డిక్లనేషన్

ఖగోళ నిర్దేశాంకాల్లో ఒకటి

ఖగోళ శాస్త్రంలో, భూమధ్యరేఖీయ నిర్దేశాంక వ్యవస్థలో ఖగోళ గోళంపై ఒక బిందువును గుర్తించే రెండు కోణాలలో డిక్లనేషన్ (సంక్షిప్త dec ; చిహ్నం δ ) ఒకటి. రెండవది రైట్ ఎసెన్షన్. డిక్లనేషన్ కోణాన్ని ఖగోళ భూమధ్యరేఖ నుండి ఉత్తరం లేదా దక్షిణంగా కొలుస్తారు.[1]

ఖగోళ గోళం లోపలి భాగంలో చూస్తే కనిపించే రైట్ ఎసెన్షన్, డిక్లనేషన్. వ్యవస్థ యొక్క ప్రాధమిక దిశ వసంత విషువత్తు - అంటే ఖగోళ భూమధ్యరేఖపై (నీలం) జ్యోతిశ్చక్రపు (ఎరుపు) ఎసెండింగ్ నోడ్. డిక్లనేషన్‌ను ఖగోళ మధ్యరేఖ నుండి ఉత్తరం వైపు లేదా దక్షిణం వైపుగా, కొలిచే బిందువు గుండా వెళ్ళే గంట వృత్తం (అవర్ సర్కిల్) వెంట కొలుస్తారు.

వివరణ

మార్చు

ఖగోళ నిర్దేశాంకాల్లో డిక్లనేషన్, భౌగోళిక నిర్దేశాంకాల్లో అక్షాంశానికి సమానమైనది. రైట్ ఎసెన్షన్ రేఖాంశానికి సమానమైనది. [2] ఖగోళ మధ్యరేఖకు ఉత్తరాన ఉన్న బిందువుల డిక్లనేషన్‌ను పాజిటివుగా చూపిస్తారు. దక్షిణాన ఉండే బిందువుల డిక్లనేషన్లు నెగటివుగా చూపిస్తారు. డిక్లనేషన్ కొలతను డిగ్రీలు (°), నిమిషాలు (′), సెకనులలో (″) సూచిస్తారు. ధ్రువాలు ఖగోళ గోళంలో ఉత్తరతమ, దక్షిణతమ బిందువులు కాబట్టి 90° కంటే ఎక్కువ డిక్లనేషన్లు ఉండవు.

ఒక వస్తువు

  • ఖగోళ భూమధ్యరేఖ వద్ద ఉంటే దాని డిక్లనేషన్ 0°
  • ఉత్తర ఖగోళ ధ్రువం వద్ద ఉంటే దాని డిక్లనేషన్ +90°
  • దక్షిణ ఖగోళ ధ్రువం వద్ద ఉంటే దాని డిక్లనేషన్ −90°

పాజిటివు విలువకు + గుర్తును తప్పక చూపించడం ఆనవాయితీ.

నక్షత్రాలు

మార్చు

భూమి నుండి నక్షత్రాలు ఉండే విస్తారమైన దూరాల కారణంగా దాని దిశ దాదాపు స్థిరంగానే ఉంటుంది. అయితే విషువత్తుల ప్రిసెషన్ కారణం గాను, ప్రాపర్ మోషన్ కారణం గానూ, యాన్యువల్ పారలాక్స్ కారణంగానూ వాటి రైట్ ఎసెన్షన్, డిక్లనేషన్‌లు క్రమేపీ మారుతూంటాయి. నక్షత్రాలతో పోలిస్తే సౌర వ్యవస్థ లోని వస్తువుల డిక్లనేషన్, కక్ష్యా చలనం, సామీప్యత కారణంగా, చాలా వేగంగా మారుతుంది.

భూమి ఉత్తరార్ధగోళంలోని స్థానాల నుండి చూస్తే, 90° - φ (ఇక్కడ φ అంటే పరిశీలకుడి అక్షాంశం) కంటే ఎక్కువ డిక్లనేషన్ కలిగిన ఖగోళ వస్తువులు క్షితిజం క్రిందకు అసలు వెళ్ళనే వెళ్ళకుండా ఖగోళ ధ్రువం చుట్టూ వృత్తాకారంలో తిరుగుతూనే ఉన్నట్లు కనిపిస్తుంది. అలా ధ్రువం చుట్టూ తిరిగే నక్షత్రాలను ధ్రువ పరిభ్రమణ నక్షత్రాలు (సర్కంపోలార్ నక్షత్రాలు) అంటారు. దక్షిణ అర్ధగోళంలో −90° - φ (దక్షిణ అక్షాంశాలకు φ ఎల్లప్పుడూ నెగటివ్ సంఖ్యయే)కంటే తక్కువ (అంటే మరింత నెగటివ్ డిక్లనేషన్) ఉన్న వస్తువులకు కూడా ఇదే విధంగా జరుగుతుంది. ఒక స్పష్టమైన ఉదాహరణ ధృవ నక్షత్రం. దీని డిక్లనేషన్ +90°కి దగ్గరగా ఉంటుంది. కాబట్టి భూమధ్యరేఖకు చాలా దగ్గరగా ఉంటే తప్ప ఉత్తర అర్ధగోళంలో ఎక్కడి నుండి చూసినా ధ్రువం చుట్టూనే తిరుగుతున్నట్లుగా కనిపిస్తుంది.

ధ్రువ పరిభ్రమణ నక్షత్రాలు ఎప్పుడూ క్షితిజం కిందకి పోవు. దీనికి విరుద్ధంగా, భూమి ఉపరితలంపై ఏ బిందువు నుండి చూసినా (భూమధ్యరేఖకు చాలా దగ్గరగా ఉన్న చోట్ల తప్ప) అసలు క్షితిజం పైకి రానే రాని నక్షత్రాలు కొన్ని ఉంటాయి. సాధారణంగా, δ డిక్లనేషన్ ఉన్న నక్షత్రం కొంతమంది పరిశీలకులకు ధ్రువ పరిభ్రమణ నక్షత్రం అయితే (ఇక్కడ δ పాజిటివు అయినా నెగటివు అయినా), అదే పరిశీలకుడీకి − δ డిక్లనేషన్ ఉన్న నక్షత్రం ఎప్పుడూ క్షితిజం పైకి రాదు (ఇది వాతావరణ వక్రీభవన ప్రభావాన్ని పట్టించుకోకుండా). అదే విధంగా, అక్షాంశం φ వద్ద ఒక పరిశీలకుడికి నక్షత్రం ధ్రువ పరిభ్రమణంగా ఉంటే, అక్షాంశం − φ వద్ద ఉన్న పరిశీలకుడికి ఆ నక్షత్రం ఎప్పుడూ క్షితిజం పైన కనబడదు.

వాతావరణ వక్రీభవనాన్ని పట్టించుకోకుండా ఉంటే, సరిగ్గా భూమధ్యరేఖపై ఉన్న పరిశీలకునికి, క్షితిజానికి తూర్పు, పశ్చిమ బిందువుల వద్ద డిక్లనేషన్ ఎల్లప్పుడూ 0° ఉంటుంది. ఉత్తర బిందువు వద్ద, ఇది 90° - | φ |, దక్షిణ బిందువు వద్ద, −90° + | φ | ఉంటుంది. ధ్రువాల వద్ద, మొత్తం క్షితిజమంతా డిక్లనేషన్ ఏకరీతిగా దాదాపు 0° ఉంటుంది.

అక్షాంశం ద్వారా నక్షత్రాలు కనిపిస్తాయి
పరిశీలకుడి అక్షాంశం (°) డిక్లనేషన్
వృత్తాకార నక్షత్రాలకు (°) ధ్రువ పరిభ్రమణం చేయని నక్షత్రాలకు (°) కనిపించని నక్షత్రాలకు (°)
+ ఉత్తర అక్షాంశం కోసం, − దక్షిణం కోసం − ఉత్తర అక్షాంశం కోసం, + దక్షిణం కోసం
90 (ధ్రువం) 90 నుండి 0 0 నుండి 90
66.5 ( ఆర్కిటిక్ / అంటార్కిటిక్ సర్కిల్ ) 90 నుండి 23.5 +23.5 నుండి −23.5 23.5 నుండి 90
( )మధ్య

ిందువు

90 నుండి 45 +45 నుండి -45 వరకు 45 నుండి 90
23.5 (కర్కట రేఖ/ మకరరేఖ) 90 నుండి 66.5 +66.5 నుండి −66.5 66.5 నుండి 90
0 (భూమధ్య రేఖ) N/A +90 నుండి -90 వరకు N/A

ధ్రువాల చుట్టూ పరిభ్రమించని నక్షత్రాలు సంవత్సరంలో కొన్ని రోజుల్లో లేదా సీజన్లలో మాత్రమే కనిపిస్తాయి.

 
రాత్రి ఆకాశం, రెండు భాగాలుగా విభజించబడింది. డిక్లనేషన్ (నీలం) భూమధ్యరేఖ (ఆకుపచ్చ) వద్ద ప్రారంభమై, ఉత్తరం వైపు పాజిటివుగా ఉంటుంది (ఎగువ వైపు), దక్షిణం వైపు (దిగువ వైపు) నెగటివుగా ఉంటుంది. డిక్లనేషన్ రేఖలు (నీలం) ఆకాశాన్ని 15° చొప్పున చిన్న వృత్తాలుగా విభజిస్తాయి.

సూర్యుడు

మార్చు

ఋతువులను బట్టి సూర్యుని డిక్లనేషన్ మారుతూ ఉంటుంది. ఆర్కిటిక్ లేదా అంటార్కిటిక్ అక్షాంశాల నుండి చూస్తే, సూర్యుడు స్థానిక వేసవి అయనాంతం వద్ద ధ్రువ పరిభ్రమణంలో ఉంటాడు. ఇది అర్ధరాత్రి వేళ కూడా సూర్యుడు క్షితిజం పైననే ఉండే ఈ దృగ్విషయాన్నే అర్ధరాత్రి సూర్యుడు అని పిలుస్తారు. అదేవిధంగా, స్థానిక శీతాకాలపు అయనాంతం వద్ద, సూర్యుడు రోజంతా క్షితిజానికి క్రిందనే ఉంటాడు, దీనినే ధ్రువ రాత్రి అంటారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. U.S. Naval Observatory, Nautical Almanac Office (1992). P. Kenneth Seidelmann (ed.). Explanatory Supplement to the Astronomical Almanac. University Science Books, Mill Valley, CA. p. 724. ISBN 0-935702-68-7.
  2. Moulton, Forest Ray (1918). An Introduction to Astronomy. New York: Macmillan Co. p. 125, art. 66.