తదేక గీతం సోమేపల్లి వెంకట సుబ్బయ్య రచించిన వచన కవితా సంకలనం[1][2][3]. ఈ రచన 2006 సంవత్సరంలో ముద్రితమయ్యింది. తదేకగీతాన్ని ఆచార్య ఎన్. గోపికి అంకితమిచ్చారు. ఇందులోని కవితలు ప్రజాశక్తి, విశాలాంధ్ర, ఆంధ్రప్రభ, వార్త, చినుకు, పత్రిక, నేటి నిజం, తెలుగు విద్యార్థి, నడుస్తున్న చరిత్ర వంటి దిన, వార, మాసపత్రికలలో, వివిధ కవితా సంకలనాలలో ప్రచురితమయ్యాయి. తదేకగీతం వచన కవితా సంపుటిని డాక్టర్‌ నారాయణచార్యులు హిందీలోకి "మహక్‌ మాటికీ" పేరుతో అనువదించారు. [4]

తదేక గీతం
కృతికర్త: సోమేపల్లి వెంకట సుబ్బయ్య
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): కవిత్వం
ప్రచురణ: క్రిసెంట్ పబ్లికేషన్స్
విడుదల: 2006

రచన నుండి ఒక కవితసవరించు

మనవీయవనానికి
మమతల చెమ్మ
అప్పుడే శాంతిసుమాల పరిమళం
కళ్ళల్లో అసూయ
పళ్ళల్లో విషయం రగిలిస్తుంటే
చెట్టపట్టాల రైలుపెట్టెలూ
రెక్కల విమానాలై
ఖండాంతరాలకు ఎగిరిపోతే!
బతుకు యాత్రకు
బలపం కట్టుకున్న బడుగుకూడళ్ళు
భస్మీపటలమే మరి!
నీటి బుడగల నేపథ్యం
పిరికితనం
కాబట్టే
బూడిదమసినో
బ్లాక్ బాక్సునో
అడిగితెలుసుకోవాల్సిన అగత్యం
ఎన్నయినా చెప్పు
రక్తం ఏరుగాపారించి
సాధించేదేమిటి?
గగన కుసుమాలేగా...?
తదేకంగా ఆలోచించండి.

తదేక గీతం-చైతన్య దీపంసవరించు

తెలుగు ఉపాధ్యాయురాలు నెల్లిమర్ల లక్ష్మిగారు 'తదేక గీతం' కవితా సంపుటిపై పరిశోధన చేసి 2010లో రచనపై తదేక గీతం-చైతన్య దీపం అనే సిద్ధాంత వ్యాసం సమర్పించి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి M.Phil పట్టా పొందారు.2012 జూలైలో క్రిసెంట్ పబ్లికేషన్స్ ద్వారా సిద్దాంత వ్యాసాన్ని పుస్తకంగా ప్రచురించారు.[2][5]

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. http://www.prajasakti.com/Article/Sneha/2156875
  2. 2.0 2.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-02. Retrieved 2015-06-02.
  3. http://lit.andhrajyothy.com/sahityanews/someoalliki-gidugurammuthi-puraskaram-6080[permanent dead link]
  4. http://lit.andhrajyothy.com/upcomingsahithyakaryakramalu/tadeka-geetam-book-relase-in-guntur-7529[permanent dead link]
  5. http://archive.andhrabhoomi.net/content/m-555[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=తదేకగీతం&oldid=2982364" నుండి వెలికితీశారు