జి.ఎల్.ఎన్.శాస్త్రి

జి.ఎల్.ఎన్.శాస్త్రి ప్రముఖ హోమియో వైద్యులు.[1] ఆయన ఆంధ్రప్రదేశ్ లో హోమియోపతి పితామహునిగా పేరుపొందారు.

జివిత విశేషాలుసవరించు

డా. జి.ఎల్.ఎన్.శాస్త్రి ఆగస్టు 15 1930కృష్ణా జిల్లా నందిగామలో జన్మించారు. ఆయన డా.గురురాజు హోమియో మెడికల్ కాలేజి, గుడివాడలో 1947 నుండి 1951 వరకు విద్యనభ్యసించారు. ఆయన ఐ.ఐ.హెచ్.పికు వ్యవస్థాపక సభ్యులు, గౌరవాధ్యక్షులు.[1] ఆయన ఏప్రిల్ 2 2013 న మరణించారు. ఆయనకు పిల్లలు లేరు.

సేవలుసవరించు

ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ హోమియో ఆసుపత్రులలో మెడికల్ ఆఫీసరుగా పనిచేసారు. ఆయన మలక్ పేట ప్రభుత్వ హోమియో హాస్పటల్ కు సూపరింటెండెంట్ గానూ, ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రభుత్వ హోమియో కళాశాలలలో ప్రొఫెసరుగానూ, ప్రిన్సిపాల్ గానూ పనిచేసారు. ఆయన 1990-97 మధ్య సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతిలో సభ్యునిగా తన సేవలందించారు.ఆయన బిసిటి ప్రోగ్రాం (బెల్లడోన, కాల్సెరియా, టుబెర్‌కులినం) కు ముఖ్య నిర్మాణ శిల్పి. ఆయన వ్యవస్థాపక సభ్యునిగా 1986-95 మధ్య సెక్రటరీ జనరల్ గానూ, నేషనల్ ప్రెసిడెంటుగా (1995-98), అనేక సంవత్సరాల వరకు సలహాదారునిగా పనిచేసారు. ఆయన 1982-86 మధ్య ఐ.ఐ.హెచ్.పి యొక్క అధికార భాగం ఐన రేషనల్ మెడిసన్ కు మేనేజింగ్ డైరక్టరుగా పనిచేసారు.[1]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 "Dr. G.L.N. Sastry, Veteran Homeopath passes away". homoeotimes.com/.

ఇతర లింకులుసవరించు