జి. వి. ప్రకాష్

(జి. వి. ప్రకాష్ కుమార్ నుండి దారిమార్పు చెందింది)

జి. వి. ప్రకాష్ ఒక భారతీయ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు. ఎక్కువగా తమిళ సినిమాలకు సంగీతాన్ని సమకూర్చాడు. 2010 సంవత్సరం మొదట్లో వెలుగులోకి వచ్చాడు.[1] తర్వాత ఇతను సినీ నిర్మాణం, నటనా రంగంలోకి ప్రవేశించాడు. ఇతను ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహ్మాన్ కు మేనల్లుడు. ఇతని భార్య సైంధవి గాయని. ముందుగా రెహమాన్ దగ్గర పలుచిత్రాలకు సంగీత విభాగంలో పనిచేశాడు. కొద్ది రోజులు హ్యారిస్ జయరాజ్ దగ్గర కూడా శిష్యరికం చేసి తరువాత సొంతంగా సంగీత దర్శకత్వం వహించడం ప్రారంభించాడు.[2]

జి. వి. ప్రకాష్ కుమార్
వ్యక్తిగత సమాచారం
ఇతర పేర్లుజి. వి. ప్రకాష్
జననం (1987-06-13) 1987 జూన్ 13 (వయసు 36)
చెన్నై, తమిళనాడు
సంగీత శైలిసినీ సంగీతం
వృత్తిసినీ సంగీత దర్శకుడు, వాయిద్య కారుడు, నేపథ్య గాయకుడు, సినీ నిర్మాత, నటుడు
వాయిద్యాలుగిటార్, పియానో/కీబోర్డు, నేపథ్య గానం
క్రియాశీల కాలం2006–ప్రస్తుతం
జీవిత భాగస్వామిసైంధవి (నేపథ్య గాయని)
పిల్లలు1
బంధువులుఎ. ఆర్. రెహమాన్ (మేనమామ)

వ్యక్తిగత జీవితం మార్చు

ప్రకాష్ తల్లి దండ్రులు జి. వెంకటేష్, ఏ. ఆర్. రిహానా. తల్లి ఏ. ఆర్. రెహ్మాన్ కు అక్క.[3] తల్లి రెహనాకు సంగీతం అంటే ఆసక్తి ఉండటంతో ప్రకాష్ ను నాలుగు సంవత్సరాల వయసు నుంచే శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి పంపించేది. ఆరేళ్ళకి పియానో క్లాసులో చేరాడు. అదే సమయంలో మేనమామ రెహమాన్ ప్రకాష్ కు పాటలు నేర్పించి సినిమాల్లో పాడించాడు. ప్రకాష్ ఏడో తరగతిలో ఉండగా తల్లిదండ్రులు విడిపోయారు. పిల్లలు తండ్రి దగ్గరే ఉండిపోయారు. తల్లి మాత్రం ఒంటరిగా ఉంటూ గాయనిగా తన కెరీర్ ప్రారంభించింది.[4]

జూన్ 27, 2013 న ప్రకాష్ గాయని సైంధవిని చెన్నై లోని మేయర్ రామనాథన్ చెట్టియార్ హాల్ వేదికపై వివాహం చేసుకున్నాడు. సైంధవి, ప్రకాష్ చెట్టినాడ్ విద్యాశ్రమంలో కలిసి చదువుకున్నారు.[5]

కెరీర్ మార్చు

సంగీత రంగం మార్చు

ప్రకాష్ మొదటి సారిగా తన మేనమామ ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన శంకర్ సినిమా జెంటిల్మేన్ కి సౌండ్ ట్రాక్ విభాగంలో పనిచేశాడు. ఇంకా రెహమాన్ ఇతర ప్రాజెక్టుల్లో కూడా పనిచేశాడు.[6] తర్వాత కొద్ది రోజులు హ్యారిస్ జయరాజ్ తో కలిసి పనిచేశాడు. అన్నియన్ (తెలుగులో అపరిచితుడు), ఉన్నాళే ఉన్నాళే అనే రెండు సినిమాల్లో పాటలు పాడాడు.

ప్రకాష్ మొదటిసారిగా ఎస్. శంకర్ నిర్మాణ సారథ్యంలో, వసంత బాలన్ దర్శకత్వంలో వచ్చిన వేయిల్ అనే తమిళ సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు. తరువాత ఎ. ఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన మదరాస పట్టణం అనే సినిమాకు ఇతను కూర్చిన సంగీతం కూడా ఆకట్టుకున్నది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన మయాక్కం ఎన్న అనే సినిమా ధనుష్ హీరోగా ప్రకాష్ కి మూడో సినిమా. ఈ సినిమా సంగీతం కూడా విమర్శకుల ప్రశంసలందుకుంది.

సినీ నిర్మాణం మార్చు

ప్రకాష్ 2013 లో జి. వి. ప్రకాష్ కుమార్ ప్రొడక్షన్స్ పేరుతో స్వంతంగా ఓ నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ మొట్టమొదటి సినిమా, బాలు మహేంద్ర దగ్గర సహాయకుడుగా పనిచేసిన విక్రం సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన మాదా యానై కూట్టం.[7][8]

నటుడిగా మార్చు

2012 లో దర్శకుడు మురుగదాస్ ఇతన్ని చూసి తన సినిమాలో నటించమని అడిగాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. తరువాత ప్రకాష్ మూడు సినిమాల్లో నటించడానికి అంగీకరించాడు. ఆడుకాలం నరేన్ దగ్గర నటనలో శిక్షణ పొందాడు.[9] తెలుగులో వచ్చిన ప్రేమకథా చిత్రమ్ సినిమాకు రీమేక్ అయిన డార్లింగ్ సినిమాలో నటించాడు.

తెలుగులో అనువాదమై ఆయన సినిమాలు మార్చు

పురస్కారాలు మార్చు

  • 2010: సంవత్సరపు ఉత్తమ గీతం పూకల్ పూక్కం తరుణం (మదరాస పట్టణం సినిమా)
  • 2011: ఆడుకాలం తమిళ సినిమాకు ఫిల్మ్ ఫేర్ దక్షిణాది ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారం

మూలాలు మార్చు

  1. "GV Prakash to marry singer Saindhavi". www.filmibeat.com. Archived from the original on 2013-12-20. Retrieved 2016-11-11.
  2. Andhra Jyothy (15 July 2023). "సరిహద్దులు చెరిపేస్తున్న సరిగమపదనిసలు". Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.
  3. "Reihana Interview". Behindwoods. Retrieved 13 May 2013.
  4. "'చికుబుకు రైలే' పాటతో ఐదేళ్లకే సెలబ్రిటీనైపోయా! - Sunday Magazine". www.eenadu.net. Archived from the original on 2020-12-08. Retrieved 2020-12-08.
  5. "GV Prakash-Saindhavi wedding on June 27!". Sify. 17 April 2013. Archived from the original on 19 April 2013. Retrieved 18 April 2013.
  6. "A passion for music". Chennai, India: The Hindu. 28 January 2008. Archived from the original on 29 జనవరి 2008. Retrieved 4 January 2010.
  7. "GV Prakash Kumar turns producer". Indian Express. 6 February 2013. Archived from the original on 18 జూన్ 2016. Retrieved 15 February 2013.
  8. "G V Prakash turns producer". Times of India. 23 January 2013. Archived from the original on 25 డిసెంబరు 2013. Retrieved 15 February 2013.
  9. Sudhir Srinivasan. "On a different note". The Hindu.