తంబళ్లపల్లి

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం లోని గ్రామం


తంబళ్లపల్లి, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన గ్రామం.[1].

తంబళ్లపల్లి
రెవిన్యూ గ్రామం
తంబళ్లపల్లి is located in Andhra Pradesh
తంబళ్లపల్లి
తంబళ్లపల్లి
నిర్దేశాంకాలు: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E / 15.377; 78.926Coordinates: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E / 15.377; 78.926 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంగిద్దలూరు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం296 హె. (731 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం624
 • సాంద్రత210/కి.మీ2 (550/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08405 Edit this at Wikidata)
పిన్(PIN)523357 Edit this at Wikidata

సమీప మండలాలుసవరించు

ఉత్తరాన రాచెర్ల మండలం, దక్షణాన కొమరోలు మండలం, ఉత్తరాన బెస్తవారిపేట మండలం, దక్షణాన కలసపాడు మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. స్వాతంత్ర్యానికి మునుపు బ్రిటీషు హయాములో స్థాపించబడినది ఈ పాఠశాల 2004 లో ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు జరుపుకొన్నది. 5వ తరగతి వరకు ఈ పాఠశాలలోనే చదివి గ్రామ విద్యార్థులు ఉన్నత పాఠశాలకు 3 మైళ్ల దూరములో ఉన్న రాజుపాలెం గ్రామానికి వెళతారు.

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

మండల కేంద్రాలైన గిద్దలూరు, కొమరోలుల నుండి గ్రామానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహించే బస్సు సౌకర్యము ఉంది. కడప నుండి మార్కాపురం వెళ్లే రాష్ట్ర రహదారి గ్రామానికి తూర్పున ఒక మైలు దూరములో ఉంది.

గ్రామ పంచాయితీసవరించు

ఈ గ్రామం మండలంలోనే చిన్న పంచాయితీ. ఈ పంచాయితీలో గుమ్ముళ్లపల్లె (త్రిపురాంతకం) అనే చిన్న కుగ్రామం.కూడా ఉంది. రెండు గ్రామాలు కలిపి కూడా 500 కంటే మించి ఓటర్లు ఉండరు. ఈశాన్యాన హరిజనవాడ (పాలెం) ఉంది.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

  1. గ్రామంలోని రెండు ప్రధాన వీధుల కూడలిలో రామాలయము ఉంది.
  2. ఊరికి ఆగ్నేయ దిక్కున పొలిమేర్లలో కాశినాయన ఆశ్రమం ఉంది.
  3. శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, 2015, ఆగస్టు-23వ తేదీ ఆదివారంనాడు, భక్తులు, ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు చేపట్టినారు. మద్యాహ్నం, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. [2]

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 624 - పురుషుల సంఖ్య 319 - స్త్రీల సంఖ్య 305 - గృహాల సంఖ్య 169

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 586.[2] ఇందులో పురుషుల సంఖ్య 295, మహిళల సంఖ్య 291, గ్రామంలో నివాస గృహాలు 150 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 296 హెక్టారులు.అక్షరాస్యత: 34.81 శాతం, పురుషుల అక్షరాస్యత: 51.18 శాతం, స్త్రీల అక్షరాస్యత: 18.21 శాతం.

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం; 2015, ఆగస్టు-24; 4వపేజీ.