ఝజ్జర్

హర్యానా లోని జిల్లా

హర్యానా రాష్ట్ర 21 జిల్లాలలో జజ్జర్ జిల్లా ఒకటి. 1997 జూలై 15న రోహ్‌తక్ జిల్లాలోని కొంతభాగం వేరుచేసి జజ్జర్ జిల్లా రూపొందించబడింది. జిల్లా కేంద్రంగా జజ్జర్ పట్టణం ఉంది. జిల్లాలో అదనంగా జిల్లాలో బహదూర్గర్, బెరి వంటి నగరాలు ఉన్నాయి. బహదూర్గర్‌ను రాతి జాట్స్ స్థాపించారు. బహదూర్గర్ ఒకప్పుడు షరఫాబాద్ అని పిలువబడింది. ఇది ఢిల్లీ నుండి 29కి.మీ దూరంలో ఉంది. ఇది పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధిచేయబడింది.

ఝజ్జర్ జిల్లా

झज्जर जिला
Haryana లో ఝజ్జర్ జిల్లా స్థానము
Haryana లో ఝజ్జర్ జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంHaryana
ముఖ్య పట్టణంJhajjar
మండలాలు1. ఝజ్జర్, 2. మతన్ హైల్, 3. బేరి, 4. బహాదుర్ ఘర్
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలురోహ్తక్ (shared with రోహ్తక్, రేవారి జిల్లాలు )
 • శాసనసభ నియోజకవర్గాలు4
విస్తీర్ణం
 • మొత్తం1,834 కి.మీ2 (708 చ. మై)
జనాభా
(2001)
 • మొత్తం8,80,072
 • సాంద్రత480/కి.మీ2 (1,200/చ. మై.)
 • పట్టణ
22.17
జాలస్థలిఅధికారిక జాలస్థలి

భౌగోళికంసవరించు

జజ్జర్ జిల్లా 1,890 చ.కి.మీ, 2001 గణాంకాలను అనుసరించి జంసంఖ్య 7,09,000.జిల్లాలో 2 పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో 2408 ప్లాట్లు ఉన్నాయి. సెరామిక్స్, గ్లాస్, కెమికల్స్, ఇంజనీరింగ్, ఎలెక్ట్రికల్, ఎలెక్ట్రానిక్స్ పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో 48 బృహత్తర, మద్యతరహా పరిశ్రమలు, 213 చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. పారిశ్రమిక సంస్థల కొరకు పెట్టుబడి 3,400 మిలియమ్ల. అలాగే ప్రదేశ వైశాల్యం 8,248 చ.కి.మీ. మొత్తం వ్యవసాయభూమి వైశాల్యం 670చ.కి.మీ.

  • చాజూ లేక చాజూనగర్ అని పిలువబడిన ప్రాంతం తరువాతి కాలంలో జజ్జర్‌గా పిలువబడింది. మరొక కారణం సహజసిద్దమైన ఫౌంటెన్ జార్నగర్ కూడా ఈ పేరు రావడానికి కారణం అయింది.

3 వ కారణం ఈ ప్రాంతంలో జజ్జర్ జలాశయం ఉన్న కారణంగా కూడా ఈ పేరు వచ్చింది.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 956,907,[1]
ఇది దాదాపు. ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. మొంటానా నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 456వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 522 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 8.73%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 861:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 80.8%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

జిల్లాలో అత్యధికంగా జాట్ జాతికి చెందిన ప్రజలు ఉన్నారు. తరువాత గుర్తించతగినంత బ్రాహ్మణులు ఉన్నారు. అహ్రీలు అధికంగా ఒక గ్రామం అంతా ఉంది.2011 గణాంకాలను అనుసరించి ఝజ్జర్ జిల్లా స్త్రీ: పురుష నిష్పత్తి 774:1000 ఉంటుంది.[4] జజ్ఝర్‌లో 2 గ్రామాలలో స్త్రీ:పురుష నిష్పత్తి (378:1000, 444:1000 ) తక్కువగా ఉంటుంది.[5] ఝాజ్జర్ తల్లితండ్రులు చట్టవిరుద్ధంగా రిజిస్టర్డ్ క్లినిక్స్‌లో ఉదయకాలం అల్ట్రాసౌండ్ పరీక్షచేయించి గర్భశిశువు ఆడపిల్ల అయితే అబార్షన్ చేయించుకుంటారు. ఇది తలుసుకోవడానికి వారు ఒక రహస్య సంకేత్ పదాన్ని (లడ్డూ అంటే మగబిడ్డ, జిలేబీ అంటే ఆడపిల్ల) వాడుతుంటారు అని అర్ధం. [4] భారతదేశంలో అత్యల్పంగా స్త్రీలు ఉన్న జిల్లాగా ఝజ్జర్ గుర్తించబడుతుంది.

విభాగాలుసవరించు

  • జజ్జర్ జిల్లా 3 ఉప విభాగాలు విభజించబడింది:- జజ్జర్, బహదుర్గా, బెరి.
  • జజ్జర్ ఉపవిభాగంలో 2 తాలూకాలు ఉన్నాయి: జజ్జర్, మాటంహైల్.
  • బహదుర్గా ఉపవిభాగంలో ఒకే తాలూకాగా ఉంది:
  • జిల్లాలో 4 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి: బగదుర్గా, బాడి, జజ్జర్, బెరి. ఇవన్నీ రోతక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.

పరిశ్రమలుసవరించు

కుటీరపరిశ్రలుసవరించు

2000 డిసెంబరు 31 నాటికి జజ్జర్ జిల్లాలో 1818 కుటీరపరిశ్రలు నమోదై ఉన్నాయి. ఈ పరిశ్రమలకు మొత్తంగా పెట్టుబడి 9550.01 లక్షలు. ఈ పరిశ్రమలు మొత్తంగా 12153 మందికి ఉపాధి కలిగిస్తుంది. ఇవి మొత్తంగా రైలు మార్గంతో అనుసంధానించబడతాయి.

బృహత్తర, మద్యతరహా పరిశ్రమలుసవరించు

జిల్లాలో 35 బృహత్తర, మద్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. బెరి గ్రామంలో ఒకప్పుడు బర్గుజార్ వంశీయ రాజపుత్రులు ఉన్నారు. వారు ముస్లిం మతాన్ని స్వీకరించిన తరువాత (బహుశా బ్రిటిష్ కాలంలో) నూనె ఉత్పత్తిని వృత్తిగా స్వీకరించారు. వీరిని బెరీ తెలీ (నూనె)కుటుంబం అంటారు.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est. line feed character in |quote= at position 5 (help); Cite web requires |website= (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Montana 989,415 line feed character in |quote= at position 8 (help); Cite web requires |website= (help)
  4. 4.0 4.1 "Ladoo and Jalebis: The code of killer doctors of jatland". The Times Of India. 2011-04-08.
  5. "Jhajjar village has 378 girls for 1,000 boys". The Times Of India. 2011-04-08.

Coordinates: 28°36′36″N 76°39′36″E / 28.61000°N 76.66000°E / 28.61000; 76.66000

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఝజ్జర్&oldid=2862584" నుండి వెలికితీశారు