జలజం సత్యనారాయణ

తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యావేత్త, సాహిత్యవేత్త, అనువాదకుడు, తెలంగాణ ఉద్యమనాయకుడు.

జలజం సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యావేత్త, సాహిత్యవేత్త, అనువాదకుడు, తెలంగాణ ఉద్యమనాయకుడు. ఉపాధ్యాయుడిగా, జూనియర్, డిగ్రీ కళాశాలలలో అధ్యాపకుడిగా‌ పనిచేసిన జలజం సత్యనారాయణ లిటిల్ స్కాలర్స్ హైస్కూల్ ను‌, న్యూ విజన్ జూనియర్ కళాశాలను స్థాపించాడు. అనేక హిందీ, ఆంగ్ల పుస్తకాలను తెలుగులోకి అనువదించాడు.[1]

జలజం సత్యనారాయణ
జననం
జలజం సత్యనారాయణ

(1939-05-05)1939 మే 5
మరణం2021 నవంబరు 4(2021-11-04) (వయసు 82)
జాతీయతభారతీయుడు
వృత్తివిశ్రాంత ఆచార్యుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
విద్యావేత్త, సాహిత్యవేత్త, అనువాదకుడు, తెలంగాణ ఉద్యమనాయకుడు

జీవిత విషయాలు

మార్చు

సత్యనారాయణ 1939, మే 5న తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్లో జన్మించాడు.

విద్యారంగం

మార్చు

ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించిన సత్యనారాయణ, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ గా పనిచేశాడు. విశ్వవిద్యాలయ ఆచార్యుడు (అసిస్టెంట్ ప్రొఫెసర్) గా పదవీ విరమణ చేశాడు. లిటిల్ స్కాలర్ విద్యాసంస్థలను స్థాపించి 50 ఏళ్ళకు పైగా విద్యార్థులకు ఉత్తమ సేవలు అందించాడు.[2]

రచనా ప్రస్థానం

మార్చు

విద్యార్థులకు పాఠాలు చెబుతూనే సాహిత్యంపై ఉన్న ఇష్టంతో అనేక రచనలు, అనువాదాలు చేశాడు. "మానవుడే మా సందేశం" అనే సంకలనాన్ని ఆయన వెలువరించాడు. భారతదేశ మాజీ ప్రధానమంత్రి వాజ్ పాయ్ కవిత్వాన్ని శిఖరం పేరుతో తెలుగులోకి అనువదించాడు.[3] అలాగే కబీరు దాస్ కవిత్వాలను కబీర్ గీత (2018) అనే పేరుతో, ఫైజ్ మహ్మద్ గ్రంథాలు కూడా తెలుగులోకి రాశాడు. పన్నెండు హిందీ పుస్తకాలను తెలుగులోకి అనువదించాడు.

ఇతర వివరాలు

మార్చు

సత్యనారాయణ 2021, నవంబరు 4న మరణించాడు.[4]

మూలాలు

మార్చు
  1. నమస్తే తెలంగాణ, తెలంగాణ (4 November 2021). "ప్రముఖ విద్యావేత్త జలజం సత్యనారాయణ కన్నుమూత.. మంత్రి నిరంజన్ రెడ్డి సంతాపం". Namasthe Telangana. Archived from the original on 4 November 2021. Retrieved 5 November 2021.
  2. "ప్రముఖ సాహితీవేత్త జలజం సత్యనారాయణ కన్నుమూత". etelangana.org (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-11-08.
  3. "సృజనాత్మక అనువాదంలో అలతి పదాల సోయగం | Andhrabhoomi - Telugu News Paper". www.andhrabhoomi.net. 2017-03-03. Archived from the original on 2021-11-08. Retrieved 2021-11-08.
  4. "విద్యావేత్త జలజం కన్నుమూత". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-11-05. Archived from the original on 2021-11-06. Retrieved 2021-11-08.