జేమ్స్ బాండ్ 777
కృష్ణ నటించిన జేమ్స్ బాండ్ 777 యాక్షన్ సినిమా 1971, డిసెంబర్ 3న విడుదలయ్యింది.[1]
జేమ్స్ బాండ్ 777 (1971 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.ఆర్.దాస్ |
తారాగణం | కృష్ణ, విజయలలిత |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | మయూర్ మూవీస్ |
భాష | తెలుగు |
తారాగణం సవరించు
- కృష్ణ - కిశోర్
- విజయలలిత - శోభ
- కైకాల సత్యనారాయణ - భీమరాజు
- రాజబాబు
- జ్యోతిలక్ష్మి (ద్విపాత్రాభినయం)
- ఛాయాదేవి
- మిక్కిలినేని
- త్యాగరాజు
- ఆనంద్ మోహన్
- విజయశ్రీ
- మున్నీ
- మంజుల
- ముక్కామల
- జగ్గారావు
- పి.జె.శర్మ
- డాక్టర్ రంగారావు
- డాక్టర్ రమేష్
- ఎం.ఎల్.నారాయణరావు
- మాస్టర్ సురేంద్ర కుమార్
సాంకేతికవర్గం సవరించు
- దర్శకత్వం: కె.యస్.ఆర్.దాస్
- నిర్మాతలు: బిక్కూలాల్ అగర్వాల్, జి.సి.గుప్త, యు.ఎన్.నాయుడు
- మాటలు: విశ్వప్రసాద్
- పాటలు: సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, వీటూరి, దాశరథి
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
పాటలు సవరించు
ఈ సినిమాలోని పాటల వివరాలు:[2]
- ఏదో విన్నాను ఎదురుగ వున్నాను ఇదిగో నిన్నే నిన్నే చూశా కన్నువేశా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి
- నాపేరే కిస్‌మిస్ నాబ్యూటీ డోంట్ మిస్ పిలిస్తే నే చెలిస్తే ఈ మగాళ్ళే జిగేలై దిగాలౌతారు - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె
- నీకోసం వేచివున్నానురా విరిసే సొగసే నీకే దాచివుంచానురా - ఎస్.జానకి - రచన: సినారె
- నేనేరా నీదాన్ని నేనేరా నీ రాణిని అందాలెన్నో చూపి ఆశలెన్నో రేపి వలచి నిను గెలిచే దాన్నిరా - ఎల్. ఆర్. ఈశ్వరి, బి.వసంత - రచన: దాశరథి
- రబ్బరుబొమ్మా ముద్దుల గుమ్మా రంగేళి రెమ్మా బుల్లెమ్మా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: ఆరుద్ర
కథా సంగ్రహం సవరించు
దొంగ, ద్రోహి అయిన భీమరాజు విదేశీ గూఢచారులతో చేతులు కలిపి ఏరియా కమాండర్ రావును, అతని భార్యను హత్యచేస్తాడు. దేశరక్షణకు సంబంధించిన విలువైన రహస్య పత్రాలను దొంగిలిస్తాడు. రావు కొడుకు కిశోర్‌ను కూడా కత్తితో పొడుస్తాడు కానీ అతను చావలేదు. అతడు పెద్దవాడై సి.ఐ.డి. శిక్షణ పొంది "జేమ్స్ బాండ్ 777" అనే బిరుదును పొందుతాడు. భీమరాజు ముఠాను పట్టుకోవడానికి ప్రయత్నించిన డిటెక్టివ్ పురుషోత్తంను భీమరాజు హత్య చేయిస్తాడు. పురుషోత్తం కూతురు శోభ తన తండ్రిని హత్యచేసిన వారిపై పగబడుతుంది. ముఠాను పట్టుకునే బాధ్యతను కిశోర్‌కు అప్పగిస్తారు. భీమరాజు తన అనుచరులతో అనేక నగరాలలో బ్రాంచీలు స్థాపించి పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తుంటాడు. కిశోర్ శోభ సహాయంతో ఆ ముఠాలన్నింటినీ ఎలా ఎదుర్కొని తుదముట్టించాడన్నది మిగిలిన కథ.[3]
మూలాలు సవరించు
- ↑ వెబ్ మాస్టర్. "James Bond 777 (K.S.R. Doss) 1971". ఇండియన్ సినిమా. Retrieved 27 December 2022.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "జేమ్స్ బాండ్ 777 -1971". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 9 మార్చి 2020. Retrieved 9 March 2020.
- ↑ రెంటాల (10 December 1971). "చిత్ర సమీక్ష: జేమ్స్ బాండ్ 777" (PDF). ఆంధ్రప్రభ దినపత్రిక. Archived from the original (PDF) on 27 డిసెంబర్ 2022. Retrieved 27 December 2022.
{{cite news}}
: Check date values in:|archive-date=
(help)