డేవిడ్ జోనాథన్ విల్లీ (జననం 1990 ఫిబ్రవరి 28) ఒక ఇంగ్లీష్ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు . అతను ఎడమచేతి వాటం బ్యాటరు, బౌలరు. అతను ఇంగ్లాండ్ మాజీ క్రికెటరూ, అంతర్జాతీయ అంపైరు అయిన పీటర్ విల్లీ కుమారుడు. [1] 2022 T20 ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో విల్లీ సభ్యుడు.

డేవిడ్ విల్లీ
2021 జూన్‌లో విల్లీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డేవిడ్ జోనాథన్ విల్లీ
పుట్టిన తేదీ (1990-02-28) 1990 ఫిబ్రవరి 28 (వయసు 34)
నార్తాంప్టన్, నార్తాంప్టన్‌షైర్, ఇంగ్లాండ్
ఎత్తు6 అ. 1 అం. (1.85 మీ.)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఫాస్ట్-మీడియం
పాత్రBowling ఆల్ రౌండరు
బంధువులుPeter Willey (father)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 240)2015 మే 8 - ఐర్లాండ్ తో
చివరి వన్‌డే2023 జనవరి 27 - దక్షిణాఫ్రికా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.15
తొలి T20I (క్యాప్ 72)2015 జూన్ 23 - న్యూజీలాండ్ తో
చివరి T20I2022 అక్టోబరు 14 - ఆస్ట్రేలియా తో
T20Iల్లో చొక్కా సంఖ్య.15
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2009–2015నార్తాంప్టన్‌షైర్ (స్క్వాడ్ నం. 15)
2015/16–2018/19పెర్త్ స్కార్చర్స్ (స్క్వాడ్ నం. 8)
2016–2022యార్క్‌షైర్ (స్క్వాడ్ నం. 72)
2018చెన్నై సూపర్ కింగ్స్ (స్క్వాడ్ నం. 15)
2022ముల్తాన్ సుల్తాన్స్ (స్క్వాడ్ నం. 15)
2022–presentరాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (స్క్వాడ్ నం. 15)
2023–presentనార్తాంప్టన్‌షైర్ (స్క్వాడ్ నం. 23)
2023–presentవెల్ష్ ఫైర్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు టి20 ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 64 43 77 147
చేసిన పరుగులు 538 226 2,515 2,020
బ్యాటింగు సగటు 24.45 15.06 27.33 25.56
100లు/50లు 0/2 0/0 2/14 3/7
అత్యుత్తమ స్కోరు 51 33* 104* 167
వేసిన బంతులు 2,817 865 10,745 5,608
వికెట్లు 84 51 198 172
బౌలింగు సగటు 31.21 23.13 29.77 30.60
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 6 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1 0
అత్యుత్తమ బౌలింగు 5/30 4/7 5/29 5/30
క్యాచ్‌లు/స్టంపింగులు 26/– 17/– 18/– 52/–
మూలం: ESPNcricinfo, 2 August 2023

వ్యక్తిగత జీవితం

మార్చు

విల్లీ 2016 నవంబరులో గాయని-గేయరచయిత కరోలిన్ విల్లీని వివాహం చేసుకున్నాడు.[2]

సెప్టెంబరులో, విల్లీ వెస్టిండీస్‌తో జరిగిన వన్‌డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో 1–39 సాధించాడు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. [3] అతను తర్వాతి మ్యాచ్‌కి ఎంపికయ్యాడు, అయితే కేవలం రెండు బంతులు మాత్రమే ఆడిన తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేయబడినందున అతను ఆడలేకపోయాడు.[4] మూడో మ్యాచ్‌లో విల్లీ 1–34 తీసుకున్నాడు. ఇంగ్లాండ్ మళ్లీ వెస్టిండీస్‌ను ఓడించింది.[5] అతను సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌లు ఆడలేదు కానీ ఇంగ్లండ్ ఆ మ్యాచ్‌లను, సిరీస్‌నూ 4-0తో గెలుచుకుంది. [6] [7]

అంతర్జాతీయ కెరీర్

మార్చు
 
2015 లో ఇంగ్లండ్‌కు ఆడుతూ విల్లీ

విల్లీ బంగ్లాదేశ్‌తో టెస్టుల కోసం ఇంగ్లాండ్ U19 క్రికెట్ జట్టులో ఎంపికయ్యాడు. తొలి టెస్టులో ఆడకపోయినా, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 65 పరుగులు చేశాడు. [8] అతను 2015 మే 8న ఐర్లాండ్‌పై ఇంగ్లండ్ తరపున తన వన్డే అంతర్జాతీయ రంగప్రవేశం చేసాడు. వర్షంతో ప్రభావితమైన ఆ మ్యాచ్‌లో తన మొదటి వికెట్ తీసుకున్నాడు. [9]

విల్లీ 2015 జూన్ 14న న్యూజిలాండ్‌తో జరిగిన ఇంగ్లండ్ వన్‌డే జట్టుకు కూడా ఎంపికయ్యాడు. సిరీస్‌లోని మూడవ మ్యాచ్‌లో ఆడాడు. [10] అతను తన 2వ బంతికి వికెట్ తీసి 3–69తో ముగించాడు. [11] సిరీస్‌లోని నాల్గవ మ్యాచ్‌లో అతను 2–89 సాధించాడు. ఇంగ్లండ్ ఆ గేమ్‌ను సునాయాసంగా గెలుచుకుంది. [12] సిరీస్‌లోని చివరి గేమ్‌లో 2–50 సాధించాడు. ఇంగ్లండ్ 3-2తో సిరీస్‌ను గెలుచుకుంది.[13] విల్లీ 2015 జూన్ 23న అదే సిరీస్‌లో తన ట్వంటీ20 అంతర్జాతీయ రంగప్రవేశం చేశాడు [14] అతను 3–22 తీసుకున్నాడు. ఆరు పరుగులు చేసి ఇంగ్లండ్ మ్యాచ్‌ను గెలవడానికి సహాయం చేశాడు. [15]

మొదటి వన్‌డేలో విల్లీ 2-47తో అజేయంగా పది పరుగులు చేశాడు. ఇంగ్లండ్ మూడు వికెట్ల తేడాతో ఓడిపోయింది.[16] రెండో వన్‌డేలో అతను 0–32 సాధించాడు. భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. [17] ఆఖరి వన్‌డేలో అతను 1-8 సాధించాడు గానీ గాయపడ్డాడు. ఇంగ్లాండ్ ఐదు పరుగుల తేడాతో గెలిచింది. [18] [19]

2016 T20 ప్రపంచ కప్

మార్చు

2016 ప్రపంచ T20 కప్‌ ప్రచారంలో విల్లీ ప్రతి గేమ్ ఆడాడు. అతను వెస్టిండీస్‌పై 1–33, దక్షిణాఫ్రికాపై 1–40 తీసుకున్నాడు. [20] [21] ఆఫ్ఘనిస్తాన్‌పై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌ను 141 పరుగులకు చేర్చేందుకు అజేయంగా 20 పరుగులు చేసి, 2-23తో వికెట్లు తీసుకున్నాడు. [22] అదే మ్యాచ్‌లో, మొయిన్ అలీతో కలిసి, T20 ప్రపంచ కప్ చరిత్రలో 8వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం 57 పరుగుల రికార్డును నెలకొల్పాడు. [23] విల్లీ శ్రీలంకపై 2–26తో ఆకట్టుకున్నాడు. [24] మ్యాచ్ తర్వాత, అసభ్య పదజాలం ఉపయోగించినందుకు, శ్రీలంక బ్యాట్స్‌మెన్ మిలిందా సిరివర్దనకు పెవిలియన్ వైపు పొమ్మని చూపించినందుకు విల్లీకి మ్యాచ్ ఫీజులో 15% జరిమానా విధించారు. [25] న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో అతను 1–17తో స్కోరు సాధించాడు. [26] ఫైనల్లో విల్లీ బాగా బౌలింగ్ చేసి, 3-20 చేశాడు. ఇంగ్లండ్ ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. [27] ICC 2016 T20 ప్రపంచ కప్ కోసం అతను 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్'లో ఎంపికయ్యాడు. [28]

2017 ఇండియా, వెస్టిండీస్

మార్చు

2019 క్రికెట్ ప్రపంచ కప్, ఆ తర్వాత

మార్చు

2019 ఏప్రిల్లో, విల్లీ 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ తాత్కాలిక జట్టులో ఎంపికయ్యాడు. [29] [30] 2019 మే 21న, ఇంగ్లండ్ ప్రపంచ కప్ కోసం తమ జట్టును ఖరారు చేసింది, చివరి పదిహేను మంది సభ్యుల జట్టులో విల్లీ పేరు లేదు. [31]

2020 మే 29న, COVID-19 మహమ్మారి తర్వాత ఇంగ్లాండ్‌లో ప్రారంభమయ్యే అంతర్జాతీయ మ్యాచ్‌లకు ముందు శిక్షణను నిచ్చే 55 మంది ఆటగాళ్ల బృందంలో విల్లీ కూడా ఉన్నాడు.[32] [33] 2020 జూలై 9న, ఐర్లాండ్‌తో జరిగే వన్‌డే సిరీస్ కోసం శిక్షణ నిచ్చే 24 మంది సభ్యుల జట్టులో విల్లీని చేర్చారు. [34] [35] 2020 జూలై 27న, వన్‌డే సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టులో విల్లీ ఎంపికయ్యాడు. [36] [37] 2020 జూలై 30న, ఐర్లాండ్‌తో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో, విల్లీ 8.4 ఓవర్లలో 5/30తో వన్‌డే మ్యాచ్‌లో తన మొదటి ఐదు వికెట్ల పంట సాధించాడు. [38]


2021 జూన్ 29న, శ్రీలంకతో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో, విల్లీ తన 50వ వన్‌డే మ్యాచ్‌లో ఆడాడు. [39] 2021 సెప్టెంబరులో, విల్లీ 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ జట్టులో ఎంపికయ్యాడు. [40]

మూలాలు

మార్చు
  1. "David Willey". ESPN Cricinfo. Retrieved 26 June 2018.
  2. "England cricketer David Willey weds singer Carolynne Good in stunning ceremony". Hello Magazine. 8 November 2016. Retrieved April 7, 2017.
  3. "1st ODI (D/N), West Indies tour of England at Manchester, Sep 19 2017 - Match summary". ESPN Cricinfo. Retrieved 27 June 2018.
  4. "2nd ODI (D/N), West Indies tour of England at Nottingham, Sep 21 2017 - Match commentary". ESPN Cricinfo. Retrieved 27 June 2018.
  5. "3rd ODI, West Indies tour of England at Bristol, Sep 24 2017 - Match summary". ESPN Cricinfo. Retrieved 28 June 2018.
  6. "4th ODI (D/N), West Indies tour of England at London, Sep 27 2017 - Match summary". ESPN Cricinfo. Retrieved 28 June 2018.
  7. "5th ODI (D/N), West Indies tour of England at Southampton, Sep 29 2017 - Match summary". ESPN Cricinfo. Retrieved 28 June 2018.
  8. England U19 V Bangladesh U19 Scorecard BBC Sport. 2007-07-12. Retrieved 2010-01-14.
  9. "England tour of Ireland, Only ODI: Ireland v England at Dublin, May 8, 2015". ESPN Cricinfo. Retrieved 8 May 2015.
  10. "England v NZ: 3rd ODI as it happened". BBC Sport. Retrieved 27 June 2018.
  11. "3rd ODI, New Zealand tour of England at Southampton, Jun 14 2015 - Match report". ESPN Cricinfo. Retrieved 27 June 2018.
  12. "4th ODI (D/N), New Zealand tour of England at Nottingham, Jun 17 2015 - Match summary". Retrieved 27 June 2018.
  13. "5th ODI, New Zealand tour of England at Chester-le-Street, Jun 20 2015 - Match summary". ESPN Cricinfo. Retrieved 27 June 2018.
  14. "New Zealand tour of England, Only T20I: England v New Zealand at Manchester, Jun 23, 2015. Partner of Carolynne Poole". ESPNcricinfo. ESPN Sports Media. 23 June 2015. Retrieved 23 June 2015.
  15. "England vs New Zealand, Only T20I - Live Cricket Score, Commentary". CricBuzz. Retrieved 27 June 2018.
  16. "1st ODI (D/N), England tour of India at Pune, Jan 15, 2017 - Match Summary". ESPN Cricinfo. Retrieved 26 June 2018.
  17. "2nd ODI (D/N), England tour of India at Cuttack, Jan 19, 2017 - Match Summary". ESPN Cricinfo. Retrieved 26 June 2018.
  18. "3rd ODI (D/N), England tour of India at Kolkata, Jan 22, 2017 - Match Summary". ESPN Cricinfo. Retrieved 26 June 2018.
  19. "Ben Stokes, Chris Woakes help England defend 321". ESPN Cricinfo. Retrieved 26 June 2018.
  20. "15th Match, Super 10 Group 1 (N), World T20 at Mumbai, Mar 16 2016 - Match summary". ESPN Cricinfo. Retrieved 26 June 2018.
  21. "18th Match, Super 10 Group 1 (N), World T20 at Mumbai, Mar 18 2016 - Match summary". ESPN Cricinfo. Retrieved 26 June 2018.
  22. "24th Match, Super 10 Group 1 (D/N), World T20 at Delhi, Mar 23 2016 - Match summary". ESPN Cricinfo. Retrieved 27 June 2018.
  23. "Highest partnership for each wicket in T20 World Cup history". Archived from the original on 11 April 2017. Retrieved 7 March 2017.
  24. "29th Match, Super 10 Group 1 (N), World T20 at Delhi, Mar 26 2016 - Match summary". ESPN Cricinfo. Retrieved 27 June 2018.
  25. "England vs Sri Lanka: Jason Roy, David Willey fined for misconduct". The Indian Express. 27 March 2016. Retrieved 27 June 2018.
  26. "1st Semi-Final (N), World T20 at Delhi, Mar 30 2016 - Match summary". ESPN Cricinfo. Retrieved 27 June 2018.
  27. "Final (N), World T20 at Kolkata, Apr 3 2016 - Match summary". ESPN Cricinfo. Retrieved 27 June 2018.
  28. "ICC names WT20 Teams of the Tournament".
  29. "Jofra Archer misses World Cup cut but included to play Ireland, Pakistan". ESPN Cricinfo. Retrieved 17 April 2019.
  30. "England leave out Jofra Archer from World Cup squad". International Cricket Council. Retrieved 17 April 2019.
  31. "World Cup: England name Jofra Archer, Tom Curran & Liam Dawson in squad". BBC Sport. Retrieved 21 May 2019.
  32. "England Men confirm back-to-training group". England and Wales Cricket Board. Retrieved 29 May 2020.
  33. "Alex Hales, Liam Plunkett left out as England name 55-man training group". ESPN Cricinfo. Retrieved 29 May 2020.
  34. "Injured Chris Jordan misses England's ODI squad to face Ireland". ESPN Cricinfo. Retrieved 9 July 2020.
  35. "England men name behind-closed-doors ODI training group". England and Wales Cricket Board. Retrieved 9 July 2020.
  36. "England Men name 14-strong squad for Royal London Series". England and Wales Cricket Board. Retrieved 27 July 2020.
  37. "England v Ireland: David Willey & Reece Topley recalled for ODI series". BBC Sport. Retrieved 27 July 2020.
  38. "Ireland skittled for 172 in first ODI as England seamer David Willey takes five wickets". Sky Sports. Retrieved 30 July 2020.
  39. "David Willey's return, what next for Tom Curran, and how competitive can Sri Lanka be? ODI Things to Watch". The Cricketer. Retrieved 29 June 2021.
  40. "Tymal Mills makes England's T20 World Cup squad, no return for Ben Stokes". ESPN Cricinfo. Retrieved 9 September 2021.