జెమిని (English: :Gemini) సరణ్ దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్, నమిత హీరోహీరోయిన్స్ గా 2002లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] ఈ చిత్రాన్ని ఏ.వి.యం. ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత ఎమ్ సరవన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందిచారు. కళాభవన్ మణి, రఘుబాబు, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం, వేణు మాధవ్, సుధాకర్, కోట శ్రీనివాస రావు, ఆహుతి ప్రసాద్, సుజాత, మురళి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ చిత్రానికి మాతృక 2002లో ఇదే పేరుతో విడుదలైన తమిళ సినిమా. అందులో విక్రం, కిరణ్ రాథోడ్ ప్రధాన పాత్రలు పోషించారు.[2]

జెమిని
Gemeni telugu.jpg
దర్శకత్వంసరణ్
రచనపోసాని కృష్ణ మురళి (సంభాషణలు)
స్క్రీన్‌ప్లేసరణ్
కథసరణ్
నిర్మాతఎమ్ సరవన్
నటవర్గందగ్గుబాటి వెంకటేష్
నమిత
ఛాయాగ్రహణంఎ. వెంకటేష్
కూర్పుసురేష్
సంగీతంఆర్. పి. పట్నాయక్
నిర్మాణ
సంస్థలు
పంపిణీదారులుసురేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీలు
2002 అక్టోబరు 11 (2002-10-11)
నిడివి
132 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

విజయవాడలోని జెమిని (వెంకటేష్), లడ్డా (కళాభవన్ మణి) అనే ఇద్దరి రౌడీల కథే ఈ సినిమా. లడ్డా తరపు మనిషి జెమిని మనిషిని చంపుతాడు. దాంతో జెమిని గ్యాంగ్ ఆ వ్యక్తిని కనిపెట్టి చంపేస్తారు. ఈ సంఘటనతో వారిద్దరి మధ్య విరోధం ప్రారంభమౌంతుంది.

అదేసమయంలో జెమిని మార్వాడి అమ్మాయిఐన మనిషా (నమిత) ప్రేమలో పడతాడు. మనిషా రాత్రి కళాశాలలో చదువుతుంటుంది. జెమిని కూడా అదే కళాశాలలో చేరుతాడు. అక్కడ ఇద్దరు ఒక్కరినొకరు ప్రేమించుకుంటారు. విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా విశ్వనాథ్ (మురళి) వస్తాడు. జెమిని, లడ్దులను పట్టుకోని పోలీస్ స్టేషన్ లో పెడతాడు. అప్పుడు వాళ్ళు మాములు మనిషులుగా బ్రతుకుతామని విశ్వనాథ్ ని ఒప్పించి, అతని నుంచి అవకాశం పొందుతారు. జెమిని, లడ్దులు మారారా లేక అలాగే ఉన్నారా...జెమిని, మనిషాల ప్రేమను పెద్దలు అంగీకరించారా లేదా అన్నది మిగతా కథ.[3]

నటీనటులుసవరించు

పాటలుసవరించు

జెమిని
 
ఆర్. పి. పట్నాయక్ స్వరపరచిన సినిమా
విడుదల2002
సంగీత ప్రక్రియపాటలు
నిడివి30:46
రికార్డింగ్ లేబుల్ఆదిత్యా మ్యూజిక్
నిర్మాతఆర్. పి. పట్నాయక్
ఆర్. పి. పట్నాయక్ యొక్క ఆల్బమ్‌ల కాలక్రమణిక
హోలీ
(2002)
జెమిని
(2002)
నీ స్నేహం
(2002)

ఈ చిత్రానికి ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందించాడు.[4] అన్ని హిట్ పాటలు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.

సం.పాటపాట రచయితగానంపాట నిడివి
1."చెలి చెడుగుడు జెమిని"వేటూరి సుందరరామ్మూర్తిఎస్.పి. బాలు, అనురాధ శ్రీరామ్4:04
2."పూలలో తేనే ప్రేమ"వేటూరి సుందరరామ్మూర్తిరాజేష్4:16
3."దిల్ దివాన మైన్ హసీనా"వేటూరి సుందరరామ్మూర్తిఉషా4:15
4."బ్రహ్మ ఓ బ్రహ్మ"కులశేఖర్ఎస్.పి. బాలు4:13
5."చుక్కల్లో కెక్కినాడు"వేటూరి సుందరరామ్మూర్తివందేమాతరం శ్రీనివాస్2:58
6."చెలి చెడుగుడు జెమిని"వేటూరి సుందరరామ్మూర్తిఎస్.పి. బాలు, అనురాధ శ్రీరామ్4:04
7."బంధమే ముల్లు"వేటూరి సుందరరామ్మూర్తిఆర్. పి. పట్నాయక్2:35
8."నడక చూస్తే వయ్యారం"వేటూరి సుందరరామ్మూర్తిశంకర్ మహదేవన్, ఉషా4:12
Total length:30:46

మూలాలుసవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్, తెలుగు సినిమాలు. "జెమిని". telugu.filmibeat.com. Retrieved 10 September 2016.
  2. Krishnamoorthy, Suresh (17 September 2002). "Show with a difference". The Hindu. Archived from the original on 22 June 2014. Retrieved 18 January 2021.
  3. "Gemini Synopsis". apunkachoice.com. Archived from the original on 12 December 2013. Retrieved 18 January 2021.
  4. Rangarajan, Malathi; Kumar, S. R. Ashok (May 31, 2002). "Quite a challenge". The Hindu. Archived from the original on 6 June 2014. Retrieved 18 January 2021.

ఇతర లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=జెమిని&oldid=3846630" నుండి వెలికితీశారు