ప్రభాకర్ గౌడ్

సినీ నటుడు

ప్రభాకర్ గౌడ్ ఒక తెలుగు సినిమా నటుడు.[1][2] ఎక్కువగా ప్రతినాయక, సహాయ పాత్రలు పోషిస్తుంటాడు. బాహుబలి సినిమాలో కాలకేయుడి పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించాడు. గబ్బర్ సింగ్, దూసుకెళ్తా, దూకుడు, కృష్ణం వందే జగద్గురుం, దొంగాట అతనికి గుర్తింపు తెచ్చిన మరికొన్ని సినిమాలు.

ప్రభాకర్
జననం
ప్రభాకర్ గౌడ్

వృత్తినటుడు
జీవిత భాగస్వామిరాజ్యలక్ష్మి
పిల్లలుశ్రీరాం రాజమౌళి, రిత్విక్ ప్రీతమ్

వ్యక్తిగతంసవరించు

ప్రభాకర్ రాయచూరు దగ్గర్లోని హస్నాబాద్ లో జన్మించాడు. అతనికి ఒక తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. హస్నాబాద్ లో కొద్దిరోజులు చదివిన తర్వాత వికారాబాద్ కు దగ్గర్లోని అనంత పద్మనాభ అనే ఊరికి మారాడు. చిన్నప్పుడే చాలా పొడుగ్గా ఉండేవాడు. ఏడో తరగతికి వచ్చేసరికి 6 అడుగుల ర2 అంగుళాల ఎత్తు పెరిగాడు. అతను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు తండ్రి మరణించాడు. కుటుంబ భారమంతా అమ్మ మీద పడింది. ప్రభాకర్ కూడా ఏదో ఉద్యోగం చేసి తల్లి అండగా నిలబడాలనుకున్నాడు. అప్పుడే ఓ పెళ్ళికోసం హైదరాబాదుకు వచ్చాడు. అక్కడ ఓ బంధువు ఇతని పొడుగు చూసి పోలీసు ఉద్యోగంలో ప్రయత్నించమని సలహా ఇచ్చాడు. మరో బంధువు పోలీసు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సికింద్రాబాదు లోని రైల్ నిలయం ముందు రోజూ ఎదురుచూడమనే వాడు.

అతని చేతిలో డబ్బేమీ లేదు. తల్లే సహాయం చేసేది. కొద్ది రోజులకు అతని తమ్ముడు కూడా తల్లికి సహాయపడవలసి వచ్చింది. రెండు సంవత్సరాలపాటు తల్లి సహాయం చేసిన తరువాత పొగాకు ప్రవీణ్ అనే సీనియర్ ప్రభాకర్ కు నెలకు వెయ్యి రూపాయలు సహాయం చేసేవాడు. దాంతో అతని అద్దె, తిండి, జిం ఖర్చులు గడిచేవి. ఆ స్నేహితుడు అలా ఐదు సంవత్సరాలు సహాయం చేశాడు. ఆ సమయంలో ప్రభాకర్ ని గమనించిన ఓ పొరుగింటాయన టాటా డొకోమో సంస్థలో ఓ ఉద్యోగం ఇప్పించాడు. ప్రభాకర్ సంతోషంతో ఆరోజే ఉద్యోగంలో చేరాడు. అదే రోజు ఆ స్నేహితుని పుట్టిన రోజు కావడంతో అతను ప్రభాకర్ ని విందుకు పిలిచి మద్యం తాగాలని బలవంతం చేశాడు. కానీ మద్యం అతనికి అలవాటు లేకపోవడంతో అందుకు ఒప్పుకోలేదు. దాంతో రెండో రోజే అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు.

అతని భార్య పేరు రాజ్యలక్ష్మి. ఆమె ఒక గృహిణి. వీరికి శ్రీరాం రాజమౌళి, రిత్విక్ ప్రీతం అనే ఇద్దరు కొడుకులున్నారు. జీవితం అగమ్యంగా ఉన్న తనను పిలిచి అవకాశాలిచ్చి ప్రోత్సహించిన రాజమౌళి దంపతులకు కృతజ్ఞతగా తన కొడుక్కి రాజమౌళి అని పెట్టుకున్నాడు. రాజమౌళి దంపతులు కూడా ప్రభాకర్ను తమ కుటుంబంలో ఒకడిగా చూసుకుంటారు.

కెరీర్సవరించు

ఒకసారి పద్మాలయా స్టూడియోస్ లో మహేష్ బాబు హీరోగా అతిథి సినిమా చిత్రీకరణ జరుగుతుండగా ప్రభాకర్ అక్కడ చూస్తూ నిల్చున్నాడు. ఆ సినిమా దర్శకుడైన సురేందర్ రెడ్డి ఇతన్ని చూసి దగ్గరకి పిలిచాడు. ప్రభాకర్ తేరుకునే లోపే స్నేహితుడు ఇతన్ని నటుడి గా పరిచయం చేశాడు. దాంతో కొద్ది రోజులకు షూటింగ్ రమ్మని ఆహ్వానం అందింది. ఆ సినిమాలో మహేష్ బాబు తో పోరాట సన్నివేశాల్లో పాల్గొన్నాడు. ఆ సినిమాకు అతనికి 1200 రూపాయల పారితోషికం దక్కింది. ప్రభాకర్ అందుకు సంతోషించి అలా రోజు వారీ జీతంతో కొన్ని సినిమాల్లో అవకాశం దక్కించుకున్నాడు.

మగధీర చిత్రీకరణ జరుగుతున్నప్పుడు దర్శకుడు రాజమౌళి ఇతన్ని గమనించాడు. తరువాత కొద్ది రోజులకు రాజమౌళిని కలవమని ఫోన్ కాల్ వచ్చింది. అంతకు మునుపే రాజమౌళి సహాయ దర్శకుడు జగదీష్ ప్రభాకర్ ను బోన్ స్కానింద్ రిపోర్టు పంపమన్నాడు. ఇదేదో భీమా కంపెనీ అయి ఉంటుందని, పరీక్షలు చేయడానికి డబ్బులు కూడా లేకపోవడంతో చాలా రోజులు దాని గురించి పట్టించుకోలేదు. చాలా ఫోన్ కాల్స్ తరువాత రాజమౌళిని కలిసినప్పుడు రాజమౌళి తన తర్వాత సినిమాలో అతనికి అవకాశం ఇస్తున్నానని చెప్పాడు. కానీ తనకి నటన గురించి తెలియదన్నాడు. రాజమౌళి దాన్ని అతని మాటలు కొట్టిపడేసి తానే నటనలో శిక్షణ ఇప్పిస్తానని చెప్పాడు. అలాగే తాను ఎంత సంపాదిస్తున్నదీ అడిగి తెలుసుకుని నెలకు 10000 రూపాయలు ఇప్పిస్తాననీ బాగా కష్టపడి పని చేయమని చెప్పాడు. అతనికి జిం ఖర్చులు భరించి, నటనలో శిక్షణ కూడా ఇప్పించాడు. మగధీర షూటింగ్ కు రోజూ వచ్చి చూస్తూ సినిమా నిర్మాణం లో మెలకువలు నేర్చుకోమని చెప్పాడు. రాజమౌళి అన్ని ఖర్చులూ భరించేవాడు. కానీ సినిమాకు అతను 5000 రూపాయల కంటే ఎక్కువ తీసుకోలేదు.

మొదటగా మర్యాదరామన్న చిత్రంలో అవకాశం వచ్చినపుడు ముందుగా ఎవరికీ చెప్పలేదు. సినిమా ప్రకటన చూసినప్పుడు అతని బంధువులందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మొదటి సినిమా కావడంతో ఆ సినిమాలో సంభాషణలు చెప్పడానికి తడబడ్డప్పుడు రాజమౌళి ప్రోత్సహించాడు. సినిమా పూర్తయిన తర్వాత మంచి పేరు రావడంతో వేరే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. డబ్బుకు ఇబ్బందిగా ఉండటంతో వచ్చిన అవాకాశాన్నల్లా ఉపయోగించుకున్నాడు. సుమారు నలభై సినిమాల్లో నటిస్తే అందులో సగం సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు లభించాయి.

మర్యాద రామన్న సినిమా తరువాత మళ్ళీ రాజమౌళిని కలిసే అవకాశం రాలేదు. ఒకసారి అత్తారింటికి దారేది సినిమా కోసం తమిళనాడులోని తిరుచ్చిలో ఉండగా బాహుబలి లో అవకాశం ఇస్తూ రాజమౌళి ఫోన్ చేశాడు. ఈ పాత్ర కోసం ప్రభాకర్ ఇబ్బంది కరమైన దుస్తులు ధరించాల్సి వచ్చింది. కష్టమైన కిలికిలి భాషను గుర్తుపెట్టుకోవాల్సి వచ్చింది. అతనికి సెలెబ్రిటీ హోదాను తెచ్చి పెట్టింది[3].

సినిమాలుసవరించు

మూలాలుసవరించు

  1. Swathi, Sriram. "Focus light: Prabhakar". idlebrain.com. GV. Retrieved 18 September 2016.
  2. "ఫిల్మీబీట్ లో ప్రభాకర్ ప్రొఫైలు". filmibeat.com. ఫిల్మీబీట్. Retrieved 23 September 2016.
  3. Rajashekhar (2015-07-12). "బాహుబలి: 'కాళకేయ'ను చూసి గర్వపడుతున్న పాలమూరు వాసులు". telugu.oneindia.com. Retrieved 2021-03-09.
  4. సాక్షి, సినిమా (27 September 2018). "'దేవదాస్‌' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 March 2020. Retrieved 2 April 2020.
  5. V6 Velugu (8 April 2022). "ఆ రాత్రి ఏం జరిగింది?" (in ఇంగ్లీష్). Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.
  6. Namasthe Telangana (8 April 2022). "ఆ రాత్రి ఏం జరిగింది..?". Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.

బయటి లింకులుసవరించు