జుగల్ కిషోర్ శర్మ

జుగల్ కిషోర్ శర్మ (జననం 5 డిసెంబర్ 1962) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు జమ్మూ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

జుగల్ కిషోర్ శర్మ
జుగల్ కిషోర్ శర్మ


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
26 మే 2014
ముందు మదన్ లాల్ శర్మ
నియోజకవర్గం జమ్మూ

వ్యక్తిగత వివరాలు

జననం (1962-12-05) 1962 డిసెంబరు 5 (వయసు 61)
జమ్మూ , జమ్మూ కాశ్మీర్ , భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి ఉషా శర్మ
సంతానం 2
నివాసం జమ్మూ
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

రాజకీయ జీవితం

మార్చు

జుగల్ కిషోర్ శర్మ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత బీజేపీ పార్టీలో చేరి 2002, 2008లో నగ్రోటా నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత 2012లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జమ్మూ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ లాల్ శర్మపై గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. జుగల్ కిషోర్ శర్మ 2019 ఎన్నికలలో జమ్మూ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రామన్ భల్లాపై 3,02,875 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

జుగల్ కిషోర్ శర్మ 2024 ఎన్నికలలో జమ్మూ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రామన్ భల్లాపై 1,35,498 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]

మూలాలు

మార్చు
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Jammu". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
  2. "BJP MP Jugal Kishore files papers for Jammu Lok Sabha seat". 31 March 2024. Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
  3. TV9 Bharatvarsh (4 June 2024). "जम्मू लोकसभा चुनाव 2024 परिणाम: BJP से जुगल किशोर ने लगाई जीत की हैट्रिक, कांग्रेस के रमन भल्ला को दी करारी शिकस्त". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)