జీవన జ్యోతి (1988 సినిమా)
జీవన జ్యోతి 1988 నాటి తెలుగు సినిమా. దీనిని నవ భారత్ ఆర్ట్ మూవీస్ బ్యానర్‌లో డి. ప్రతాప్ రాజు నిర్మించగా, రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు . ఇందులో శరత్ బాబు, జయసుధ, రాజేంద్ర ప్రసాద్, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్-కోటి సంగీతం సమకూర్చారు.[1][2]
జీవన జ్యోతి (1988 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రేలంగి నరసింహా రావు |
---|---|
తారాగణం | శరత్ బాబు , జయసుధ , మనోచిత్ర |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | నవభారత్ ఆర్ట్ మూవీస్ |
భాష | తెలుగు |
కథ
మార్చుఈ చిత్రం ధనవంతులైన ఆదర్శ దంపతులు శ్రీధర్ (శరత్ బాబు), కల్యాణి (జయసుధ) లపై ప్రారంభమవుతుంది. వారు సంతానం లేని చింతలో ఉంటారు. వారి పనివాడు అక్బర్ (రాజేంద్ర ప్రసాద్) ను, కల్యాణి తన కొడుకుగా భావించి ప్రేమిస్తుంది. అతను కూడా ఆమె పట్ల అలాంటి భావన తీనే ఉంణ్టాడు. అక్బర్ నూర్జహాన్ (కుష్బూ) ను ప్రేమిస్తాడు. వివాహం చేసుకుంటాడు. ఇంతలో, కళ్యాణి గర్భవతి అవుతుంది, కానీ దురదృష్టవశాత్తు, ఆమెకు గర్భస్రావమౌతుంది. ఆమె మళ్ళీ గర్భం ధరించలేదని వైద్యులు చెబుతారు. కాబట్టి, ఆమె శ్రీధర్‌కు అతడి కార్యదర్శి నిర్మల (మనో చిత్ర) తో బలవంతంగా పెళ్ళి చేస్తుంది. నిర్మల తల్లి, గయ్యాళి దుర్గమ్మ (జయ విజయ) ప్రవేశించే వరకు అంతా బాగానే ఉంటుంది. తరువాత, నిర్మల ఒక ఆడ శిశువుకు జన్మనిస్తుంది. కళ్యాణి ఆ శిశువును ప్రేమగా పెంచుతుంది. కొన్నాళ్ళకే, దుర్గమ్మ అల్లకల్లోలం సృష్టిస్తుంది. దీనివల్ల కల్యాణి అక్బర్ & నూర్జహన్‌తో కలిసి ఇంటిని వదిలి వెళ్తుంది. ఏళ్ళు గడుస్తాయి. శ్రీధర్ కుమార్తె పెళ్ళి కుదురుతుంది. అయితే, కాళ్యాణి అప్పటికి అనారోగ్యంతో చావుబతుకుల్లో ఉంటుంది. ఇంతలో, శ్రీధర్ దివాళా తీస్తాడు. కట్నం కారణంగా కూతురు వివాహానికి అంతరాయం కలుగుతుంది. ఆ తరువాత, కళ్యాణి వచ్చి, తన వజ్రాల మంగళసూత్రాన్ని త్యాగం చేసి వారి పెళ్ళి చేస్తుంది. చివరగా, కళ్యాణి తన భర్త ఒడిలో మరణిస్తుంది. అక్బర్ ఆమెకు కర్మ చేస్తాడు.
నటీనటులు
మార్చు- శ్రీధర్ పాత్రలో శరత్ బాబు
- కల్యాణిగా జయసుధ
- అక్బర్‌గా రాజేంద్ర ప్రసాద్
- నూర్జహాన్ పాత్రలో కుష్బూ
- అబ్దుల్లా అలీ ఖాన్‌గా రల్లాపల్లి
- నర్రా వెంకటేశ్వరరావు
- పొట్టి ప్రసాద్
- కెకే శర్మ
- అలీగా జుట్టు నరసింహం
- నిర్మలగా మన చిత్ర
- ఝాన్సీ
- దుర్గమ్మగా జయ విజయ
- జానకి డబ్బింగ్
- నిర్మలమ్మ
సంగీతం
మార్చురాజ్-కోటి సంగీతం సమకూర్చారు.
పాటలు:
ఎస్. | పాట | సాహిత్యం | గాయనీ గాయకులు | నిడివి |
---|---|---|---|---|
1 | "సంసారం జీవితం" | జొన్నవిత్తుల | మనో, ఎస్.జానకి | 4:03 |
2 | "ముద్దొచ్చే బుల్బుల్ పిట్టా" | వేటూరి సుందరరామ మూర్తి | మనో, S. జానకి | 3:42 |
3 | "వయారి నడకల దానా" | వేటూరి సుందరరామ మూర్తి | ఎస్పీ బాలు, ఎస్.జానకి | 3:43 |
4 | "గువ్వా గువ్వా జాగ్రత్త" | జొన్నవిత్తుల | ఎస్పీ బాలు | 4:00 |
5 | "నీవేనమ్మా జ్యోతి" | సి.నారాయణ రెడ్డి | కెజే యేసుదాస్ | 3:54 |
మూలాలు
మార్చు- ↑ "Jeevana Jyothi (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-09-29. Retrieved 2020-08-03.
- ↑ "Jeevana Jyothi (Review)". Telugu Cinema Prapancham.