జేబు దొంగ (1987 సినిమా)
జేబుదొంగ ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1987లో విడుదలైన చిత్రం.[1] ఇందులో చిరంజీవి, భానుప్రియ, రాధ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని రోజా మూవీస్ పతాకంపై ఎం. అర్జునరాజు, ఎం. రామలింగరాజు నిర్మించారు. కె. చక్రవర్తి సంగీతం అందించాడు. గొల్లపూడి మారుతీరావు ఈ చిత్రానికి కథ అందించాడు. పి. సత్యానంద్ మాటలు రాశాడు.
జేబుదొంగ | |
---|---|
దర్శకత్వం | ఎ. కోదండరామిరెడ్డి |
రచన | గొల్లపూడి మారుతీరావు (కథ) |
నిర్మాత | ఎం. అర్జునరాజు, ఎం. రామలింగరాజు |
తారాగణం | చిరంజీవి, భానుప్రియ, రాధ, |
ఛాయాగ్రహణం | లోక్ సింగ్ |
కూర్పు | ఎం. వెల్లై స్వామి |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | రోజా మూవీస్ |
పంపిణీదార్లు | గీతా ఆర్ట్స్ |
విడుదల తేదీ | 25 డిసెంబరు 1987 |
సినిమా నిడివి | 142 ని. |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుజిమూంబా అనే విదేశీయుడు కొంతమంది భారతీయులతో కలిసి దేశ అభివృద్ధిని కుంటుపరచడానికి కొన్ని పథకాలు రచిస్తుంటాడు. దేశంలో అనేక చోట్ల ఈ ముఠా అల్లర్లకు పాల్పడుతూ ఉంటుంది. ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి వస్తుంది. ముఠా రహస్యాలను బయట పెట్టడం కోసం సిబిఐ ఒక ఏజెంటును నియమిస్తారు. అతను రహస్యాలను సేకరించాడని తెలుసుకున్న ముఠా అతని కుటుంబంతో సహా చంపేస్తారు.
తారాగణం
మార్చు- చిట్టిబాబు/చక్రపాణిగా చిరంజీవి
- భానుప్రియ
- రాధ
- షణ్ముఖ శ్రీనివాస్
- రఘువరన్
- జిమూంబా గా కన్నడ ప్రభాకర్
- బాబు ఆంటోని
- కోట శ్రీనివాసరావు
- కైకాల సత్యనారాయణ
- గొల్లపూడి మారుతీరావు
- గిరిబాబు
- రాళ్ళపల్లి
- అన్నపూర్ణ
- వరలక్ష్మి
- కుయిలి
- ప్రసాద్ బాబు
- హరి ప్రసాద్
- ప్రసన్న కుమార్
- సాక్షి రంగారావు
- కె.కె.శర్మ
- సత్తిబాబు
- టెలిఫోన్ సత్యనారాయణ
- జనార్ధన్
- థమ్
- డా. మదన్ మోహన్
- బుచ్చిరామయ్య
- పట్టాభి
- పోలారావు
- పొట్టి వీరయ్య
నిర్మాణం
మార్చుఇందులో చిరంజీవి చిల్లరదొంగ, ఆఫీసరుగా ద్విపాత్రాభినయం చేశాడు. భానుప్రియ, రాధ కథానాయికలుగా నటించాడు. రఘువరన్, కన్నడ ప్రభాకర్ ప్రతినాయక పాత్రల్లో నటించారు. కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు సీబీఐ ఆఫీసర్లుగా కనిపించారు.
సంగీతం
మార్చుఈ సినిమాకు కె. చక్రవర్తి సంగీతం అందించాడు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్. జానకి, కె. ఎస్. చిత్ర పాటలు పాడారు.
పెదవి పెదవి , గానం:.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
పోరా కుయ్యా , గానం.ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం. ఎస్ జానకి
తట్టుకోలేనబ్బి , గానం:ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
ఆ అది గుంట ,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,కె ఎస్ చిత్ర
రాజుల్లో రాజ్యలక్ష్మి , గానం.ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
హవా హవాయి చూపోకటి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,ఎస్ జానకి.
మూలాలు
మార్చు- ↑ "Jebu Donga (1987) | Jebu Donga Movie | Jebu Donga Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2021-10-26.