డా. వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం
డా. వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం (ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం) , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, తాడేపల్లిగూడెం సమీపంలో వెంకటరమన్నగూడెం వద్ద ఉన్న రాష్ట్ర విశ్వవిద్యాలయం.[1] ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2007లో ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది. ఉద్యాన శాస్త్రంను చదవడానికి, పరిశోధనచేయడానికి ఈ విశ్వవిద్యాలయం ప్రోత్సాహం అందిస్తోంది.
పూర్వపు నామము | ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం |
---|---|
రకం | ప్రజా |
స్థాపితం | 2007 |
స్థానం | వెంకట్రామన్నగూడెం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం 16°52′59″N 81°27′05″E / 16.8831°N 81.4513°E |
అనుబంధాలు | యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ |
చరిత్ర
మార్చుఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2007లో దీనిని స్థాపించింది. దీనితోపాటు మహబూబ్ నగర్ జిల్లా లోని మొజెర్ల, కడప జిల్లాలోని అనంతరాజుపేట లలో కూడా ఈ ఉద్యాన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆచార్య ఎన్.జి.రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో వివిధ కోర్సులను అందిస్తున్నాయి. 2008లో మొదటి వైస్-ఛాన్సలర్‌ను నియమించే వరకు దీనిని ప్రభుత్వ అధికారి నిర్వహించేవారు.[2] 2011లో దీనికి డా. వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయంగా పేరు మార్చారు.[3]
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "DR. YSR Horticultural University". www.drysrhu.edu.in. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
- ↑ "Welcome to Dr.Y.S.R Horticultural University". Dr. Y.S.R. Horticultural University. Archived from the original on 8 మే 2021. Retrieved 25 May 2021.
- ↑ "Dr.Y.S.R Horticultural University". Dr. Y.S.R. Horticultural University. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
బయటి లింకులు
మార్చు- అధికారిక వెబ్సైటు Archived 2021-05-25 at the Wayback Machine