డేంజర్ 2005లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన థ్రిల్లర్ సినిమా.[1][2] ఇందులో అల్లరి నరేష్, సాయిరాం శంకర్, కలర్స్ స్వాతి ముఖ్య పాత్రల్లో నటించారు.[3]

డేంజర్
దర్శకత్వంకృష్ణ వంశీ
రచనఉత్తేజ్ (సంభాషణలు)
స్క్రీన్ ప్లేకృష్ణ వంశీ
నిర్మాతసుంకర మధుమురళి
తారాగణంఅల్లరి నరేష్, స్వాతి, బ్రహ్మానందం, అభిషేక్, సాయిరాం శంకర్
ఛాయాగ్రహణంఓం ప్రసాద్
కూర్పులోకేష్
సంగీతంజాషువా శ్రీధర్
నిర్మాణ
సంస్థ
కార్తికేయ క్రియేషన్స్
విడుదల తేదీ
2005 అక్టోబరు 29 (2005-10-29)
భాషతెలుగు
బడ్జెట్25 కోట్లు

కథ సవరించు

లక్ష్మి, కార్తీక్, సత్య, ఆలీ, రాధిక చిన్ననాటి స్నేహితులు. లక్ష్మికి పెళ్ళి నిశ్చయం అవుతుంది. అందరూ కలిసి ఓ ఫాం హౌస్ కి వెళ్ళి పార్టీ చేసుకోవాలనుకుంటారు. దారిలో ఓ పోలీసు వాహనాన్ని గుద్ది వారినుంచి తప్పించుకుంటూ దారి తప్పి ఓ అడవిలోకి వచ్చేస్తారు. అక్కడ ఓ రాజకీయ నాయకుడు కొన్ని మంత్ర శక్తుల కోసం ఓ చిన్న పాపను బలివ్వడం చూస్తారు. ఆలీ తన దగ్గరున్న కెమెరాలో ఆ దృశ్యాల్ని బంధిస్తాడు. దాంతో ఆ రాజకీయ నాయకుడి అనుచర గణం, అతనికి అనుకూలురైన పోలీసులు వీరి వెంట పడతారు. వాళ్ళ నుంచి తప్పించుకుని స్నేహితుల బృందం ఆ రాజకీయ నాయకుణ్ణి ఎలా చట్టానికి పట్టించారనేది మిగతా కథ.

తారాగణం సవరించు

మూలాలు సవరించు

  1. జి. వి, రమణ. "డేంజర్ సినిమా సమీక్ష". idlebrain.com. Retrieved 28 November 2017.
  2. "ఇండియా గ్లిట్జ్ సినిమా సమీక్ష". indiaglitz.com. Retrieved 28 November 2017.
  3. "సినిమా సమీక్ష". movies.fullhyderabad.com. Retrieved 28 November 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=డేంజర్&oldid=3874876" నుండి వెలికితీశారు