కబడ్డీ

భారత దేశపు గ్రామీణ క్రీడ
(చెడుగుడు నుండి దారిమార్పు చెందింది)

కబడ్డీ (చెడుగుడు) ఒక స్పర్శాగత జట్టు ఆట.[1] జుట్టుకు ఏడుగురు ఆటగాళ్ళుంటారు. ఆట లక్ష్యం "రైడర్" గా పిలువబడే స్పర్ధి, కోర్టులోని ప్రత్యర్థి జట్టు భాగంలోకి కబడ్డీ, కబడ్డీ అని శ్వాసతీసుకోకుండా పలుకుతూ అవతల జట్టుభాగంలోకి వెళ్లి, వీలైనంత ఎక్కువ మందిని తాకడం, వారి పట్టుకోబోతే తప్పించుకుని స్వంత జట్టు భాగంలోకి తిరిగి రావడం. [1] రైడర్ తాకిన ప్రతి ఆటగాడివలన పాయింట్లు లభిస్తాయి. అయితే ప్రత్యర్థి జట్టు రైడర్‌ను ఆపితే ఒక పాయింట్ సంపాదిస్తుంది. తాకిన ఆటగాళ్లు, రైడర్ పట్టుబడినా వారు ఆట బయటకు వెళ్లాలి. పాయింట్ సంపాదించినపుడు బయటకు వెళ్లిన ఆటగాళ్లు మరల ఆటలోకి వస్తారు.

కబడ్డీ
Iran men's national kabaddi team 13970602000432636707284535394012 98208.jpg
ఆసియా క్రీడలు - 2018 లో కబడ్డీ ఆట
అత్యున్నత పాలక సంస్థInternational Kabaddi Federation
ఇతర పేర్లుచెడుగుడు, కౌడి, పకాడ మొదలైనవి
లక్షణాలు
సంప్రదింపుస్పర్శాగత ఆట
జట్టు సభ్యులు7 (ఒక జట్టు)
Mixed genderకాదు. పురుషులకు, స్త్రీలకు వేర్వేరు
రకంజట్టు క్రీడ, స్పర్శాగత క్రీడ
ఉపకరణాలుఏమీలేవు
వేదికకబడ్డీ మైదానం
Presence
దేశం లేదా ప్రాంతంభారత ఉపఖండం, ఆసియా
ఒలింపిక్ప్రదర్శన క్రీడ: 1936 ఒలింపిక్స్

ఇది భారత ఉపఖండం, ఇతర ఆసియా దేశాలలో ప్రసిద్ది చెందింది. పురాతన భారతదేశ చరిత్రలో కబడ్డీ గురించిన వివరాలున్నా, ఈ ఆట 20 వ శతాబ్దంలో పోటీ క్రీడగా ప్రాచుర్యం పొందింది. ఇది బంగ్లాదేశ్ జాతీయ క్రీడ . ఆంధ్రప్రదేశ్, బీహార్, హర్యానా, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిషా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ మొదలైన భారత రాష్ట్రాల క్రీడ. [2]

కబడ్డీలో రెండు ప్రధాన విభాగాలు ఉన్నాయి. " పంజాబీ కబడ్డీ " అనేది వృత్తాకార మైదానంలో ఆరుబయట ఆడతారు. దీనిని "సర్కిల్ స్టైల్" అని కూడా పిలుస్తారు. "ప్రామాణిక శైలి" ఆట పైకప్పుగల క్రీడలమైదానంలో దీర్ఘచతురస్రాకార కోర్టులో ఆడతారు. ప్రధాన వృత్తిపర పోటీలు, ఆసియా క్రీడలు వంటి అంతర్జాతీయ పోటీలలో ప్రామాణిక శైలి వాడతారు.

భారత ఉపఖండంలోని వివిధ ప్రాంతాలలో ఈ ఆటను అనేక పేర్లతో పిలుస్తారు, అవి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు లో కబడ్డీ; పంజాబ్ ప్రాంతంలో కౌడ్డీ లేక కబడ్డీ  ; పశ్చిమ భారతదేశం లో హు-టు-టు ,తూర్పు భారతదేశంలో హు-డో-డో; బంగ్లాదేశ్‌లో కబాడి లేదా హ-డు-డు; మాల్దీవులలో బావతిక్; నేపాల్‌లో కపార్డి.[1]

ఆట విధానంసవరించు

 
గ్రామాలలో కబాడీ ఆడుతున్న దృశ్యము

అంతర్జాతీయ కబడ్డీ ఆటలో రెండు టీములు 13 మీటర్లు : 10 మీటర్లు కోర్టులో ఆడుతారు. ఒక్కొక్క జట్టులో 7 గురు ఆటగాళ్ళు ఉంటారు. 5 గురు రిజర్వ్ లో ఉంటారు. ఆట సమయం 40 నిమిషాలు; మధ్యలో 5 నిమిషాల విరామం ఉంటుంది. ఒక టీము నుండి ఒక ఆటగాడు రెండవవైపు కబడ్డీ, కబడ్డీ, ... అని గుక్కతిప్పుకోకుండా వెళ్ళి ఒకరు లేదా అంతకంటే ఎక్కువమందిని ముట్టుకొని తిరిగి మధ్య గీతను ముట్టుకోవాలి. ఎంతమందిని ముట్టుకుంటే అందరూ ఔట్ అయిపోయినట్లు. వారిని బయటికి పంపిస్తారు. రెండవ జట్టుకు అన్ని మార్కులు వస్తాయి. ఒకవేళ కూత ఆపితే ఒక మార్కు విరోధి జట్టుకు వస్తుంది. ఆపిన ఆటగాన్ని బయటికి పంపిస్తారు.

తరువాత రెండవ జట్టు నుండి ఒక ఆటగాడు మొదటి జట్టులోని ఇదేవిధంగా వచ్చి కొందర్ని ఔట్ చేసి వెళ్ళిపోతాడు. ఒక ఆటగాడు ఒకసారి ఏడుగురినీ ఔట్ చేస్తే ఏడు మార్కులతో సహా రెండు బోనస్ మార్కులు కూడా వస్తాయి. విరోధి జట్టులోని ఏడుగురు ఒక గొలుసు మాదిరిగా ఏర్పటి కూత పెడుతున్న ఆటగాన్ని తిరిగి వెనకకి పోకుండా ఆపాలి.

ఆట పూర్తి అయిన తరువాత ఏవరికి ఎక్కువ మార్కులు వస్తే ఆ జట్టు గెలిచినట్లుగా నిర్ణయిస్తారు.

చరిత్రసవరించు

 
2006 ఆసియా క్రీడలలో కబడ్డీ పోటీ.

కబడ్డీ అనే పదానికి వ్యుత్పత్తిగా కొందరు మూల ద్రావిడ పదాలయిన "కై"(చేయి) "పట్టి" నుంచీ వచ్చిందనీ, చేతులు పట్టుకుని ఆడే ఆట, లేక చేతులను కలిపి కూర్చిన దండ అని అర్థం చెబుతారు. అయితే దీనికి ప్రామాణికత లేదు.ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో బాగా ప్రాచుర్యం పొందినది. భారత కబడ్డీ సమాఖ్య 1950 సంవత్సరంలో స్థాపించబడింది. 1979లో ఈ ఆట జపాన్ దేశంలోకి ప్రవేశపెట్టారు.

కబడ్డీ మొదటిసారిగా చైనాలో జరిగిన 1990 ఆసియా క్రీడలలో ప్రవేశపెట్టబడింది.అప్పటి నుండి 2006 వరకు మనదేశం ఈ ఆటలో ప్రపంచ విజేతలుగా నిలిచారు. ప్రముఖ కబడ్డీ క్రీడాకారులు రాహుల్ చౌదరి అనూప్ కుమార్ ప్రదీప్ నర్వాల్ అజయ్ తకుర్ జాస్విర్ సింగ్ సందీప్ నర్వాల్ దీపక్ నివ్స్ హూడా మన్జీత్ చిల్లర్ మోహిత్ చిల్లర్ సురేంద్ర నద రాకేష్ కుమార్

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 "Kabaddi | Kabbadi Rules | How to play Kabbadi | Kabbadi Players | YoGems". 29 June 2020. Retrieved 24 January 2021.
  2. siddharth (2016-12-31). "Kabaddi Introduction, Rules, Information, History & Competitions". Sportycious (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-01-28.

బయటి లింకులుసవరించు


"https://te.wikipedia.org/w/index.php?title=కబడ్డీ&oldid=3847812" నుండి వెలికితీశారు