జీవీజీ రాజు (జననం 1962 ఏప్రిల్ 12) భారతీయ చలనచిత్ర నిర్మాత. తెలుగు చిత్రసీమలో తొలి ప్రేమ (1998), గోదావరి (2006) వంటి ట్రెండ్‌సెట్టింగ్ చిత్రాలను నిర్మించడంలో ప్రసిద్ధి చెందాడు. అతను ఈ చిత్రాలకు గానూ జాతీయ అవార్డు, నంది అవార్డులను గెలుచుకున్నాడు. అతను తమిళ చిత్రనిర్మాత కూడా.

కెరీర్ మార్చు

కామర్స్‌లో డిగ్రీ పట్టాపుచ్చుకున్న ఆయన ఉన్నత విద్య కోసం చెన్నైచేరుకున్నాడు. 1978లో రామచిలక వంటి విభిన్న చిత్రాలతో ఆయన సినిమా నిర్మాతగా కెరీర్ మొదలుపెట్టాడు. ఇందులో వాణిశ్రీ, చంద్ర మోహన్ ప్రధాన తారాగణం. మీరా జాస్మిన్, గోపీచంద్ నాయకినాయకులుగా 2006లో రారాజు; 1988లో రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన తోడల్లుళ్ళు చిత్రాలు నిర్మించాడు. 1998లో ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి నటించిన తొలి ప్రేమ వచ్చింది. ఇవేకాకుండా తెలుగులో చిరుజల్లు(2001), గోదావరి(2008) చిత్రాలతోపాటు 2000ల ప్రీత్సు తప్పెనిల్లా తమిళ చిత్రం నిర్మించాడు. కాగా జివిజి రాజు నిర్మాతగా సిప్పై అనే తమిళ సినిమా 2023లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో గౌతమ్ కార్తీక్, లక్ష్మీ మీనన్ జంటగా నటించగా శరవణన్ దర్శకత్వం వహించాడు.

వ్యక్తిగతం మార్చు

జి.వి.జి.రాజు తెలుగు సీనియర్ నటుడు హరనాథ్ కుమార్తె పద్మజను వివాహం చేసుకున్నాడు. వీరికి శ్రీరామ్, శ్రీనాథ్ లనే ఇద్దరు సంతానం. డాక్టర్ కంపల్లి రవిచంద్రన్ రచించగా తన తండ్రి హరనాథ్ జీవితంపై అందాల నటుడు అనే పుస్తకాన్ని ప్రచురించి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె 54 ఏళ్ల వయసులో 2022 డిసెంబరు 20న గుండెపోటుతో హైదరాబాదులో మరణించంది.[1]

అవార్డులు మార్చు

  • 1999లో ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డు (తొలి ప్రేమ)
  • 2000లో తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం (తొలి ప్రేమ)
  • 2008లో - రెండవ ఉత్తమ చలన చిత్రంగా నంది అవార్డు (గోదావరి)

మూలాలు మార్చు

  1. "Padmaja raju: 'తొలిప్రేమ' నిర్మాతకు భార్యా వియోగం". web.archive.org. 2022-12-21. Archived from the original on 2022-12-21. Retrieved 2022-12-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)