డిజిటల్ తెలంగాణ
డిజిటల్ తెలంగాణ అనేది తెలంగాణ ప్రభుత్వ సమాచార, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో వారంరోజులపాటు నిర్వహించబడిన ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా 2015 జూలై 1 నుండి జూలై 6 వరకు వారం రోజులపాటు డిజిటల్ తెలంగాణపై అవగాహన కార్యక్రమాలు జరిగాయి.[1]
డిజిటల్ తెలంగాణ | |
---|---|
ప్రధాన వ్యక్తులు | తెలంగాణ ప్రజలు |
స్థాపన | జూలై 1 నుండి 6 వరకు, 2015 |
వెబ్ సైటు | డిజిటల్ తెలంగాణ వెబ్సైటు |
నిర్వాహకులు | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ ప్రభుత్వం |
కార్యక్రమ నేపథ్యం
మార్చుమేక్ ఇన్ ఇండియా, క్లీన్ ఇండియా (స్వచ్ఛ్ భారత్) తర్వాత, భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని రూపొందించింది. పౌరులు డిజిటల్ సాధికారతను ప్రారంభించడం, ప్రతి పౌరునికి డిజిటల్ మౌలిక సదుపాయాలను సులభతరం చేయడం, డిమాండ్‌పై పాలన & సేవలను అందించడం వంటి లక్ష్యాలతో రూపొందిన ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె.టి.రామారావు ఆధ్వర్యంలో డిజిటల్ తెలంగాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.[2][3]
కార్యక్రమ వివరాలు
మార్చు- జూలై 1న ప్రధాని మన్‌కీ బాత్
- జూలై 2న గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు
- జూలై 3న డివిజినల్, జిల్లాస్థాయిలో డిజిటల్ తెలంగాణపై శిక్షణ
- జూలై 4న జిల్లాస్థాయిలో డిజిటల్ తెలంగాణపై పోటీలు, చర్చలు
- జూలై 5న హైదరాబాద్‌లో 5కె రన్, డిజిటల్ రాహ్‌గిరి
- జూలై 6న రాష్ట్రస్థాయిలో స్వచ్ఛ డిజిటల్ ఇండియా, అవార్డుల ప్రదానం, ఒప్పందాలపై సంతకాలు
లక్ష్యాలు
మార్చుడిజిటల్ తెలంగాణ కార్యక్రమ లక్ష్యాలు:[4]
- డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా కింద ప్రతి ఇంటిలో ఒక సభ్యుడిని డిజిటల్ అక్షరాస్యులుగా మార్చడం
- పాఠశాల కంప్యూటర్ అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా 6వ తరగతి నుండి ప్రతి విద్యార్థికీ కంప్యూటర్ల ప్రాథమికా అంశాలను నేర్పడం
- మీ-సేవ సేవల విస్తరణలో భాగంగా సాధ్యమైనన్ని ఎక్కువ మీ-సేవా సేవలను మొబైల్ ప్లాట్‌ఫామ్‌లోకి మార్చడం
- పౌరులకు మెరుగైన సేవలను అందించడానికి అన్ని ప్రభుత్వ సంస్థలకు సాంకేతిక పరిష్కారాలను గుర్తించడం
- ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, చార్మినార్, పబ్లిక్ గార్డెన్స్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో వైఫై సదుపాయాలు కల్పించడం[5]
మూలాలు
మార్చు- ↑ "జులై 1నుంచి డిజిటల్ తెలంగాణ". Samayam Telugu. 2015-06-30. Archived from the original on 2022-01-01. Retrieved 2022-01-01.
- ↑ "Digital Telangana | Information Technology, Electronics & Communications Department, Government of Telangana, India". it.telangana.gov.in. Archived from the original on 2021-05-09. Retrieved 2022-01-01.
- ↑ Krishnamoorthy, Suresh (2015-07-29). "Digital Telangana more ambitious than Digital India: Jayesh Ranjan". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2021-05-05. Retrieved 2022-01-01.
- ↑ INDIA, THE HANS (2016-07-01). "Digital Telangana Programme in Bangaru Telangana". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2018-10-24. Retrieved 2022-01-01.
- ↑ "ఇకపై హైదరాబాద్ నలుమూలలా ఉచిత వైఫై!". Samayam Telugu. 2017-03-05. Archived from the original on 2017-03-08. Retrieved 2022-01-01.
బయటి లంకెలు
మార్చు- డిజిటల్ తెలంగాణ కార్యక్రమ అధికారిక వెబ్సైటు Archived 2022-01-01 at the Wayback Machine