ఛాలెంజ్ రాముడు 1980 లో విడుదలైన యాక్షన్ చిత్రం. అనిల్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ [1] లో తాతినేని ప్రకాశరావు నిర్మించాడు. టిఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించాడు.[2] ఇందులో ఎన్.టి.రామారావు, జయ ప్రద ప్రధాన పాత్రలలో [2] నటించగా, చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[2]

ఛాలెంజ్ రాముడు
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.ఎల్వీ. ప్రసాద్
తారాగణం నందమూరి తారక రామారావు,
జయప్రద ,
గుమ్మడి వెంకటేశ్వరరావు
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ అనిల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

కథ మార్చు

విజయారాం (ఎన్.టి.రామారావు) ఓడకు కెప్టెన్. సవాళ్లు చేసి వాటిని గెలిచే అలవాటు ఉంది అతనికి. ఒకసారి సింగపూర్ నుండి భారతదేశానికి వెళ్ళేటప్పుడు, అతను జస్టిస్ రాజశేఖరం (గుమ్మడి) కుమార్తె అరుణ (జయప్రద) ను కలుస్తాడు. విజయ్ స్నేహితుడు రాజు (నూతన్ ప్రసాద్) ఆమెను ప్రేమలో పడెయ్యమని సవాలు చేస్తాడు. కాలక్రమేణా వారు నిజంగానే ఒకరినొకరు ఇష్టపడతారు. భారతదేశానికి చేరుకున్న తరువాత, ఒక రోజు, విజయ్ అరుణ ఆమె తమ్ముడు మధు / బంటీ (మాస్టర్ పురుషోత్తం) ను పిక్నిక్ కి తీసుకువెళతాడు. అక్కడ బంటీ తప్పిపోతాడు. మరుసటి రోజు వారి ఇంటి ముందు ఒక వీడియో ఫిల్మ్ ఉంటుంది. ఒక వ్యక్తి బంటీని కిడ్నాప్ చేసామని ప్రస్తుతం కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తున్న తన గ్యాంగ్ స్టర్ ను నిర్దోషిగా ప్రకటించాలనీ డిమాండు చేస్తాడు. కాని రాజశేఖరం అలా చేయడానికి నిరాకరిస్తాడు. ఇంతలో, విజయ్ ఆ వీడియోలో ఒక పెయింటింగ్ను గుర్తించడం ద్వారా ఒక క్లూ పొందుతాడు. బంటి కొచ్చిన్ వద్ద ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో, విజయ్ సంరక్షకుడు గోపాలం (మిక్కిలినేని), తన కుటుంబం మొత్తాన్ని జేమ్స్ (సత్యనారాయణ) చంపాడనీ, ఈ విషాద సంఘటన కొచ్చిన్ లోనే జరిగిందనీ చెబుతాడు. ఇప్పుడు విజయ్ రెండు పనులను సవాలుగా తీసుకుంటాడు. రాజు, అరుణతో కలిసి కొచ్చిన్ చేరుకుంటాడు జేమ్స్ తన పేరును రఘురామ్ గా మార్చుకున్న కిడ్నాపర్ అని తెలుసుకుంటాడు. చివరికి, విజయ్ బంటీని కాపాడి, జేమ్స్ పై ప్రతీకారం తీర్చుకుంటాడు. చివరగా విజయ్ అరుణ పెళ్ళితో సినిమా ముగుస్తుంది.

తారాగణం మార్చు

సాంకేతిక సిబ్బంది మార్చు

పాటలు మార్చు

ఎస్. పాట పేరు సాహిత్యం గాయకులు పొడవు
1 "చల్లగాలేస్తోండి" ఆచార్య ఆత్రేయ ఎస్పీ బాలు, పి.సుశీల 3:09
2 "పట్టుకో పట్టుకో" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, పి.సుశీల 3:16
3 "దోర దోర జంపండు" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, పి.సుశీల 2:57
4 "పెడతా పెడతా" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, పి.సుశీల 3:09
5 "ఎక్కడో ఎప్పుడో" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, పి.సుశీల 3:13
6 "కోప్పడకే కోమలాంగి" ఆచార్య ఆత్రేయ ఎస్పీ బాలు 3:06

మూలాలు మార్చు

  1. [dead link]
  2. 2.0 2.1 2.2 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; వెబ్ మూలము అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు