విశ్వనాథ సత్యనారాయణ సంపాదకత్వంలో ప్రభవ నామ సంవత్సరం (జూలై, 1927)లో వెలువడిన సాహిత్య పత్రిక జయంతి.

"కవి సమ్రాట్" బిరుదాంకితుడు. తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.
విశ్వనాథ సత్యనారాయణ

ఒక సంవత్సరం వెలువడి పత్రిక ఆగిపోయింది. 1958లో విశ్వనాథ గారు గౌరవ సంపాదకులుగా, మల్లంపల్లి సోమశేఖరశర్మ, దివాకర్ల వేంకటావధాని, కేతవరపు రామకోటిశాస్త్రి, జువ్వాడి గౌతమరావు సహాయ సంపాదకులుగా జయంతి మాసపత్రికగా తిరిగి ప్రారంభమైంది.

సరికొత్త జయంతి 2003లో ప్రారంభించబడింది. దీనికి కూడా జువ్వాడి గౌతమరావు ముఖ్య సంపాదకులు. వెలిచాల కొండలరావు కార్యనిర్వాహక సంపాదకులు.

శ్లోకం

మార్చు

జయంతి తే సుక్రితినో
రససిద్ధాః కవీశ్వరాః

1958 శీర్షికలు[1]

మార్చు
  • సంపాదకీయము
  • అభిజ్ఞాన శాకుంతలము - విశ్వనాథ సత్యనారాయణ
  • తెలుగుకవితలో క్రొత్తతీరుతెన్నులు - రాయప్రోల నుండి దేవులపల్లి వరకు - రమణారెడ్డి
  • కార్యసాధకుల మహాకావ్యం - బుచ్చిబాబు
  • ముత్యాల శాల - మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి
  • కావ్య స్వరూపము - దివాకర్ల వేంకటావధాని
  • రాయలు - ఆముక్తమాల్యద - మల్లంపల్లి వీరేశ్వరశర్మ
  • సోమరసం - సుందరకాండ - సోమసుందర్
  • శ్రావణ బాధ్రపదాలు - పి. శ్రీదేవి
  • కొన్ని సామెతలు గల చిన్న కథలు - శండిల
  • విరోధులు - ఆంటన్ చెఖోవ్
  • అన్యాపదేశములు - భల్లటుడు
  • పుస్తక సమీక్ష

1960 శీర్షికలు[2]

మార్చు

మూలాలు

మార్చు