జగదాంబిక పాల్
జగదాంబిక పాల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1998 ఫిబ్రవరి 21 నుండి ఫిబ్రవరి 23 వరకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశాడు. ఆయన భారతదేశంలోని ఏ రాష్ట్రానికైనా కేవలం ఒకరోజు ముఖ్యమంత్రిగా అతి తక్కువ కాలం పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.[1]
జగదాంబిక పాల్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 16 మే 2009 | |||
ముందు | మహ్మద్ ముకీమ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | దొమరియాగంజ్ | ||
పదవీ కాలం 1998 ఫిబ్రవరి 21 – 1998 ఫిబ్రవరి 23 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | భర్వలియా, ఉత్తరప్రదేశ్, భారతదేశం | 1950 అక్టోబరు 21||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ అఖిల భారత ఇందిరా కాంగ్రెస్ (తివారీ) అఖిల భారతీయ లోక్‌తాంత్రిక్ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | స్నేహ లతా పాల్ (m. 1975) | ||
సంతానం | 1 కుమారుడు, 2 కుమార్తెలు | ||
పూర్వ విద్యార్థి | అవధ్ విశ్వవిద్యాలయం గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం |
ఆయన 2024 పార్లమెంటు ఎన్నికల తర్వాత 18వ లోక్‌సభలో స్పీకర్ చైర్‌లో లేని సమయంలో సభా కార్యకలాపాలను నిర్వహించడంలో తనకు సహకరించేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నియమించిన చైర్‌పర్సన్‌ల ప్యానెల్‌లో జగదాంబిక పాల్ నియమితుడయ్యాడు.[2][3]
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి
మార్చుజగదాంబిక పాల్ ఉత్తరప్రదేశ్‌లో 24 గంటలు మాత్రమే సీఎంగా పని చేసి రికార్డు సృష్టించాడు. 1998లో ఉత్తరప్రదేశ్‌లో ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్‌ను రాత్రికి రాత్రే అధికారం నుండి తొలగొంచి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, డెమొక్రాటిక్ కాంగ్రెస్‌కు చెందిన జగదాంబిక పాల్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించాడు. ఈ విషయంపై బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత ఈ అంశంపై విచారణ జరపగా సర్వోన్నత న్యాయస్థానం మిశ్రమ బలపరీక్షకు ఆదేశించింది. శాసనసభలో కళ్యాణ్ సింగ్ మెజారిటీ నిరూపించుకోవడంతో ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశాడు. బలపరీక్షలో కళ్యాణ్ సింగ్‌కు 225 ఓట్లు, జగదాంబిక పాల్‌కు 196 ఓట్లు వచ్చాయి.[4][5]
నిర్వహించిన పదవులు
మార్చు- 1982-93 ఉత్తరప్రదేశ్ శాసనమండలి సభ్యుడు (రెండు పర్యాయాలు)
- 1988 - 1999 రాష్ట్ర మంత్రి
- 1998 ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి
- 1993 - 2007 , ఉత్తరప్రదేశ్ శాసనసభ్యుడు (మూడు పర్యాయాలు)
- 2002 రాష్ట్ర మంత్రి
- 2009 దోమరియాగంజ్ సభ్యుడు, శక్తిపై కమిటీ నుండి 15వ లోక్‌సభ (ఐఎన్‌సీ)కి ఎన్నికయ్యాడు; సభ్యుడు, పిటిషన్లపై కమిటీ; సభ్యుడు, పార్లమెంటు సభ్యులపై కమిటీ స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (MPLADs); సభ్యుడు, రసాయన & ఎరువుల కమిటీ; సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, గృహ & పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ & పర్యాటక మంత్రిత్వ శాఖ
- 2014 - 15వ లోక్‌సభ & భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు[6]
- 2014 - దోమరియాగంజ్జ్ నుండి 16వ లోక్‌సభ (బిజెపి)కి ఎన్నికయ్యాడు.
- 2019 - దోమరియాగంజ్ నుండి 17వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.
- 2024 - దోమరియాగంజ్ నుండి 18వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.
మూలాలు
మార్చు- ↑ Deccan Herald (26 November 2019). "Jagadambika Pal holds record of CM with shortest tenure" (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
- ↑ Deccan Herald (1 July 2024). "Jagdambika Pal, A Raja amongst others in panel of chairpersons to help Birla run House" (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
- ↑ The Indian Express (1 July 2024). "Awadhesh Prasad among Lok Sabha panel of chairpersons" (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
- ↑ DNA India (12 May 2014). "The chief minister who wasn't: Jagdambikar Pal" (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
- ↑ "BJP's Jagdambika Pal Stumbles, Falls Down On Stage In Rush To Welcome Yogi Adityanath; See UP CM's Reaction" (in ఇంగ్లీష్). 21 May 2024. Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
- ↑ "Jagdambika Pal resigns from Lok Sabha, Congress". 7 March 2014. Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.