జాన్ మథాయ్ CIE (1886–1959) స్వతంత్ర భారతదేశం మొదటి రైల్వే మంత్రిగా [1] భారతదేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఒక ఆర్థికవేత్త, [2]జాన్ మథాయ్ 1886 జనవరి 10న క్రైస్తవ కుటుంబంలో చల్లియాల్ థామస్ మత్తై అన్నా తయ్యిల్ దంపతులకు జన్మించాడు. [3] మద్రాసు విశ్వవిద్యాలయం జాన్ మథాయ్ ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. జాన్ మథాయ్ 1922 నుండి 1925 వరకు మద్రాసు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేశాడు [4] జాన్ మథాయ్ భారతదేశ ఆర్థిక మంత్రిగా రెండు రెండుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టాడు, కానీ ప్రణాళికా సంఘం అధ్యక్షుడు PC మహలనోబిస్ పెత్తనానికి నిరసనగా ఆర్థిక శాఖ మంత్రి పదవికి జాన్ మథాయ్ రాజీనామా చేశాడు. [5] [6] 1955లో ఏర్పాటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు జాన్ మథాయ్ తొలి చైర్మన్ గా పని చశాడు. జాన్ మథాయ్ న్యూఢిల్లీలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) సంస్థను స్థాపించాడు. జాన్ మథాయ్ 1955 నుండి 1957 వరకు ముంబై విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా పనిచేశాడు. [7] తరువాత 1957 నుండి 1959 వరకు కేరళ విశ్వవిద్యాలయానికి మొదటి వైస్ ఛాన్సలర్‌గా పనిచేశాడు. జాన్ మథాయ్ మేనల్లుడు, వర్గీస్ కురియన్, ప్రముఖ పాల సంస్థ అమూల్ [8]వ్యవస్థాపకుడు. జాన్ మథాయ్ భార్య, అచ్చమ్మ మత్తాయి భారతీయ సామాజిక కార్యకర్త . [9] సమాజానికి జాన్ మథాయ్ చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 1954లో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది, [10]

జాన్ మాథాయ్
స్టేట్ బ్యాంక్ చైర్మన్
In office
1955 జూలై 1 – 1956 సెప్టెంబర్ 30
ప్రథాన మంత్రిజవహర్లాల్ నెహ్రూ
అంతకు ముందు వారుప్రారంభమైంది
తరువాత వారుహెచ్.వి.ఆర్. లింగల్
భారతదేశ ఆర్థిక మంత్రి
In office
1948 సెప్టెంబర్ 22 – 1950 జూన్ 1
తరువాత వారుసి.డి. దేశముఖ్
వ్యక్తిగత వివరాలు
జననం(1886-01-10)1886 జనవరి 10
కోజికోడ్ కేరళ భారతదేశం
మరణం1959 ఫిబ్రవరి ( 73)
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
కళాశాలమద్రాస్ క్రిస్టియన్ కాలేజ్

, [11] [12] 1959లో జాన్ మథాయ్ పద్మవిభూషణ్ అవార్డును పొందారు.

మూలాలు మార్చు

  1. "Dominion of India: Distribution of Portfolios in New Govt". Amrita Bazar Patrika. 21 August 1947. p. 6. Retrieved 17 January 2023.
  2. Reflections on Finance Education and Society. Motilal Banarsidass Publication. p. 114. ISBN 9788120830752. Retrieved 2009-07-22.
  3. Haridasan, Dr. V. (2000). Dr. John Matthai, 1886-1959 : a biography. Kozhikode: Publication Division, University of Calicut. pp. 1–2, 8–9. ISBN 978-8177480085.
  4. "University of Madras: Department of Economics". Archived from the original on 2008-10-29. Retrieved 2009-01-23.
  5. "Men who shaped up India's economy". The Economic Times. 2007-02-21. Retrieved 2019-04-04.
  6. "The Concept of Collective Ministerial Responsibility in India- Theory and Practice". Rostrum's Law Review (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-01-02. Archived from the original on 4 April 2019. Retrieved 2019-04-04.
  7. (1957). "A Message By the Vice-Chancellor".
  8. "The Nephew Of Our First Railway Minister Was The Architect Of 'White Revolution'". The Logical Indian (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-06-14. Retrieved 2019-04-04.
  9. Bela Rani Sharma (1998). Women's Rights and World Development. Sarup & Sons. ISBN 9788176250153. Retrieved 31 March 2015.
  10. "Padma Shri" (PDF). Padma Shri. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 11 November 2014.
  11. London Gazette, 4 June 1934
  12. "Padma Vibhushan Awardees". The National Portal of India. Archived from the original on 2012-02-29. Retrieved 2009-07-10.