జనగాం ప్రభుత్వ వైద్య కళాశాల
జనగాం ప్రభుత్వ వైద్య కళాశాల అనేది తెలంగాణ రాష్ట్రం, జనగాం జిల్లాలోని జనగాం పట్టణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల. గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఔత్సాహిక వైద్య విద్యార్థులకు వైద్య పరిజ్ఞానాన్ని అందించేందుకు తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం 2023లో ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించింది. ఇది కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ నుండి 2023-24 విద్యా సంవత్సరానికి 100 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి లేఖను అందుకుంది.[1]
రకం | ప్రభుత్వ వైద్య విద్య |
---|---|
స్థాపితం | 2023, సెప్టెంబరు 15 |
అనుబంధ సంస్థ | కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం |
విద్యార్థులు | 100 |
స్థానం | జనగాం, జనగాం మండలం, జనగాం జిల్లా, తెలంగాణ, భారతదేశం |
జాలగూడు | కళాశాల వెబ్సైటు |
ఏర్పాటు
మార్చుజనగామ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చాడు. ఆ హామీ మేరకు జనగాంలో ప్రభుత్వ వైద్య కళాశాలకు 190 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ 2022 ఆగస్టు 6న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (జీఓ ఎంఎస్ నెంబరు 99) జారీ చేసింది.[2][3]
కోర్సులు - శాఖలు
మార్చు- అనాటమీ
- ఫార్మాకాలజీ
- ఫిజియోలాజీ
- బయోకెమిస్ట్రీ
- పాథాలజీ
- మైక్రోబయోలాజీ
- ఫోరెన్సిక్ మెడిసిన్
- జెనరల్ సర్జరీ
- ఆర్థోపెడిక్స్
- ఓటో-రైనో-లారిగోలజీ
- ఆప్తాల్మోలజీ
- జనరల్ మెడిసిన్
- టిబి & ఆర్‌డి
- డివిఎల్
- సైకియాట్రీ
- పీడియాట్రిక్స్
- ఓబిజీ
- అనస్థీషియాలజీ
- కమ్యూనిటీ మెడిసిన్
- రేడియోడియాగ్నోసిస్
- ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్
- టీబీసీడీ
- సీటీ సర్జరీ
- న్యూరో సర్జరీ
- న్యూరాలజీ
- ప్లాస్టిక్ సర్జరీ
- యూరాలజీ
- గాస్ట్రోఎంట్రాలజీ
- ఎండోక్రైనాలజీ
- నెఫ్రాలజీ
- కార్డియాలజీ
- ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్
- ఈఎన్‌టీ
- ఆప్తల్
- అనస్తీషియా
- డెంటల్
తరగతుల ప్రారంభం
మార్చు2023 సెస్టెంబరు 15 నుండి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి 9 వైద్య కళాశాలల ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించాడు.[4][5] ఈ కార్యక్రమంలో కళాశాల నుండి పంచాయితీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ reserved, © Ushodaya Enterprises Pvt Ltd All rights (2023-04-19). "Medical College: జనగామ ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుమతి". EENADU PRATIBHA. Archived from the original on 2023-09-21. Retrieved 2023-09-21.
- ↑ Today, Telangana (2022-08-06). "Telangana govt sanctions Rs 1,479 cr to establish 8 more medical colleges". Telangana Today. Archived from the original on 2022-08-07. Retrieved 2023-09-21.
- ↑ Telugu, 10TV; naveen (2022-08-06). "8 New Medical Collges In Telangana : రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీలు.. పరిపాలన అనుమతులు జారీ చేసిన ప్రభుత్వం". 10TV Telugu (in Telugu). Archived from the original on 2023-09-21. Retrieved 2023-09-21.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ "KCR: వైద్య విద్యలో నవశకం.. 9 మెడికల్ కళాశాలలు ప్రారంభం". EENADU. 2023-09-15. Archived from the original on 2023-09-15. Retrieved 2023-09-21.
- ↑ telugu, NT News (2023-09-15). "CM KCR | ఒకేసారి 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం.. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం ఇది : సీఎం కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-21.