సోమేపల్లి వెంకట సుబ్బయ్య
సోమేపల్లి వెంకట సుబ్బయ్య ఆంధ్రప్రదేశ్ కి చెందిన కవి, రచయిత, రిటైర్డ్ ప్రభుత్వ అధికారి[1]. గుంటూరు జిల్లా రచయితల సంఘానికి, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘానికి అధ్యక్ష్యుడు. తొలినాట నానీల కవిత్వానికి స్ఫూర్తిని కల్గించిన వారిలో సోమేపల్లి వెంకట సుబ్బయ్య ఒకరు. నానీల సృష్టికర్త ఆచార్య ఎన్.గోపి నానీల నాన్న ఐతే, వెంకట సుబ్బయ్య నానీల చిన్నాన్నగా సాహితీ లోకంలో స్థానం పొందాడు. మండల రెవిన్యూ అధికారిగా పశ్చిమ గోదావరి జిల్లాలో విధులను నిర్వర్తించాడు. తదనంతరం డిప్యూటీ కలెక్టరుగా కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలలో పనిచేశాడు. లోయలో మనిషి, చల్లకవ్వం, తదేకగీతం, తొలకరి చినుకులు, రెప్పల చప్పుడు, పచ్చని వెన్నెల, మట్టి పొరల్లోంచి... అతని రచనలు[2]
సోమేపల్లి వెంకట సుబ్బయ్య | |
---|---|
![]() సోమేపల్లి వెంకట సుబ్బయ్య | |
జననం | సోమేపల్లి వెంకట సుబ్బయ్య 1958 మే 1 |
ఇతర పేర్లు | సోమేపల్లి |
వృత్తి | ప్రభుత్వోద్యోగం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రచయిత, కవిగా |
జీవిత భాగస్వామి | విజయలక్ష్మి |
పిల్లలు | 2 కుమారులు |
తల్లిదండ్రులు |
|
వెబ్‌సైటు | somepallivs |
బాల్యము, విద్యసవరించు
వెంకట సుబ్బయ్య 1958వ సంవత్సరం మే 1వ తేదిన హనుమంతరావు, నాగరత్నం దంపతులకు జన్మించాడు. ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలంలోని గన్నవరం గ్రామం ఆయన జన్మస్తలం. యద్దనపూడి మండలం పూనూరులో పాఠశాల, చిలకలూరిపేటలోని చుండి రంగనాయకులు కళాశాలలో ఉన్నత విద్యనూ అభ్యసించాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ప్రైవేటుగా ఎం.కాం డిగ్రీ పొందాడు.
కుటుంబంసవరించు
తల్లిదండ్రులు: హనుమంతరావు, నాగరత్నం.సతీమణి: విజయలక్ష్మి, కుమారులు: శ్రీ వశిష్ఠ, శ్రీ విశ్వనాథ విరించి
వృత్తి, కవిత్వంసవరించు
ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉపసంపాదకులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. పిమ్మట 1989 గ్రూప్ 2 పరీక్షలో ఉత్తీర్ణులై ఎం.ఆర్.ఓగా నియమితులు అయ్యాడు. పశ్చిమ గోదావరిజిల్లాలోని పెంటపాడు, తాడేపల్లిగూడెం, గణపవరం, తణుకులలో విధులను నిర్వర్తించాడు. తదనంతరం 2003లో పులిచింతల పధకానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేశాడు. 2006 గుంటూరు, నర్సాపురం ఆర్.డీ.ఒగా తర్వాత గుడివాడ ఆర్.డీ.ఓ గా[3], గుంటూరు జిల్లాకు జిల్లా పరిషత్ ముఖ్య పాలనాధికారి (సి.ఇ.ఓ)గా[4][5][6] పనిచేసి పదవీ విరమణ చేశాడు.
వీరి రచనలు:సవరించు
- లోయలోమనిషి (1997) - మినీ కవితా సంకలనం
- తొలకరి చినుకులు (2001) -నానీలు
- చల్లకవ్వం (2002) -వచన కవితా సంకలనం
- రెప్పల చప్పుడు (2004) -నానీలు
- తదేకగీతం (2006) -వచన కవితా సంకలనం[7]
- పచ్చని వెన్నెల (2007) -నానీలు[8]
- మట్టి పొరల్లోంచి.. (2018) - వచన కవితా సంపుటి[9]
- చేను చెక్కిన శిల్పాలు (2019) - నానీలు
సోమేపల్లి సాహితీ పురస్కారం పొందిన కథలతో తీసుకొచ్చిన కథా సంకలనాలు:
- సోమేపల్లి పురస్కార కథలు (2012)
- సోమేపల్లి పురస్కార కథలు -2 (2017)
వీరి మొట్టమొదటి కథానిక స్వీట్ చీట్, తర్వాత రంగుల ప్రపంచంలో అమ్మ,ఆశకు ఆవలివైపు, కథాకేళి, ఇంతే సంగతులు మొదలైన కథలు రాశాడు. సోమేపల్లి వెంకట సుబ్బయ్య రాసిన తొలకరి చినుకులు, రెప్పల చప్పుడు, పచ్చని వెన్నల నానీల సంపుటాలలోని కొన్ని నానీలను ఎంపికచేసి "శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య నానీలు" అని తలతోటి పృథ్విరాజ్ తను వ్యాఖ్యాతగా ఆడియో/వీడియో సీడీలుగా రూపొందించారు.[10]
గుంటూరు జిల్లా రచయితల సంఘంసవరించు
కవిత్వ రచనలో వినూత్న విధానాన్ని, యువరచయితలను ప్రోత్సహించటం కోసం 2007లో గుంటూరు జిల్లా రచయితల సంఘం నెలకొల్పి, దానికి అధ్యక్షులుగా[11] వ్యవహరిస్తూ అనేక సాహిత్య కార్యక్రమాలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాడు. రాష్ట్ర స్థాయిలో కవి సమ్మేళనాలను ఏర్పాటు చేయటం, కథా కవిత్వ పోటీలను నిర్వహిస్తూ ఉంటాడు. 2008వ సంవత్సరం వీరు రాష్ట్ర స్థాయి మహిళా కవి సమ్మేళనం నిర్వహించాడు.
ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘంసవరించు
నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తర్వాత రాష్ట్ర రచయితలను ఒకే వేదిక పైకి తీసుకువస్తూ ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ను 2015 సెప్టెంబరు 13న ఏర్పాటు చేసి, దానికి అధ్యక్షులుగా ఎన్నికయ్యాడు[12][13]
సోమేపల్లి సాహితీ పురస్కారంసవరించు
సోమేపల్లి వెంకట సుబ్బయ్య వారి తల్లిదండ్రుల స్మృత్యార్థం ఈ పురస్కారం అందచేస్తాడు. 2007 నుండి ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో చిన్న కథల పోటి నిర్వహించి విజేతలకు సోమేపల్లి సాహితీ పురస్కారం అందచేస్తాడు [14][15]
పురస్కారాలుసవరించు
వీరి అత్యుత్తమ ప్రజాసేవకు గుర్తింపు ఇచ్చింది రెడ్ క్రాస్ పురస్కారం, ఈ పురస్కారాన్ని నాలుగు సార్లు గవర్నర్ చేతులు మీదుగా అందుకున్నాడు. ఎంఆర్వో, ఆర్డీవోలుగా అనేక సార్లు ఉత్తమ అధికారిగా ఎన్నిక అయ్యాడు.
- సోమేపల్లి మాతృభాషాభిమాని. పరిపాలన భాషగా తెలుగును అమలు పరచటంలో వీరి విధానాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2008 సంవత్సరం నవంబరు 1న తెలుగు భాషా విశిష్ట పురస్కారం ప్రదానం చేసింది.
- సోమిరెడ్డి జమున స్మారక పురస్కారం-2008,నెల్లూరు.
- ఆంధ్ర సారస్వతి సమితి, మచిలీపట్టణం
- గిడుగు పురస్కారం- 2016 (తెలుగు భాషా వికాస),గుడివాడ
- సహజ సాహితి, చీరాల వారి సాహిత్య పురస్కారం -2017.
- గుఱ్ఱం జాషువా కళాపీఠం, దుగ్గిరాల వారి సాహిత్య పురస్కారం - 2018.
- “మట్టి పొరల్లోంచి...” పుస్తకానికి రావి రంగారావు కళాపీఠంచే జనరంజక కవి ప్రతిభా పురస్కారం- 2020
ఇవీ చూడండిసవరించు
బయటి లింకులుసవరించు
మూలాలుసవరించు
- ↑ http://www.prajasakti.com/Article/NetiPratyekam/2164949
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-02. Retrieved 2015-06-02.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-01-02. Retrieved 2016-08-30.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-06-22. Retrieved 2016-06-21.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-28. Retrieved 2016-08-30.
- ↑ http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2017-01-18/Swachhata-app-to--fix-garbage-woes/274101
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-08-21. Retrieved 2019-08-21.
- ↑ http://m.dailyhunt.in/news/india/telugu/eenadu-epaper-eena/saahiti+puraskaaraaniki+somepalli+empika-newsid-57123558
- ↑ http://www.prajasakti.com/Article/Sneha/2048399
- ↑ https://www.youtube.com/watch?v=LMUxKER8m7g
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-06-02.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-09-18.
- ↑ http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2016-04-04/Celebrate-Telugu-New-Year--as-per-culture-traditions/218695
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-09-24. Retrieved 2015-06-02.
- ↑ https://plus.google.com/+pullaraotamiri/posts/ZpNDGCbqUvQ