జెండాపై కపిరాజు (సినిమా)

సముద్రఖని దర్శకత్వంలో 2015లో విడుదలైన తెలుగు చలనచిత్రం

జెండాపై కపిరాజు 2015, మార్చి 21న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, శరత్ కుమార్, శివ బాలాజీ, అమలా పాల్, రాగిణి ద్వివేది నటించగా,[2] జి. వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.[3]ఈ చిత్రం ఏకకాలంలో తమిళంలో నిమింధు నిల్ గా జయం రవితో రూపొందించబడి, 2014లో విడుదలయింది. నాని తన కెరీర్‌లో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశాడు. తమిళ సినిమా ఉన్నప్పటికి 2018లో తెలుగు చిత్రం తమిళంలో వెలన్ ఎత్తుత్తిక్కు పేరుతో అనువాదంచేసి విడుదలచేశారు.[4]

జెండాపై కపిరాజు
జెండాపై కపిరాజు సినిమా పోస్టర్
దర్శకత్వంసముద్రఖని
రచనసముద్రఖని
నిర్మాతకె.ఎస్. శ్రీనివాసన్
తారాగణంనాని
శరత్ కుమార్
శివ బాలాజీ
అమలా పాల్
రాగిణి ద్వివేది
గౌరీ నంద
ఛాయాగ్రహణంఎం. సుకుమార్ - ఎం. జీవన్
కూర్పుఎస్.ఎన్. ఫాజిల్
సంగీతంజి. వి. ప్రకాష్ కుమార్
నిర్మాణ
సంస్థ
వాసన్ విజువల్ వెంచర్స్
విడుదల తేదీ
2015 మార్చి 21 (2015-03-21)
దేశంభారతదేశం
భాషతెలుసు

కథా సారాంశం మార్చు

అవినీతిని అస్సలు సహించలేని అరవింద్‌ (నాని) కొందరు ప్రభుత్వ ఉద్యోగులని టార్గెట్‌ చేసి వాళ్ల బండారం బయటపెడతాడు. కౌంటర్‌ ఎటాక్‌లో వాళ్లు అరవింద్‌కి ఎదురుగా అచ్చంగా అలాగే ఉన్న మాయాకన్నణ్‌ని (నాని) తెచ్చి నిలబెడతారు. విజయం సాధిస్తున్నానని అరవింద్‌ అనుకుంటోన్న సమయంలో ఎదురు పడిన మాయాకన్నణ్‌ వల్ల మొత్తం రివర్స్‌ అవుతుంది. మరి అరవింద్‌ అనుకున్నది సాధిస్తాడా లేదా అన్నది మిగతా కథ.

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • రచన, దర్శకత్వం: సముద్రఖని
  • నిర్మాత: కె.ఎస్. శ్రీనివాసన్
  • సంగీతం: జి. వి. ప్రకాష్ కుమార్
  • ఛాయాగ్రహణం: ఎం. సుకుమార్ - ఎం. జీవన్
  • కూర్పు: ఎస్.ఎన్. ఫాజిల్
  • నిర్మాణ సంస్థ: వాసన్ విజువల్ వెంచర్స్

నిర్మాణం - విడుదల మార్చు

2013, ఆగస్టు 1న అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. మొదటి షెడ్యూల్ షూటింగ్ ఒక రోజు తరువాత ప్రారంభమైంది. [5] నాని 24 ఏళ్లు,18 ఏళ్లు ఉన్న వ్యక్తిగా ద్విపాత్రాభినయం చేశాడు. అమలా పాల్ రెండు భాషల్లో ప్రధాన పాత్రలో నటించింది.[6] వాసన్ విజువల్ వెంచర్స్ పతాకంపై కెఎస్ శ్రీనివాసన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.[7] ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలో మేఘనా రాజ్ నటింస్తుందని వార్తలు వచ్చాయి.[8] కానీ తను ఈ చిత్రంలో నటించడం లేదని ట్విట్టర్‌లో తెలిపింది.[9] రాగిణి ద్వివేది ఒక ప్రధాన పాత్రలో నటించింది.[10] 2013, మార్చి నాటికి ఈ చిత్రం షూటింగ్ 50% పూర్తయి, నాని పుట్టినరోజున ఫస్ట్‌లుక్ విడుదల చేయబడింది.[11] అదే నెలలో హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైంది. అక్కడ 3 వారాలపాటు నాని, అమలా పాల్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు.[12] 2013, నవంబరు 26న నాని తన ట్విట్టర్‌లో ఈ చిత్రంలోని తన రెండు పాత్రలకు సంబంధించిన ఫోటోలను విడుదల చేశాడు.[13] 2013, డిసెంబరు 5న పత్రికా నోట్ విడుదలచేసి, ఆ రోజు ఈ చిత్రీకరణ పూర్తయిందని ప్రకటించారు.[14] 2015, మార్చి 21న ఈ చిత్రం విడుదలైంది.[1]

పాటలు మార్చు

జెండాపై కపిరాజు
పాటలు of జెండాపై కపిరాజు by
జి.వి. ప్రకాష్ కుమార్
Released28 డిసెంబరు 2013
Recorded2012
Genreసినిమా పాటలు
Length19:29
Languageతెలుగు
Labelసరిగమ
Producerజి.వి. ప్రకాష్ కుమార్
జి.వి. ప్రకాష్ కుమార్ chronology
జెకె ఎనుమ్ నంబనిన్ వాజ్కై
(2013)
జెండాపై కపిరాజు
(2013)
నాన్ సిగప్పు మనితన్
(2014)

ఈ చిత్రానికి తెలుగు, తమిళ భాషలో జి. వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. రెండు భాషల్లో పాటలకు అవే ట్యూన్లు ఉన్నాయి. 2013, డిసెంబరు 28న హైదరాబాదులోని శిల్పకళా వేదికలో సరిగమ మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[15] ఈ చిత్రంలోని పాటలను అనంత శ్రీరాం రాశాడు.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ఇంతందంగా"  జావేద్ ఆలీ, షాష, జి. వి. ప్రకాష్ కుమార్ 03:25
2. "డోంట్ వర్రీ బీ హ్యాప్పీ"  జై శ్రీనివాస్, ప్రియా హిమేష్ 03:38
3. "రాజాధిరాజా"  హేమచంద్ర 04:34
4. "తెలిసింది"  హరిచరణ్, సైంధవి 04:31
5. "గీతా వర్సెస్"  హరిచరణ్ 03:19
19:29

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Deccan Chronicle, Entertainment (25 May 2018). "Nani's Tolly film dubbed as Velan Ettudhikkum". Anupama Subramanian. Retrieved 7 January 2020.
  2. "Nani-Amala Paul movie is Janda Pai Kapiraju". Times of India. 30 July 2012. Retrieved 7 January 2020.
  3. "Role in Samuthirakani's film a 'sawal': Nani". IndiaGlitz. 9 July 2012. Archived from the original on 12 జూలై 2012. Retrieved 7 January 2020.
  4. Book MyShow, Velan Ettuthikkum. "Velan Ettuthikkum Movie (2018)". BookMyShow.com (in ఇంగ్లీష్). Retrieved 7 January 2020.
  5. "Nani's new film Janda Pai Kapiraju launched". Times of India. February 2014. Retrieved 7 January 2020.
  6. "Amala Paul's in town". Deccan Chronicle. 14 May 2012. Archived from the original on 6 జూలై 2012. Retrieved 7 జనవరి 2020.
  7. "Jayam Ravi, Nani in Samuthirakani's film". Times of India. 15 May 2012. Archived from the original on 27 మే 2013. Retrieved 7 January 2020.
  8. "K-Town celebs wish Samuthirakani good luck". Times of India. 7 July 2012. Archived from the original on 4 అక్టోబరు 2013. Retrieved 7 January 2020.
  9. "Status of Meghnaraj". Twitter. Retrieved 7 January 2020.
  10. "Ragini's loving the busy life". The New Indian Express. 29 October 2013. Archived from the original on 15 మార్చి 2016. Retrieved 7 January 2020.
  11. "Jenda pai Kapiraju is 50% complete". TollywoodAndhra.in. Archived from the original on 9 జూలై 2018. Retrieved 7 January 2020.
  12. "Nani's 'Jenda Pai Kapiraju' new schedule begins". raagalahari.com. Archived from the original on 9 జూలై 2018. Retrieved 7 January 2020.
  13. "Janda Pai Kapiraju: Nani's first look unveiled". Desimartini.com. Archived from the original on 16 జూన్ 2017. Retrieved 7 January 2020.
  14. "Jendapai Kapiraju wraps up shooting". raagalahari.com. Archived from the original on 9 జూలై 2018. Retrieved 7 January 2020.
  15. "Jenda Pai Kapiraju audio to release on Dec 28". The Times of India. Archived from the original on 2 జనవరి 2014. Retrieved 10 January 2020.

ఇతర లంకెలు మార్చు