జనగాం మండలం

తెలంగాణ, జనగామ జిల్లా లోని మండలం

జనగాం మండలం, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం జనగాం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 20  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండలం కోడ్: 04699.[3] జనగాం మండలం, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని, జనగామ శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది. ఇది జనగాం రెవెన్యూ డివిజను పరిధి కింద ఉంది.

జనగామ
—  మండలం  —
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, జనగామ స్థానాలు
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, జనగామ స్థానాలు
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, జనగామ స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జనగామ జిల్లా
మండల కేంద్రం జనగాం
గ్రామాలు 20
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 196 km² (75.7 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 92,446
 - పురుషులు 46,807
 - స్త్రీలు 45,639
అక్షరాస్యత (2011)
 - మొత్తం 72.91%
 - పురుషులు 73.57%
 - స్త్రీలు 57.53%
పిన్‌కోడ్ 506167

పునర్య్వస్థీకరణ ముందు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

పునర్య్వస్థీకరణ ముందు జనగాం మండలం వరంగల్ జిల్లా, జనగాం రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా జనగాం మండలాన్ని కొత్తగా ఏర్పడిన జనగాం జిల్లా, జనగాం రెవెన్యూ డివిజను పరిధిలోకి 20 (1+19) గ్రామాలతో చేర్చుతూ, ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1] జనగాం మండల హెడ్ క్వార్టర్ జనగాం పట్టణం.ఇది సముద్ర మట్టానికి 380 మీటర్ల ఎత్తులో ఉంది. తెలుగు ఇక్కడ స్థానిక భాష. అలాగే ప్రజలు ఉర్దూ మాట్లాడతారు.

గణాంకాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం జనగాం మండలం మొత్తం జనాభా 92,446. వీరిలో 46,807 మంది పురుషులు కాగా, 45,639 మంది మహిళలు ఉన్నారు.మండలంలో మొత్తం 22,097 కుటుంబాలు నివసిస్తున్నాయి.[4] మండల పరిధిలోని 56.7% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 43.3% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 82.4% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 60.5%గా ఉంది. మండలంలోని పట్టణ ప్రాంతాల సెక్స్ నిష్పత్తి 958 కాగా, గ్రామీణ ప్రాంతాలు 998 గా ఉంది.మండలంలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 9207 గా ఉంది. ఇది మొత్తం జనాభాలో 10%గా ఉంది.మండల పరిధిలో 0 - 6 సంవత్సరాల మధ్య 4711 మంది మగ పిల్లలు ఉండగా, 4496 మంది ఆడ పిల్లలు ఉన్నారు.మండలం మొత్తం అక్షరాస్యత 72.91% కాగా, పురుష అక్షరాస్యత రేటు 73.57% ఉండగా, స్త్రీ అక్షరాస్యత రేటు 57.53%గా ఉంది.[4]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 196 చ.కి.మీ. కాగా, జనాభా 92,446. జనాభాలో పురుషులు 46,807 కాగా, స్త్రీల సంఖ్య 45,639. మండలంలో 22,097 గృహాలున్నాయి.[5]

సమీప నగరాలు

మార్చు

భువనగిరి, సిద్దిపేట, వరంగల్, జనగామ మండలానికి సమీప నగరాలు.

సమీప పర్యాటక ప్రదేశాలు

మార్చు

వరంగల్ కోట, భువనగిరి కోట, హైదరాబాద్, మెదక్, ఖమ్మం, నాగార్జున్‌సాగర్ ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు చూడటానికి సమీపంలో ఉన్నాయి.

మండల రాజకీయాలు

మార్చు

ఈ ప్రాంతంలో టిడిపి, టిఆర్ఎస్, ఐఎన్‌సి ప్రధాన రాజకీయ పార్టీలు.ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (టిఆర్ఎస్ పార్టీ). జనగాం మండలం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ప్రస్తుత ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. జనగాం
  2. గోపరాజపల్లి
  3. పెద్దపహాడ్
  4. వెంకిర్యాల
  5. అడవికేశ్వాపూర్
  6. ఎర్రగొల్లపహాడ్
  7. మరిగడి
  8. గంగుపహాడ్
  9. వడ్లకొండ
  10. ఓబుల్‌కేశ్వాపూర్
  11. పెద్దరామంచర్ల
  12. చౌదర్‌పల్లి
  13. సిద్దెంకి
  14. పసరమడ్ల
  15. యెల్లంల
  16. పెంబర్తి
  17. శామీర్‌పేట
  18. చీతాకోడూరు
  19. చౌడారం
  20. యశ్వంతాపూర్

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Jangaon.pdf
  2. "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "Jangaon Mandal Villages, Warangal, Andhra Pradesh @VList.in". vlist.in. Archived from the original on 2017-07-23. Retrieved 2020-06-24.
  4. 4.0 4.1 "Jangaon Mandal Population, Religion, Caste Warangal district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2020-06-25. Retrieved 2020-06-24.
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

మార్చు