టాప్ గేర్ 2022లో తెలుగులో విడుదలైన సినిమా. ఆదిత్య మూవీస్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె.వి.శ్రీధర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కె. శశికాంత్‌ దర్శకత్వం వహించాడు. ఆది సాయికుమార్‌, రియా సుమన్, బ్రహ్మాజీ, సత్యం రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 డిసెంబర్ 3న విడుదల చేయగా,[1] సినిమాను డిసెంబర్ 30న విడుదలైంది.[2]

టాప్ గేర్
దర్శకత్వంకె. శశికాంత్‌
నిర్మాతకె.వి.శ్రీధర్‌ రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంసాయిశ్రీరామ్‌
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంహర్షవర్ధన్‌ రామేశ్వర్‌
నిర్మాణ
సంస్థ
శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్
విడుదల తేదీ
డిసెంబరు 30, 2022 (2022-12-30)
దేశం భారతదేశం
భాషతెలుగు

అర్జున్ (ఆది సాయికుమార్) ఒక క్యాబ్ డ్రైవర్. భార్య ఆద్య (రియా సుమన్)తో సంతోషంగా జీవితం గడుపుతూ ఉంటాడు. సిద్దార్థ్ (మైమ్ గోపీ) ముంబైలో పెద్ద డ్రగ్ డీలర్. కోట్ల విలువైన డ్రగ్స్‌ హైద్రాబాద్‌లో చిక్కుకుంటాయి. హైదరాబాద్ పోలీసులు సిద్దార్థ్ కోసం వెతుకుతూ ఉంటారు. పోలీసులు వెతుకు ఉండడంతో సిద్ధార్థ్ డ్రగ్స్‌తో దేశం వదిలి వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకొని అర్జున్ క్యాబ్ ఎక్కడం క్యాబ్ లో నుండి డ్రగ్స్ ఉన్న బ్యాగ్ మిస్ అవుతుంది. బ్యాగ్ ఇవ్వకపోతే ఆద్యను చంపేస్తానని అర్జున్‌ను గోపి బెదిరిస్తాడు. అర్జున్ తన భార్యను కాపాడుకున్నాడా ? లేడా ? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్
 • నిర్మాత: కె.వి.శ్రీధర్‌ రెడ్డి
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె. శశికాంత్‌
 • సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌
 • సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్‌
 • ఎడిటింగ్‌: ప్రవీణ్ పూడి
 • ఆర్ట్: రామాంజనేయులు
 • ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: గిరిధర్‌ మామిడిపల్లి

మూలాలు

మార్చు
 1. Eenadu (7 December 2022). "సినీ ప్రియులను ఆకట్టుకుంటోన్న 'టాప్‌గేర్‌' టీజర్‌". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
 2. Eenadu (26 December 2022). "ఇయర్‌ ఎండింగ్‌ స్పెషల్‌.. ఈ వారం థియేటర్‌/OTTలో వచ్చే చిత్రాలివే". Archived from the original on 31 December 2022. Retrieved 31 December 2022.
 3. NTV Telugu (30 December 2022). "టాప్ గేర్ మూవీ రివ్యూ". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=టాప్_గేర్&oldid=3932097" నుండి వెలికితీశారు