రేలంగి నరసింహారావు
రేలంగి నరసింహారావు తెలుగు సినిమా దర్శకులు. అనేక సినిమాలకు దర్శకత్వం వహించి సుపర్ హిట్ కామెడీ చిత్రాల దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్ వంటి హీరోలకు మంచి హిట్ సినిమాలనందించారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, పోలీసు భార్య, చిన్నోడు పెద్దోడు, డబ్బెవరికి చేదు, సంసారం, మామా అల్లుడు, గుండమ్మగారి కృష్ణులు
జీవిత విశేషాలు
మార్చుఆయన పాలకొల్లులో శ్రీరంగనాయకులు, శివరామమ్మ దంపతులకు 1951 సెప్టెంబరు 30 న జన్మించారు.
ఆయన సుమారు 70 చిత్రాలకు దర్శకత్వం వహించారు.[1] ఆయన చిత్రాలలో అధికంగా తెలుగు, కన్నడ చిత్రాలు ఉన్నాయి. తమిళంలో కూడా చిత్రాలను తీసారు. ఆయన తెలుగు టెలివిజన్లో సీరియళ్లకు కూడా దర్శకత్వం వహించారు. సుందరి సుబ్బారావు చిత్రం యొక్క స్క్రీన్ రచనలకు గానూ నంది అవార్డును అందుకున్నారు[2]. ఆ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన దివాకర్ బాబు, శంకరమంచి పార్థసారధి వంటి రచయితలకు చిత్రసీమకు పరిచయం చేసారు.[3] ఆయన సుమన్[3], రేవతి, కిన్నెర వంటి సినిమా నటులను కూడా చిత్రసీమకు పరిచయం చేసారు.
సినిమా ప్రస్థానం
మార్చుసినిమాలలో ప్రవేశం
మార్చుఆయన చిన్నప్పుడు రంగస్థల నాటకాలు వేసేవారు. ఫోటోలు తీసే హాబీ ఉండేది, 14వ యేటనే రంగస్థల నాటకాలు, మోనో యాక్షన్ చేసేవారు. ఆవిధంగా తనలోని నటుడునే పరిశీలించిన తన తండ్రీ, రెడ్డి గారు స్నేహితుడు ద్వారా "బ్రహ్మచారి" నాటకంలో అవకాశం కల్పించారు. అప్పటికి కాలేజిలో పి.యు.సి చదువుతూ విరివిగా నాటకాలు వేసేవారు . అతని క్లాస్ మేట్ అయిన కోడి రామకృష్ణతో కలిసి నాటకాలు వేసేవాడు. బి.యస్.సిలో చేరినా చదువు పై ఆసక్తి లేకపోవడంతో ఆయన నాన్న గారు సినిమా రంగంలో ప్రవేశానికి 1971- మద్రాస్ లో అడుగు పెట్టారు. ఆ విధంగా దర్శకుడైయ్యారు.
1971లో ప్రముఖ దర్శకుడు బి.వి.ప్రసాద్ గారి వద్ద అప్రెంటిస్ గా మహమ్మద్ బిన్ తుగ్లక్ సినిమాకు చేరారు. 1972లో ఆయన కె.ఎస్.ఆర్.దాస్ వద్ద అసిస్టెంట్ డైరక్టరుగా ఊరికి ఉపకారి చిత్రానికి పనిచేసారు. తరువాత ఆయన 1973లో సాగర సంగమం చిత్రానికి దాసరి నారాయణరావు గారి వద్ద పనిచేసారు. 1980లో దర్శకునిగా మారే వరకు దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్ డైరక్టరు, అసోసియేట్ డైరక్టరు, కో డైరక్టరుగా పదుల సంఖ్య లో సినిమాలకు పనిచేసారు.
డైరక్టరుగా
మార్చుఆయన 1980 నుండి దర్శకత్వాన్ని చేపట్టారు. మొదట చందమామ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది పూర్తి కుటుంబ చిత్రం. కానీ ఈ చిత్రం విడుదల ఆలస్యమయింది.[4] ఈ చిత్రం 1982 వరకు విడుదల కాలేదు. ఆయన రెండవ, మూడవ, నాల్గవ సినిమాలు వరుసగా నేను మా ఆవిడ, ఏమండోయ్ శ్రీమతిగారు, ఇల్లంతా సందడి. ఈ చితాలు పరిపూర్ణ హాస్యభరితమైనవి.[4] యాదృచ్ఛికంగా చంద్రమోహన్ తో తీసిన 18 సినిమాలు విజయాలనందించాయి. ఆయన ప్రముఖ సినిమా నటులైన అక్కినేని నాగేశ్వరరావు (దాగుడు మూతల దాంపత్యం), శోభన్ బాబు (సంసారం), కృష్ణంరాజు (యమధర్మరాజు) లతో కూడా సినిమాలూ చేసారు. రాజేంద్ర ప్రసాద్ తో అది ఎక్కువగా 30 సినిమాలకు పైగా నిర్మించారు.
కొన్ని సినిమాలు
మార్చుకామెడీ సినిమాలు
మార్చు- పోలీస్ భార్య
- ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం
- ఇద్దరి పెళ్ళాల ముద్దుల పోలీస్
- రొటేషన్ చక్రవర్తి
- చిక్కడు దొరకుడు
- పరుగో పరుగు
- సుందరి సుబ్బారావు
- పెళ్ళాం చాటు మొగుడు
- సాహసం చేయరా డింబకా
- జ్యోతి బావకు పెళ్ళంట
- ఎలుకా మజాకా (2016)
ప్రేమ కథా చిత్రాలు
మార్చు- తెల్లగులాబిలు
- సంసారము
- శిక్ష
- మానస వీణ
వ్యక్తిగత జీవితం
మార్చుఆయనకు భార్య సాయిలక్ష్మి, ఇద్దరు కుమారులు కిరణ్, సతీష్ ఉన్నారు.
మూలాలు
మార్చు- ↑ A legacy of humour, The Hindu.
- ↑ Nandi Awards List (pp 15) Archived 2015-02-23 at the Wayback Machine, Nandi Awards pdf file.
- ↑ 3.0 3.1 ‘No greater school than a film studio’, The Hindu.
- ↑ 4.0 4.1 Comedy is his forte, The Hindu.