దక్షిణార్ధగోళం

భూమధ్యరేఖకు దక్షిణాన భూమిలో సగం

భూమధ్యరేఖకు దక్షిణాన ఉన్న భూభాగమే దక్షిణార్ధగోళం. ఐదు ఖండాల భాగాలు[1] (అంటార్కిటికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలో 90%, ఆఫ్రికాలో మూడోవంతు, ఆసియాలోని కొన్ని ద్వీపాలు) నాలుగు మహాసముద్రాలు (హిందూదక్షిణ అట్లాంటిక్దక్షిణ మహా సముద్రందక్షిణ పసిఫిక్) ఓషియానియా లోని పసిఫిక్ దీవులు దక్షిణార్ధగోళంలోనే ఉన్నాయి. దీని భూభాగంలో 80.9% నీరు ఉంది.  ఉత్తరార్ధగోళంలో నీరు 60.7% దాకా ఉంది. భూమ్మీది మొత్తం నేలలో 32.7% దక్షిణార్ధగోళంలో ఉంది.[2]

పసుపు రంగులో దక్షిణార్ధగోళం - అంటార్కిటికాను చూపించలేదు
దక్షిణ ధ్రువం పై నుండి దక్షిణార్ధగోళం
"ఉషుయా, ప్రపంచానికి చివర" అనే పురాణంతో పోస్టర్. అర్జెంటీనాలోని ఉషుయా ప్రపంచంలో అత్యంత దక్షిణ కొసన ఉన్న నగరం.

భూపరిభ్రమణ తలం నుండి భూమి అక్షం వంగి ఉన్న కారణంగా దక్షిణార్థగోళంలో వేసవికాలం డిసెంబరు నుండి మార్చి వరకు, శీతాకాలం జూన్ నుండి సెప్టెంబరు వరకూ ఉంటాయి. క్యాలెండరు సంవత్సరానికి, సెప్టెంబరు 22 / 23 తేదీన వసంత విషువత్తు, మార్చి 20 / 21 న శరద్ విషువత్తు తటస్థిస్తాయి. దక్షిణ ధ్రువం దక్షిణార్థగోళానికి మధ్యలో ఉంటుంది. 

లక్షణాలు

మార్చు

దక్షిణార్థగోళంలోని శీతోష్ణస్థితులు, అదే ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్న ఉత్తరార్థగోళంలోని ప్రాంతాలతో పోలిస్తే తక్కువ తీవ్రంగా ఉంటాయి. అయితే అంటార్కిటికాలో మాత్రం, ఆర్కిటిక్ కంటే చలి తీవ్రంగా ఉంటుంది. దీనికి కారణం, దక్షిణార్థగోళంలో నేల కంటే నీరు చాలా ఎక్కువ ఉంటుంది. నీరు ఆలస్యంగా వేడెక్కి ఆలస్యంగా చల్లారుతుంది.

 
న్యూజీలాండ్ లో కనిపించే అరోరా ఆస్ట్రాలిస్

దక్షిణార్ధగోళంలో సూర్యుడు తూర్పు నుండి పశ్చిమానికి ఉత్తరం గుండా ప్రయణిస్తాడు. మకరరేఖకు, భూమధ్య రేఖకూ మధ్య ప్రాంతంలో సూర్యుడు నడినెత్తినగానీ కొద్దిగా దక్షిణంగా గానీ ఉంటాడు. సూర్యుడి కారణంగా ఏర్పడిన నీడలు అపసవ్యదిశలో తిరుగుతూంటాయి. నీడగడియారంలో గంటలు అపసవ్యదిశలో పెరుగుతూంటాయి. మకరరేఖకు దక్షిణంగా ఉన్న ప్రాంతం నుండి సూర్యగ్రహణాలను పరిశీలిస్తే, సూర్యుడి నేపథ్యంలో చంద్రుడు ఎడమ నుండి కుడికి కదులుతూ కనిపిస్తాడు. ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖకు ఉత్తరాన ఉన్న ప్రాంతం నుండి చూస్తే, చంద్రుడు కుడి నుండి ఎడమకు కదులుతూ కనిపిస్తాడు.

కొరియోలిస్ దృగ్విషయం కారణంగా దక్షిణార్ధగోళంలో తుపానులు సవ్యదిశలో తిరుగుతూంటాయి.[3]

దక్షిణార్ధగోళంలోని సమశీతోష్ణ ప్రాంతం దాదాపు పూర్తిగా సముద్రమే. ఈ ప్రాంతంలో ఉరుగ్వేలెసోతోస్వాజీల్యాండ్న్యూజీలాండ్చిలీలో చాలా భాగం, అర్జంటైనాపరాగ్వేలో కొంత భాగం, బ్రెజిల్నమీబియా, బోట్స్‌వానా, మొజాంబిక్, మడగాస్కర్ ఉన్నాయి.

జనాభా

మార్చు

దక్షిణార్థగోళంలో 80 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇది భూమ్మీది మొత్తం జనాభాలో 11% మాత్రమే. ఇక్కడ నేల చాలా తక్కువ ఉండడమే దీనికి కారణం.[4][5]

ఖండాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Hemisphere Map". WorldAtlas. Retrieved 13 June 2014.
  2. Life on Earth: A - G.. 1. ABC-CLIO. 2002. p. 528. ISBN 9781576072868. Retrieved 8 September 2016.
  3. "Surface Ocean Currents". National Oceanic and Atmospheric Administration. Retrieved 13 June 2014.
  4. "90% Of People Live In The Northern Hemisphere - Business Insider". Business Insider. 4 May 2012. Retrieved 10 November 2015.
  5. "GIC - Article". galegroup.com. Retrieved 10 November 2015.