కోహిమా

నాగాలాండ్ రాష్ట్ర రాజధాని నగరం.

కోహిమా, భారతదేశ ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ రాష్ట్ర రాజధాని నగరం. దాదాపు 1,00,000 జనాభాతో ఇది రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరంగా నిలుస్తోంది.[1] మొదట్లో కెవిరా అని పిలువబడ్డ ఈ కోహిమా, 1878లో బ్రిటీష్ సామ్రాజ్యం లోని నాగ కొండలకు ప్రధాన కార్యాలయంగా ఏర్పాటుచేయబడింది. 1963లో నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత దీనిని అధికారికంగా రాజధానిగా ప్రకటించారు. రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన రక్తపాత యుద్ధాలలో కోహిమా యుద్ధం కూడా ఒకటి. ఈ యుద్ధాన్ని 'తూర్పు స్టాలిన్గ్రాడ్' అని పిలుస్తారు.[2][3] 2013లో బ్రిటిష్ నేషనల్ ఆర్మీ మ్యూజియం, కోహిమా యుద్ధాన్ని 'బ్రిటన్ గొప్ప యుద్ధం' అని ఓటు వేసింది.[4]

కోహిమా
కోహిమా is located in Nagaland
కోహిమా
కోహిమా
భారతదేశంలోని నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి
కోహిమా is located in India
కోహిమా
కోహిమా
కోహిమా (India)
నిర్దేశాంకాలు: 25°40′12″N 94°06′28″E / 25.6701°N 94.1077°E / 25.6701; 94.1077Coordinates: 25°40′12″N 94°06′28″E / 25.6701°N 94.1077°E / 25.6701; 94.1077
దేశం భారతదేశం
రాష్ట్రంనాగాలాండ్
జిల్లాకోహిమా
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకంమున్సిపాలిటీ
 • నిర్వహణకోహిమా మున్సిపల్ కౌన్సిల్
విస్తీర్ణం
 • మొత్తం20 km2 (8 sq mi)
సముద్రమట్టం నుండి ఎత్తు
1,444 మీ (4,738 అ.)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం115,283[1]
పిలువబడువిధం (ఏక)కోహిమియన్
భాషలు
 • అధికారికఇంగ్లీష్
 • ప్రధాన మాండలికాలుఅంగమి • అయో • చాకేసాంగ్ • లోథా • సుమి
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
797001
టెలిఫోన్ కోడ్91 (0)370
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుఎన్ఎల్ - 01
స్త్రీపురుష నిష్పత్తి927 /
జాలస్థలిkohima.nic.in

పద వివరణసవరించు

కోహిమాను మొదట కెవి-రా (కెవి పువ్వు పెరిగే ప్రాంతం) అని పిలిచేవారు.[5] బ్రిటిష్ వారు ఆ పేరును పలకలేనందువల్ల కోహిమా అనే పేరును అధికారికంగా ఇచ్చారు. చాలామంది స్థానిక ప్రజలు 'కెవి-రా' అనే పేరునే ఉపయోగిస్తుంటారు.

 
కోహిమా యుద్ధ శ్మశానవాటిక

భౌగోళికంసవరించు

కోహిమా జిల్లాగా, మున్సిపాలిటీగా, జిల్లా కేంద్రంగా ఉంది. ఈ మున్సిపాలిటీ 20 చ.కి.మీ.ల (7.7 చ.మై) విస్తీర్ణంలో ఉంది. కోహిమాకు దక్షిణాన జాప్ఫే పర్వతం ఉంది. ఇది 25°40′N 94°07′E / 25.67°N 94.12°E / 25.67; 94.12 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[6] ఇది సముద్ర మట్టానికి 1,261 మీటర్ల (4137 అడుగుల) ఎత్తులో ఉంది.[7]

జనాభాసవరించు

నాగాలాండ్ రాష్ట్రంలోని 16 తెగలతో కోహిమా నగర జనాభా ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, కోహిమా నగరంలో 99,039 జనాభా ఉంది. ఇందులో 51,626 మంది పురుషులు, 47,413 మంది స్త్రీలు ఉన్నారు. కోహిమా నగర సగటు అక్షరాస్యత 90.76% కాగా, ఇది జాతీయ సగటు 79.55% కంటే ఎక్కువగా ఉంది. [1]

మతంసవరించు

కోహిమా నగరంలో క్రైస్తవ మతానికి చెందినవారు ఎక్కువగా (జనాభాలో 80.22%) ఉన్నారు. ఇతర మతాలవారిలో హిందువులు (16.09%), ముస్లింలు (3.06%), బౌద్ధులు (0.45%) ఉన్నారు.[1]

పరిపాలనసవరించు

2011 నాటికి కోహిమా నగరంలోని పంతొమ్మిది వార్డులలో ఆరు వార్డులు, 26% మురికివాడలుగా గుర్తించబడ్డాయి. ఇక్కడి జనాభాలో మూడవ వంతు పేదరిక రేఖకు దిగువన ఉన్నారు.[8]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం, కోహిమా మహానగర ప్రణాళిక ప్రాంతంలో 115,283 జనాభా ఉంది. వీరిలో కెఎంసి ప్రాంతం 67% కాగా, కోహిమా గ్రామం 16% గా ఉంది.[8]

రవాణాసవరించు

విమానాశ్రయాలుసవరించు

ఈ నగరానికి 76 కి.మీ. (46 మై.) దూరంలోని దీమాపూర్ విమానాశ్రయం ఉంది.

రహదారులుసవరించు

కోహిమా నగరం మీదుగా 2వ, 29వ జాతీయ రహదారులు వెలుతున్నాయి.

కోహిమా మీదుగా వెళ్లే రహదారులుసవరించు

రైలుసవరించు

కోహిమాకు రైలు సౌకర్యం లేదు. సమీపంలోని దీమాపూర్ పట్టణంలో రైల్వే స్టేషను ఉంది. 2009లో దిమాపూర్ నుండి కోహిమా వరకు రైల్వే మార్గ విస్తరణకు సర్వే చేయబడింది.[9] భూసేకరణపై వివాదం కారణంగా ట్రాక్ తిరిగి పునరుద్ధరించబడి, 2013లో ప్రత్యామ్నాయ మార్గం ప్రతిపాదించబడింది.[10] జుబ్జా రైల్వే స్టేషను పూర్తయితే అది కోహిమా ప్రధాన రైల్వే స్టేషనుగా ఉపయోగపడుతుంది.

విద్యసవరించు

పాఠశాలలుసవరించు

 • మినిస్టర్స్ హిల్ బాప్టిస్ట్ హయ్యర్ సెకండరీ స్కూల్
 • లిటిల్ ఫ్లవర్ హయ్యర్ సెకండరీ స్కూల్
 • మెజార్ హయ్యర్ సెకండరీ స్కూల్

విశ్వవిద్యాలయాలు, కళాశాలలుసవరించు

 • కోహిమా సైన్స్ కళాశాల
 • మోడల్ క్రిస్టియన్ కళాశాల
 • ఆల్డర్ కళాశాల
 • బాప్టిస్ట్ కళాశాల
 • కోహిమా కళాశాల
 • మౌంట్ ఆలివ్ కళాశాల
 • ఓరియంటల్ కళాశాల
 • క్రోస్ కళాశాల
 • ఆధునిక కళాశాల
 • కోహిమా న్యాయ కళాశాల

క్రీడలుసవరించు

ఈ నగరం ఫుట్‌బాల్ క్రీడకు పేరొందంది. నాగాలాండ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడే కోహిమా కోమెట్స్ అనే ఫుట్‌బాల్ జట్టు ఇక్కడ ఉంది.

చిత్రమాలికసవరించు

మూలాలుసవరించు

 1. 1.0 1.1 1.2 1.3 "Kohima City Population Census 2011 - Nagaland". 2011 Census of India. 2015.
 2. Dougherty 2008, p. 159.
 3. Ritter 2017, p. 123
 4. "Britain's Greatest Battles". National Army Museum. Retrieved 6 January 2020.
 5. "History". District Kohima. Retrieved 6 January 2020.
 6. "Maps, Weather, and Airports for Kohima, India". Retrieved 6 January 2020.
 7. "Kohima Home NIC". Retrieved 6 January 2020.
 8. 8.0 8.1 "Kohima CDP Revised" (PDF). Government of Nagaland. July 2006. Archived from the original (PDF) on 7 January 2012. Retrieved 6 January 2020.
 9. Sechü, Neidilhoutuo (26 July 2013). "Slow Train Ride to Zubza". Eastern Mirror. Archived from the original on 4 December 2014. Retrieved 6 January 2020.
 10. "The Sentinel". Archived from the original on 3 March 2016. Retrieved 6 January 2020.

ఇతర లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కోహిమా&oldid=3149366" నుండి వెలికితీశారు