం తన్నీ సీర్కాజీ శివచిదంబరం
2 అనితినుడై (బిట్) సంప్రదాయక
3 మార్ఘజి (బిట్) సంప్రదాయక
4 థాలిర్ పి. మాధురి సంప్రదాయక
5 తోండా రాండమ్ పి. మాధురి
6 ఉన్నములై ఉమయలోదం పి. మాధురి

నిర్మాణం మార్చు

సి.వి. శ్రీరామన్ రాసిన కథను సినిమాగా తీయాలని అరవిందన్ నిర్ణయించుకొని, మూడు సంవత్సరాలపాటు ప్రయత్నించినా నిర్మాతలు దొరకలేదు. దాంతో తానే ఈ సినిమాని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. మంచి బడ్జెట్‌తో ఈ సినిమాని తీశాడు. ఇడుక్కి జిల్లాలోని మున్నార్ సమీపంలోని మాటుపెట్టిలో ఈ సినిమా షూటింగ్ జరిగింది.[5]

అవార్డులు మార్చు

సంవత్సరం ప్రతిపాదించిన విభాగం పురస్కారం ఫలితం
1985 జి. అరవిందన్ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సినిమా గెలుపు
జి. అరవిందన్ ఉత్తమ దర్శకుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు గెలుపు
జి. అరవిందన్ ఉత్తమ సినిమాగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు[6] గెలుపు
భరత్ గోపి ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు గెలుపు

మూలాలు మార్చు

  1. "G.Aravindan: Chidambaram". Cinemaofmalayalam.net. Archived from the original on 11 December 2010. Retrieved 2021-06-18.
  2. "Chidambaram". www.malayalachalachithram.com. Retrieved 2021-06-18.
  3. "Chidambaram". malayalasangeetham.info. Archived from the original on 22 October 2014. Retrieved 2021-06-18.
  4. "Chidambaram". spicyonion.com. Archived from the original on 22 October 2014. Retrieved 2021-06-18.
  5. "Interview: Aravindan". Cinemaofmalayalam.net. Archived from the original on 11 December 2010. Retrieved 2021-06-18.
  6. Kerala State Film Awards Archived 19 నవంబరు 2009 at the Wayback Machine

బయటి లింకులు మార్చు