అనురాధ శ్రీరామ్

గాయని

అనురాధ శ్రీరామ్ సినీ నేపథ్యగాయని. కర్నాటక, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉన్న అనురాధ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వంటి అనేక దేశీయ భాషల్లో అనేక పాటలకు స్వరం అందించింది. ఈమె తల్లి రేణుక దేవి కూడా నేపథ్యగాయని.

అనురాధ శ్రీరామ్
జననం (1970-07-09) 1970 జూలై 9 (వయసు 53)
వృత్తిశాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, సినీ నేపథ్య గాయని
క్రియాశీల సంవత్సరాలు1995 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిశ్రీరాం పరశురాం
తల్లిదండ్రులు
  • మీనాక్షి సుందరం మోహన్ (తండ్రి)
  • రేణుకాదేవి (తల్లి)

వ్యక్తిగత జీవితం సవరించు

అనురాధ శ్రీరామ్‌ పరుశురామ్‌ 1970 జులై 9న చెన్నైలో రేణుకాదేవి, మీనాక్షి సుందరం మోహన్ దంపతులకు జన్మించింది. ఆమె తల్లి రేణుక దేవి కూడా నేపథ్య గాయని కావడం విశేషం. అనురాధ ప్రాథమిక విద్య కోయంబత్తూరు, చైన్నెలలో జరిగింది.[1] చెన్నైలోని క్వీన్స్‌ మేరి కళాశాల నుంచి సంగీతంలో బ్యాచిలర్‌ డిగ్రి, మాస్టర్‌ డిగ్రీని సంపాదించింది.[2] డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ లెవల్‌లో ఆమె బంగారు పతకం సాధించడంతో ఆమెకు ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లడానికి ప్రభుత్వం తరపున ఉపకార వేతనం లభించింది. శాస్త్రీయ సంగీతంలో ఉద్దండులైన ఎస్‌. కళ్యాణరామన్‌ నుంచి ఆమె కర్నాటక శాస్త్రీయ సంగీతంలో, మాణిక్‌ బువా టాకుర్‌ దాస్‌ వద్ద హిందుస్తానీ సంగీతంలో ప్రావీణ్యం పొందింది.

ఈమె కోలీవుడ్‌, టాలీవుడ్ లతోపాటు బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు పొందిన నేపథ్యగాయని. తమిళం, తెలుగు, మళయాళం, కన్నడ, హిందీ చిత్రాలలో అనేక పాటలకు తన స్వరాన్నందించింది.

కెరీర్‌ సవరించు

1980లో కాళి అనే తమిళ చిత్రంతో బాలనటిగా తమిళ సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[3] ఉద్దండుల వద్ద శాస్త్రీయ సంగీతం శిక్షణ పొందాక అనురాధ అనేక కచేరీలలో తన గాత్రాన్ని వినిపించి సంగీతాభిమానులను అలరించింది. తమిళ చిత్రం ‘గోపుర దీపం’ (1997) లో ‘ఉల్లామే ఉనకుతన్‌’ అనే పాట ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఏ.ఆర్‌. రెహ్మాన్‌ కోసం ఆమె తొలిసారి 1995లో ఇందిరా అనే చిత్రంలో ఇని అచ్చం ఇళ్లై అనే పాటును సోలోగా పాడింది.

సినిమాలు సవరించు

ప్రస్థానం సవరించు

కర్నాటక సంగీతంలో ప్రావీణ్యం గడించిన అనురాధ ప్రపంచవ్యాప్తంగా దాపు వెయ్యికి పైగా కచేరీలలో తన గాత్రాన్ని వినిపించి శాస్త్రీయ సంగీతాభిమానులను అలరించింది. ఆమెకు జానపదాలు పాడటం అంటే ఎంతో ఆసక్తి. తన భర్త విద్వాన్‌ శ్రీరామ్‌ పరుశురామ్‌తో కలిసి అనేక జుగల్బందీ ప్రదర్శనలను ఇచ్చింది.[4] పరుశురామ్‌ హిందుసాని సంగీతంలో విద్వాంసుడు. నేటి వరకు ఆమె వివిధ భాషల్లో దాదాపు 3 వేలకుపైగా పాటలను పాడి శ్రోతలను అలరించింది.

చిత్రాలలో సవరించు

కర్నాటక సంగీతంలో వివిధ రాగాలపై మంచిపట్టు ఉండటంతో ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. ఈ సమయంలోనే ఆమె ప్రతిభను గుర్తించిన ఏ.ఆర్.రెహ్మాన్ తన చిత్రం ఇందిర అనే చిత్రంలో ఇని అచ్చం ఇళ్లే అనే పాటను పాడేందుకు అవకాశం ఇచ్చారు. తరువాత ఆమె దిల్‌సే (తెలుగులో ప్రేమతో) వంటి అనేక చిత్రాలలో రెహ్మాన్‌తో కలిసి పనిచేసింది.

అవార్డులు సవరించు

  • బెస్ట్‌ సెన్సేషనల్‌ సింగర్‌ అవార్డు - మలై కొట్టా (2007)
  • సౌత్‌ స్క్రీన్‌ విడియోకాన్‌ అవార్డు- చెన్నై గాళ్‌
  • ది ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా గోల్డ్‌ మెడల్‌ అవార్డు
  • ఉత్తమ నేపథ్యగాయనీ అవార్డు- ఆశై (1995)
  • డాజె.జయలలితా సినీ అవార్డు
  • 3 సార్లు ఉత్తమ నేపథ్యగాయనీ అవార్డు
  • కళైమామని అవార్డు
  • అజంతా అవార్డు (1996)
  • నాళం నాళం ( జాతీయ ఉత్తమ గాయనిగా నామినేషన్‌)
  • ‘జెమిని’ చిత్రంలో పాటకు గాను ఐఐఎఫ్‌ఏ ఉత్తమ నేపథ్య గాయనీ
  • అనురాధ సాధించిన విజయాలకు, సంగీతరంగానికి చేసిన కృషికి సత్యభామ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అందించింది (2012)[5]

సంగీత దర్శకులు సవరించు

ఏ.ఆర్‌.రెహ్మాన్‌, తమన్, ఎస్‌.నారాయణ్‌, నదీమ్‌-శ్రవణ్‌, గంగై అమరాన్‌, విద్యాసాగర్‌, జి. వి. ప్రకాష్, గోపి సుందర్‌, ధీనా, ఎమ్.ఎమ్. కీరవాణి, భరద్వాజ్‌, హారిస్ జయరాజ్, సందీప్ చౌతా, ఆర్పీ పట్నాయక్, అను మాలిక్‌, దేవా, కోటి, ఇళయరాజా, ఆనంద్‌ రాజ్‌ ఆనంద్‌ మొదలైన సంగీత దర్శకులతో పనిచేసింది.

తెలుగులో సవరించు

క్రమ సంఖ్య సినిమా పేరు పాట పేరు సంవత్సరం ఇతర వివరాలు
1 రగడ ఏంపిల్లో 2011
2 విలన్‌ కానల చిలకా 2010
3 బంగారం మస్తీ మారో 2007
4 సీతయ్య ఒక్క మగాడు 2003
5 జెమిని చెలి చెడుగుడు 2003
6 శ్రీ మంజునాథ ఆకాశమై ఆకారమై 2002
7 నువ్వే కావాలి అమ్మమ్మ తాతయ్యలు 2001
8 ప్రేమకథ దేవుడు కరుణిస్తాడని 2000
9 కలిసుందాం రా పసిఫిక్‌లో 1999
10 వాలి 1999
11 ప్రేమకు వేళాయెరా 1999
12 మాంగల్య భాగ్యం 1998
13 మెరుపు కలలు 1997
14 సుస్వాగతం మారో మారో 1997
15 ప్రేమించుకుందాం రా పెళ్ళి కళ 1997
16 పవిత్ర బంధం 1996
17 ప్రేమలేఖ 1996
18 భార్గవ్ 1991
19 పుట్టింటి పట్టుచీర 1990
20 ఆల్ రౌండర్ 1984

మూలాలు సవరించు

  1. "Alumni-PSBB Schools". psbbschools.ac.in. Archived from the original on 1 నవంబరు 2020. Retrieved 31 July 2020.
  2. "Queen Mary's College, the home of musicians, on song". B Sivakumar. 5 January 2015. Retrieved 31 July 2020.
  3. Naman Ramachandran (12 December 2012). Rajinikanth: A Birthday Special. Kasturi & Sons Ltd. pp. 65–. GGKEY:A78L0XB1B0X.
  4. "rediff.com: Movies: A duet for life: Anuradha and Sriram Parasuram". Rediff.com. Retrieved 31 July 2020.
  5. "Honoris Causa". Sathyabama University. 26 April 2012. Archived from the original on 16 September 2020. Retrieved 31 July 2020.

ఇతర లంకెలు సవరించు

సూర్య.కామ్ లో అనురాధ శ్రీరామ్ గురించిన వ్యాసం[permanent dead link]