ట్రావిస్ హెడ్
ట్రావిస్ మైఖేల్ హెడ్ (జననం 1993 డిసెంబరు 29) ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. [2] అతను దేశీయ మ్యాచ్‌ల కోసం సౌత్ ఆస్ట్రేలియా, అడిలైడ్ స్ట్రైకర్స్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అతను దూకుడుగా ఉండే ఎడమ చేతి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్. అప్పుడప్పుడు కుడిచేతి ఆఫ్ స్పిన్ బౌలింగు కూడా చేస్తాడు. అతను గతంలో 2019 జనవరి నుండి 2020 నవంబరు వరకు టెస్టుల్లో ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు సహ-వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు.[3] [4] 2023 ICC వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టులో హెడ్, కీలక సభ్యుడు. 163 పరుగుల ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ట్రావిస్ మైకెల్ హెడ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | అడిలైడ్, సౌత్ ఆస్ట్రేలియా | 1993 డిసెంబరు 29|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 179 cమీ. (5 అ. 10 అం.)[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | Middle-order batter | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 454) | 2018 అక్టోబరు 7 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 జూలై 27 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 213) | 2016 జూన్ 13 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 సెప్టెంబరు 7 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 62 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 82) | 2016 జనవరి 26 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 సెప్టెంబరు 3 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 62 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011/12–present | సౌత్ ఆస్ట్రేలియా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012/13–present | అడిలైడ్ స్ట్రైకర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–2017 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016 | యార్క్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | వోర్సెస్టర్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021 | ససెక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2023 జూలై 27 |
హెడ్ తన కెరీర్‌ను త్వరగా ప్రారంభించాడు. 18 సంవత్సరాల వయస్సులో ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేసి, 2012 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. సౌత్ ఆస్ట్రేలియా షెఫీల్డ్ షీల్డ్ జట్టులో నిలకడగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 2015లో జట్టుకు కెప్టెన్ అయ్యాడు.
ప్రారంభ కెరీర్ (2011–2014)
మార్చుఅడిలైడ్లో క్రెగ్మోర్ [5] క్లబ్‌కూ, ట్రినిటీ కాలేజ్ కొరకూ ఆడాక హెడ్, అండర్-17 అండర్-19 స్థాయిలలో సౌత్ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. జాతీయ అండర్-19 ఛాంపియన్‌షిప్‌లలో రంగప్రవేశం చేసాడు. 17. [6] టీ ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్‌కు[2] గ్రేడ్ క్రికెట్ ఆడి పేరు తెచ్చుకుని 2012 ప్రారంభంలో 18 సంవత్సరాల వయస్సులో షెఫీల్డ్ షీల్డ్‌లో సౌత్ ఆస్ట్రేలియా తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ రంగప్రవేశం చేసాడు.[7] సౌత్ ఆస్ట్రేలియా కోసం మూడు మ్యాచ్‌లతో తన కెరీర్‌ను ఆశాజనకంగా ప్రారంభించి, తన రెండవ మ్యాచ్‌లో తొలి అర్ధ సెంచరీ చేసాడు. తన మూడో మ్యాచ్‌లో టాస్మానియాపై 90 పరుగులు చేసి, తన తొలి సెంచరీకి కొద్దిదూరంలో ఆగిపోయాడు. [8] సీజన్ ముగింపులో సౌత్ ఆస్ట్రేలియాతో రూకీ కాంట్రాక్ట్‌తో బహుమతి పొందాడు. [9]
హెడ్ 2012 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌తో సహా ఆస్ట్రేలియా జాతీయ జట్టు కోసం 18 అండర్-19 వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) మ్యాచ్‌లు ఆడాడు. [10] [11] అతను టోర్నమెంట్ సమయంలో బ్యాట్, బాల్ రెండింటితోనూ ఆకట్టుకున్నాడు. స్కాట్లాండ్‌పై 42 బంతుల్లో 87 పరుగులు చేసి,[12] క్వార్టర్-ఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై మూడు వికెట్లు తీసుకున్నాడు. [13] 2012–13 నేషనల్ అండర్-19 ఛాంపియన్‌షిప్‌లో దక్షిణ ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించి, వరుసగా రెండవ సంవత్సరం ప్లేయర్ ఆఫ్ ది ఛాంపియన్‌షిప్‌గా ఎంపికై నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాడు. [2]
హెడ్ 2012–13 సీజన్‌కు రెగ్యులరు ఆటగాడై పోయాడు. సాధారణంగా మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసేవాడు. [14] [2] వెస్ట్రన్ ఆస్ట్రేలియాపై 95 పరుగులతో తన తొలి సెంచరీకి చేరువయ్యాడు. అతను ఔట్ కానప్పటికీ, అతను బ్యాటింగ్ భాగస్వాములందరూ ఔటైపోవడాంతో మైలురాయికి ఐదు పరుగుల దూరంలో ఆగిపోయాడు. [15] అతను తదనంతరం బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ కోసం గాయపడిన కీరన్ పొలార్డ్ స్థానంలో ఒకే ఒక్క ట్వంటీ20 గేమ్ ఆడాడు. [16] 2013 జనవరిలో విక్టోరియాపై సౌత్ ఆస్ట్రేలియా షీల్డ్ గెలిచిన కొద్దిసేపటికే, అడిలైడ్‌లోని ఒక హోటల్ వెలుపల అతన్ని ఒక కారు ఢీకొట్టడంతో, తలకు, వీపుకూ గాయాలయ్యాయి. పూర్తిగా కోలుకుని దక్షిణ ఆస్ట్రేలియా తదుపరి మ్యాచ్‌కు తిరిగి రాగలిగాడు. [17] [18] 2013 సీజన్‌లో ప్రారంభ ఏజియాస్ బౌల్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీలో భాగమైన ఆరుగురు యువ ఆస్ట్రేలియన్ ఆటగాళ్లలో హెడ్ ఒకడు. ఆ మైదానంలో శిక్షణ పొందాడు. [19]
కెరీర్ ప్రారంభంలో హెడ్, తన తొలి ఫస్ట్-క్లాస్ సెంచరీని చేరుకోవడానికి చాలా కష్టపడ్డాడు. అనేక సందర్భాల్లో తొంభైలలో ఆగిపోయాడు.[2] తొలి సీజన్‌లో చేసిన 90 స్కోరు తరువాత, 2012లో వెస్ట్రన్ ఆస్ట్రేలియాపై అజేయంగా 95 పరుగులు చేసాడు. 2013-14 షెఫీల్డ్ షీల్డ్ సీజన్‌లో మూడుసార్లు, వెస్ట్రన్ ఆస్ట్రేలియాపై మరో రెండుసార్లు [20] [21] టాస్మానియాపై ఒకసారి, 92, 98, 98 స్కోర్‌లతో, తొంభైలలో ఆగిపోయాడు. [22] 2014 జూలైలో దక్షిణాఫ్రికా A కి వ్యతిరేకంగా నేషనల్ పెర్ఫార్మెన్స్ స్క్వాడ్ తరఫున లిస్టు A సెంచరీ సాధించగలిగాడు.[23]
వెస్టిండీస్‌తో సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టులోకి హెడ్‌ను తీసుకున్నారు. [24] పెర్త్‌లో జరిగిన మొదటి టెస్టులో అతను 99 పరుగులు చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 196 పరుగులు జోడించాడు. [25] రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా 164 పరుగుల తేడాతో గెలిచింది. [26] అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో హెడ్, మొదటి ఇన్నింగ్స్‌లో కెరీర్‌లో అత్యుత్తమ 175 పరుగులు చేసి, మార్నస్ లాబుస్‌చాగ్నేతో కలిసి నాల్గవ వికెట్‌కు 297 పరుగులు జోడించాడు. [27] ఆ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. [28] 2022-23లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టులో స్థానం పొందాడు. [29] మొదటి టెస్టులో, మొదటి ఇన్నింగ్స్‌లో 92 పరుగులతో ఆస్ట్రేలియా తరఫున హెడ్, టాప్ స్కోర్ చేసి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. [30] టెస్టుల్లో 2000 పరుగులు కూడా పూర్తి చేశాడు. [31] అదే వారంలో, ఐసిసి టెస్టు బ్యాటింగు ర్యాంకుల్లో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. [32]
టెస్టు క్రికెట్ (2018–ప్రస్తుతం)
మార్చు2018 ఏప్రిల్లో, హెడ్‌కి క్రికెట్ ఆస్ట్రేలియా 2018–19 సీజన్ కోసం జాతీయ కాంట్రాక్టును అందజేసింది. [33] [34] 2018 సెప్టెంబరులో, అతను పాకిస్థాన్‌తో జరిగే సిరీస్ కోసం ఆస్ట్రేలియా యొక్క టెస్టు జట్టులో ఎంపికయ్యాడు. [35] [36] 2018 అక్టోబరు 7న పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా తరపున తన టెస్టు రంగప్రవేశం చేసాడు [37] నాథన్ లియోన్ అతనికి బ్యాగీ గ్రీన్ క్యాప్‌ని బహూకరించాడు. [38]
2019 జనవరిలో శ్రీలంకతో జరిగే సిరీస్‌కు ముందు పాట్ కమ్మిన్స్‌తో పాటు ఆస్ట్రేలియా కొత్త టెస్టు వైస్ కెప్టెన్‌గా హెడ్‌ని ప్రకటించారు. రెగ్యులర్ వైస్ కెప్టెన్లు అందుబాటులో లేకపోవడం, మిచెల్ మార్ష్‌ను టెస్టు జట్టు నుండి తొలగించడం, గాయం కారణంగా జోష్ హేజిల్‌వుడ్ అందుబాటులో లేకపోవడం దీనికి కారణం. [39] రెండు టెస్టుల సిరీస్‌లో, మూడు ఇన్నింగ్స్‌లలో హెడ్, 84, 161 (అతని తొలి టెస్టు సెంచరీ), 59 నాటౌట్‌తో అతని టెస్టు మ్యాచ్ బ్యాటింగ్ సగటును 51కి పెంచుకున్నాడు.
2019 జూలైలో, ఇంగ్లండ్‌లో 2019 యాషెస్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టులో హెడ్ ఎంపికయ్యాడు. [40] [41] 2019 నవంబరులో హెడ్ ,ఆస్ట్రేలియాలో పాకిస్తాన్‌తో ఆడి, సిరీస్‌లో ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్ చేశాడు. [42] 2019 డిసెంబరులోన్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టులో ఎంపికై, [43] రెండో టెస్టులో సెంచరీ (114) చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. [44] 2020 జూలై 16న, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు శిక్షణను ప్రారంభించడానికి 26 మంది ఆటగాళ్ల ప్రిలిమినరీ స్క్వాడ్‌లో హెడ్‌ని ఎంపిక చేశారు. [45] [46]
2020 నవంబరులో, భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు 17 మంది సభ్యుల జట్టులో స్థానం పొందినప్పటికీ, హెడ్‌ని ఆస్ట్రేలియా టెస్టు కో-వైస్ కెప్టెన్‌గా తగ్గించారు, పాట్ కమ్మిన్స్ మాత్రమే వైస్ కెప్టెనుగా నియమించారు. [4]
హెడ్ 2021–22 యాషెస్ కోసం జట్టులో చేర్చబడ్డాడు. [47] గబ్బాలో జరిగిన మొదటి టెస్ట్‌లో, అతను తన మూడవ సెంచరీ (152) చేసి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. [48] [49] సిడ్నీలో జరిగిన నాల్గవ టెస్టులో కోవిడ్-19 పాజిటివ్ అని తేలడంతో హెడ్‌ని తొలగించారు.[50] హోబర్ట్‌లో జరిగిన ఐదవ టెస్టు కోసం తిరిగి వచ్చి, మరో సెంచరీ (101) చేశాడు. [51] అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కాంప్టన్-మిల్లర్ మెడల్ కూడా అందుకున్నాడు. [52]
2022 ఫిబ్రవరిలో, మార్చిలో పాకిస్థాన్‌లో పర్యటించే 18 మంది సభ్యుల జట్టులో హెడ్‌ని చేర్చారు. [53] 2022 శ్రీలంక పర్యటన కోసం హెడ్‌ని జట్టులో చేర్చారు. [54] గాలేలో జరిగిన మొదటి టెస్టు రెండవ ఇన్నింగ్స్‌లో 4/10 తీసుకుని - టెస్ట్‌లలో అతని మొదటి వికెట్లు - ఆస్ట్రేలియా 10 వికెట్ల విజయానికి మార్గం సుగమం చేసాడు. [55]
2023 బోర్డర్-గవాస్కర్ సిరీస్ కోసం 18 మంది సభ్యుల జట్టులో హెడ్‌కు చోటు దక్కింది.[56] అతను 2023 ICC వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, 2023 యాషెస్ కోసం జట్టులో ఎంపికయ్యాడు. [57] ది ఓవల్‌లో జరిగిన 2023 WTC ఫైనల్‌లో, మొదటి ఇన్నింగ్స్‌లో హెడ్ తన మొదటి ఓవర్సీస్ టెస్టు సెంచరీ (163), ఓవరాల్‌గా ఆరోది, సాధించాడు. స్టీవెన్ స్మిత్‌తో కలిసి ఐదో వికెట్‌కు 285 పరుగులు జోడించాడు. [58] [59] ఆస్ట్రేలియా 209 పరుగుల తేడాతో విజయం సాధించగా హెడ్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. [60] 2023 జూన్లో, హెడ్ ICC టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మూడవ స్థానానికి చేరుకున్నాడు. [61] మూడో యాషెస్ టెస్టు ముగిసిన తర్వాత హెడ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు. [62] హెడ్ మూడు అర్ధ సెంచరీలతో 362 పరుగులతో యాషెస్ సిరీస్‌ను ముగించాడు. [63]
మళ్ళీ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు (2022-ప్రస్తుతం)
మార్చు2022 జనవరిలో, శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో తలపడే 16 మంది సభ్యుల జట్టులో హెడ్‌ను తీసుకున్నారు. అతను, 2018లో చివరిసారిగా ఆస్ట్రేలియా తరపున వైట్ బాల్ క్రికెట్ ఆడాడు.[64] షెఫీల్డ్ షీల్డ్‌లో ఆడేందుకు గాను హెడ్, సిరీస్ ప్రారంభంలో ఉండడని, మెల్‌బోర్న్‌లో జట్టులో చేరుతాడనీ ఫిబ్రవరిలో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. [65] అతను ఏ మ్యాచ్‌లోనూ కనిపించలేదు.
2022 ఫిబ్రవరిలో, పాకిస్తాన్ పర్యటన కోసం వైట్-బాల్ జట్టులో హెడ్ చేర్చబడ్డాడు. [66] మొదటి వన్‌డేలో, నవంబరు 2018 తర్వాత అతని మొదటిది, అతను బ్యాటింగ్ ప్రారంభించి, తన రెండవ సెంచరీ (72 బంతుల్లో 101) చేసాడు. రెండు వికెట్లు కూడా తీసుకుని, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. [67] రెండవ వన్‌డేలో 89 పరుగులు చేసాడు.[68] కానీ చివరి మ్యాచ్‌లో గోల్డెన్ డకౌటయ్యాడు. [69] వన్-ఆఫ్ మ్యాచ్‌లో అతను తన T20Iకి తిరిగి వచ్చాడు. [70]
జూన్-2022 జూలైలో శ్రీలంక పర్యటన కోసం వన్‌డే, ఆస్ట్రేలియా A స్క్వాడ్‌లకు హెడ్ ఎంపికయ్యాడు. [71] శ్రీలంక Aతో జరిగిన రెండో అనధికారిక వన్‌డేలో, హెడ్ టాప్ స్కోర్ 110 పరుగులు చేసాడు.[72] అనేక మంది ఆస్ట్రేలియన్ ఆటగాళ్లకు గాయాలైన తర్వాత అతను వన్‌డేలకు ఎంపికయ్యాడు; అతను రెండవ, మూడవ (ఇక్కడ అతను అత్యధికంగా 70 నాటౌట్‌తో స్కోర్ చేసాడు), నాల్గవ మ్యాచ్‌లలో ఆడాడు. స్నాయువు స్ట్రెయిన్‌తో ఆఖరి మ్యాచ్‌లో ఆడలేదు. [73]
పితృత్వ సెలవు కారణంగా జింబాబ్వే, న్యూజిలాండ్‌లతో స్వదేశీ సిరీస్‌లను కోల్పోయిన తర్వాత, 2022 నవంబరులో ఇంగ్లండ్‌తో తలపడే వన్‌డే జట్టులో హెడ్ చేరాడు. తరువాతి కాలంలో రిటైరైన ఆరోన్ ఫించ్, అప్పుడు ఓపెనర్‌గా ఉన్నాడు. [24] మెల్‌బోర్న్‌లో జరిగిన చివరి వన్‌డేలో, హెడ్ తన మూడవ సెంచరీ సాధించాడు. కెరీర్‌లో అత్యుత్తమంగా 152 పరుగులు చేసి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. [74] హెడ్, డేవిడ్ వార్నర్ కలిసి 269 పరుగులు చేశారు. వన్‌డేలలో రెండుసార్లు 250 పరుగుల భాగస్వామ్యాలు చేసిన రెండవ జోడీగా, 1000 భాగస్వామ్య పరుగులను సంయుక్తంగా అత్యంత వేగంగా సాధించారు.[75]
2023 మార్చిలో భారత్‌లో జరిగే వన్‌డే సిరీస్‌కు హెడ్ ఎంపికయ్యాడు [76] విశాఖపట్నంలో జరిగిన రెండవ వన్‌డేలో, మిచెల్ మార్ష్‌తో కలిసి బ్యాటింగ్ ప్రారంభించి, అతను వేగంగా అజేయ అర్ధ సెంచరీని సాధించాడు. 11 ఓవర్లలో 121 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు, ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. [77]
దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు హెడ్ ఎంపికయ్యాడు. మూడవ T20Iలో, హెడ్ తన మొదటి T20I అర్ధ సెంచరీ (91) సాధించి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. [78]
వ్యక్తిగత జీవితం
మార్చుహెడ్ 2023 ఏప్రిల్లో జెస్సికా డేవిస్‌ని వివాహం చేసుకున్నాడు. [79] 2022 సెప్టెంబరులో వారికి ఒక కుమార్తె జన్మించింది [79] [80]
2023 జూన్ నాటికి, ట్రావిస్ హెద్ టెస్టుల్లో ఆరు, వన్‌డేల్లో మూడు శతకాలు చేసాడు.[81][82]
నం. | స్కోర్ | ప్రత్యర్థి | వేదిక | తేదీ | ఫలితం |
---|---|---|---|---|---|
1 | 161 | శ్రీలంక | మనుకా ఓవల్, కాన్బెర్రా | 1 February 2019 | గెలిచింది |
2 | 114 | న్యూజీలాండ్ | మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ | 26 December 2019 | గెలిచింది |
3 | 152 | ఇంగ్లాండు | గబ్బా, బ్రిస్బేన్ | 8 December 2021 | గెలిచింది |
4 | 101 | ఇంగ్లాండు | బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్ | 14 January 2022 | గెలిచింది |
5 | 175 | వెస్ట్ ఇండీస్ | అడిలైడ్ ఓవల్, అడిలైడ్ | 8 December 2022 | గెలిచింది |
6 | 163 | భారతదేశం | ది ఓవల్, కెన్నింగ్టన్ | 7 June 2023 | గెలిచింది |
నం. | స్కోర్ | ప్రత్యర్థి | వేదిక | తేదీ | ఫలితం |
---|---|---|---|---|---|
1 | 128 | పాకిస్తాన్ | అడిలైడ్ ఓవల్, అడిలైడ్ | 26 January 2017 | గెలిచింది |
2 | 101 | పాకిస్తాన్ | గడ్డాఫీ స్టేడియం, లాహోర్ | 29 March 2022 | గెలిచింది |
3 | 152 | ఇంగ్లాండు | మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ | 22 November 2022 | గెలిచింది |
మూలాలు
మార్చు- ↑ "Travis Head". cricket.com.au. Cricket Australia. Retrieved 31 December 2022.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 "Travis Head". ESPNcricinfo. ESPN Inc. Retrieved 24 November 2017.
- ↑ "Bancroft, Burns named in Australia Test squad". Cricket Australia. Retrieved 14 November 2019.
- ↑ 4.0 4.1 "Pucovski, Green headline Test and Australia A squads". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 2020-11-12.
- ↑ Head to India Archived 20 ఆగస్టు 2013 at the Wayback Machine - Craigmore Cricket Club.
- ↑ Miscellaneous matches played by Travis Head – CricketArchive.
- ↑ "Grade cricket - How they shape up in 2011-12". The Advertiser. News Corp Australia. 7 October 2011. Retrieved 24 November 2017.
- ↑ "Klinger double-ton denies Tasmania". ESPNcricinfo. ESPN Inc. 3 March 2012. Retrieved 24 November 2017.
- ↑ "South Australia cull six from contract list". ESPNcricinfo. ESPN Inc. 6 July 2012. Retrieved 24 November 2017.
- ↑ Under-19 ODI matches played by Travis Head (18) – CricketArchive.
- ↑ "Australia name U-19 World Cup squad". ESPNcricinfo. ESPN Inc. 3 July 2012. Retrieved 24 November 2017.
- ↑ Binoy, George (11 August 2012). "Australia begin campaign with six-wicket win". ESPNcricinfo. ESPN Inc. Retrieved 24 November 2017.
- ↑ "Bosisto steers Australia into semi-finals". ESPNcricinfo. ESPN Inc. 19 August 2012. Retrieved 24 November 2017.
- ↑ Sheffield Shield 2012/13: batting and fielding for South Australia – CricketArchive.
- ↑ "Warriors claim first win of season". ESPNcricinfo. ESPN Inc. 15 November 2012. Retrieved 28 January 2013.
- ↑ "Adelaide Strikers opt for novice Travis Head, 18, at the crease". news.com.au. News Corp Australia. 9 January 2013. Retrieved 24 November 2017.
- ↑ Faulkner, Andrew (28 January 2013). "Redbacks' rookie Travis Head hit by car". The Australian. News Corp Australia. Retrieved 28 January 2013.
- ↑ Biddington, Tom (28 January 2013). "Redbacks cricketer Travis Head avoids serious injury after being hit by car". The Advertiser. News Corp Australia. Retrieved 24 November 2017.
- ↑ Dobell, George (14 February 2013). "Young Australians head to Hampshire". ESPNcricinfo. ESPN Inc. Retrieved 24 November 2017.
- ↑ "Johnson adds more wickets to tally". ESPNcricinfo. ESPN Inc. 8 November 2013. Retrieved 24 November 2017.
- ↑ "Hughes cruises to maiden double-ton". ESPNcricinfo. ESPN Inc. 15 November 2013. Retrieved 24 November 2017.
- ↑ "Head 98 propels South Australia". ESPNcricinfo. ESPN Inc. 23 November 2013. Retrieved 24 November 2017.
- ↑ "Shezi six-for gives South Africa A comfortable win". ESPNcricinfo. ESPN Inc. 31 July 2014. Retrieved 24 November 2017.
- ↑ 24.0 24.1 McGlashan, Andrew (8 November 2022). "Head returns to Australia ODI squad, multi-format quicks included". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 8 November 2022.
- ↑ "Head falls agonisingly short in quickfire 99". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 4 December 2022.
- ↑ McArdle, Jordan (4 December 2022). "Spin twins Nathan Lyon, Travis Head lead Australia to victory over fighting West Indies in Perth". The West Australian (in ఇంగ్లీష్).
- ↑ Conn, Malcolm (10 December 2022). "'Pretty filthy': Rampant Head annoyed at what could have been". The Sydney Morning Herald (in ఇంగ్లీష్).
- ↑ "As it happened: Tourists out cheaply, Australia win second Test by 419 runs". The Sydney Morning Herald (in ఇంగ్లీష్). 11 December 2022.
- ↑ "Hazlewood out as Aussies shift focus to Proteas". cricket.com.au (in ఇంగ్లీష్). 12 December 2022.
- ↑ "Australia wins first Test against South Africa inside two days at the Gabba". ABC News Australia (in ఇంగ్లీష్). 18 December 2022.
- ↑ "Australia beat South Africa by six wickets at rock 'n roll Gabba". SuperSport (in ఇంగ్లీష్). Retrieved 20 December 2022.
- ↑ "Babar Azam moves to No. 2 in Test batting rankings, Travis Head breaches top five for the first time". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 5 January 2022.
- ↑ "Carey, Richardson gain contracts as Australia look towards World Cup". ESPN Cricinfo. Retrieved 11 April 2018.
- ↑ "Five new faces on CA contract list". Cricket Australia. Retrieved 11 April 2018.
- ↑ "Maxwell out as Bulls, Finch bolt into Test squad". Cricket Australia. Retrieved 11 September 2018.
- ↑ "Australia Test squad for UAE: The newcomers". International Cricket Council. Retrieved 11 September 2018.
- ↑ "1st Test, Australia tour of United Arab Emirates at Dubai, Oct 7-11 2018". ESPN Cricinfo. Retrieved 7 October 2018.
- ↑ Brettig, Daniel (15 October 2018). "Travis Head reveals Nathan Lyon's baggy green pledge". ESPN Cricinfo. Retrieved 4 February 2019.
- ↑ Bailey, Scott (23 January 2019). "Pat Cummins and Travis Head named as Australian vice-captains for Sri Lanka Test series". Fox Sports.com.au. Retrieved 3 February 2019.
- ↑ "Australia name 17-man Ashes squad". cricket.com.au (in ఇంగ్లీష్). 26 July 2019. Retrieved 29 July 2019.
- ↑ "Bancroft, Wade and Mitchell Marsh earn Ashes call-ups". ESPNcricinfo (in ఇంగ్లీష్). 26 July 2019. Retrieved 29 July 2019.
- ↑ "Full scorecard of Australia vs Pakistan". ESPN Cricket Info. Retrieved 1 January 2020.
- ↑ "Australia vs New Zealand Scorecard". Cricket Australia. Retrieved 12 December 2019.
- ↑ "Scorecard of 2nd Test, Australia vs New Zealand". ESPN Cricket Info. Retrieved 1 January 2020.
- ↑ "Usman Khawaja and Marcus Stoinis in expanded Australia training squad for possible England tour". ESPN Cricinfo. Retrieved 16 July 2020.
- ↑ "Aussies name huge 26-player group with eye on UK tour". Cricket Australia. Retrieved 16 July 2020.
- ↑ "Usman Khawaja and Travis Head set to compete for Australia's final batting spot". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2020-11-20.
- ↑ Bilton, Dean; Smale, Simon (9 December 2021). "Travis Head powers to century after David Warner falls short on day two of the first Ashes Test at the Gabba" (in ఇంగ్లీష్). ABC News. Retrieved 2021-12-12.
- ↑ Brettig, Daniel (12 December 2021). "Head, Green, and Carey: Australia's new power trio". The Sydney Morning Herald (in ఇంగ్లీష్). Retrieved 2021-12-12.
- ↑ Malcolm, Alex (31 December 2021). "Travis Head tests positive for Covid-19 as Australia scramble for replacements". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 19 January 2022.
- ↑ Baynes, Valkerie (14 January 2022). "Travis Head leads Australia counter after England start fast in Hobart". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 19 January 2022.
- ↑ "Head's golden summer capped with dual Hobart gongs". cricket.com.au (in ఇంగ్లీష్). 16 January 2022. Retrieved 19 January 2022.
- ↑ Malcolm, Alex (8 February 2022). "Agar named as third spinner in Australia's 18-man squad to tour Pakistan". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 11 February 2022.
- ↑ Malcolm, Alex (29 April 2022). "Harris misses Test squad, big guns back for ODIs, T20s". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 10 June 2022.
- ↑ Sargeant, Tom (1 July 2022). "Head transforms into 'prime Murali' in 'unplayable' off-spin masterclass". Fox Sports (in ఇంగ్లీష్). Retrieved 2 July 2022.
- ↑ "Rookie's call-up, veteran's recall confirmed as spin-heavy Aussie Test squad for India revealed". FOX Cricket (in ఇంగ్లీష్). Retrieved 11 January 2022.
- ↑ McGlashan, Andrew (18 April 2023). "Renshaw and Harris earn Ashes, WTC final call to keep heat on Warner". ESPNcrcinfo (in ఇంగ్లీష్). Retrieved 19 April 2023.
- ↑ Conn, Malcolm (12 June 2023). "'Amazing' Head rises from discarded Ashes failure to crucial X-factor". The Sydney Morning Herald (in ఇంగ్లీష్). Retrieved 13 June 2023.
- ↑ Bandarupalli, Sampath. "Test hundreds in England: Smith catches up with Steve Waugh". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 11 June 2023.
- ↑ Healy, Jonathan. "Travis Head named Player of the Match after superb knock". International Cricket Council (in ఇంగ్లీష్). Retrieved 11 June 2023.
- ↑ "Australia claim top three spots in batting rankings after WTC Final". International Cricket Council (in ఇంగ్లీష్). Retrieved 14 June 2023.
- ↑ "Head closes in on top spot in ICC Test batters' rankings". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 15 July 2023.
- ↑ "Most Runs - 2023 Ashes". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 5 August 2023.
- ↑ Conn, Malcolm (25 January 2022). "Head full of steam: Forgotten man back for Australia's white-ball team". The Sydney Morning Herald (in ఇంగ్లీష్). Retrieved 26 January 2022.
- ↑ "Travis Head to miss start of Sri Lanka T20I series to play Sheffield Shield". ESPNcricinfo (in ఇంగ్లీష్). 7 February 2022. Retrieved 11 February 2022.
- ↑ "Australia's Test quicks and David Warner rested from Pakistan limited-overs matches". ESPNcricinfo (in ఇంగ్లీష్). 21 February 2022. Retrieved 22 February 2022.
- ↑ "Travis Head century leads Australia to victory in ODI opener against Pakistan". ABC News (in ఇంగ్లీష్). 29 March 2022. Retrieved 30 March 2022.
- ↑ "Babar Azam and Imam-ul-Haq hundreds take Pakistan to record chase". ESPNcricinfo (in ఇంగ్లీష్). 31 March 2022. Retrieved 5 July 2022.
- ↑ "Babar, Imam seal series victory after Pakistan's quicks shock Australia". ESPNcricinfo (in ఇంగ్లీష్). 2 April 2022. Retrieved 5 July 2022.
- ↑ "Ellis and Finch star as Australia leave Pakistan with a win". ESPNcricinfo (in ఇంగ్లీష్). 5 April 2022. Retrieved 29 November 2022.
- ↑ "Pat Cummins rested for Sri Lanka T20Is; big guns return for white-ball leg". ESPNcricinfo (in ఇంగ్లీష్). 29 April 2022. Retrieved 10 June 2022.
- ↑ "2nd unofficial ODI, Colombo (SSC), June 10, 2022, Australia A tour of Sri Lanka". ESPNcricinfo (in ఇంగ్లీష్). 10 June 2022. Retrieved 10 June 2022.
- ↑ McGlashan, Andrew (23 June 2022). "Glenn Maxwell added to Australia Test squad after Travis Head joins injury list". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 4 July 2022.
- ↑ "Head 152, Warner 106, England 142 all out". ESPNcricinfo (in ఇంగ్లీష్). 22 November 2022.
- ↑ "Stats - Head and Warner rewrite ODI records at the MCG". ESPNcricinfo (in ఇంగ్లీష్). 22 November 2022.
- ↑ "Big guns return: Australia name 16-player squad for India ODI series". International Cricket Council (in ఇంగ్లీష్). 23 February 2023.
- ↑ "Starc's five-for, Marsh-Head century stand sink India for 1-1". ESPNcricinfo (in ఇంగ్లీష్). 19 March 2023.
- ↑ Moonda, Firdose (3 September 2023). "Head, Abbott, Stoinis subdue South Africa to seal 3-0 win for Australia". ESPNcricinfo (in ఇంగ్లీష్).
- ↑ 79.0 79.1 Burt, Sarah (17 April 2023). "Love sweeps Australian cricket as Travis Head and Mitch Marsh tie the knot within days of each other". 7 News.
- ↑ "The Soda Room podcast: Cricket star Travis Head on becoming a father, his Test debut and Phil Hughes". The Advertiser. 10 September 2022.
- ↑ "Highest Test scores - Travis Head". ESPNcricinfo. Retrieved 24 November 2022.
- ↑ "Highest ODI scores - Travis Head". ESPNcricinfo. Retrieved 22 November 2022.