తన్లాట (తెలంగాణ కథ 2014)


తన్లాట (తెలంగాణ కథ 2014) అనేది సింగిడి (తెలంగాణ రచయితల సంఘం) ప్రచురించిన పుస్తకం. తెలంగాణ కథా సిరీస్ లో భాగంగా ప్రచురించబడిన రెండవ పుస్తకం ఇది. 2014లో వెలువడిన కథలలో నుంచి తెలంగాణ రచయితలు రాసిన 14 మంచి కథలతో ఈ సంకలనంగా వెలువడింది.[1]

తన్లాట (తెలంగాణ కథ 2014)
తన్లాట (తెలంగాణ కథ 2014) పుస్తక ముఖచిత్రం
కృతికర్త: కథా సంకలనం
సంపాదకులు: సంగిశెట్టి శ్రీనివాస్
డా. వెల్దండి శ్రీధర్
స్కైబాబ
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): కథలు
ప్రచురణ: సింగిడి (తెలంగాణ రచయితల సంఘం)
విడుదల: 2015, డిసెంబరు 25
పేజీలు: 160

సంపాదకులు మార్చు

పుస్తకం గురించి మార్చు

తెలంగాణ రాష్ట్రంలో బలవంతపు చావులకు స్వస్తి పలికి, బతుక్కు భరోసా కల్పించాలన్న విషయాన్ని ఈ సంకనంలోని కథలు తెలియజేస్తున్నాయి. ఛిద్రమవుతున్న గ్రామీణ జీవితాను, పెట్టుబడిదారీ సమాజం అభివృద్ధి పేరిట చేస్తున్న కంటికి కనబడని కుట్రల్ని ఆవిష్కరించాయి. ఇందులోని సగానికి పైగా కథల ఇతివృత్తం ‘సావు'కి సంబంధించినవే ఉన్నాయి. సమాజంలోని ఘర్షణ, వేదన, హింస, దౌర్జన్యం, నిష్పూచితనం ఎంతటి అమానవీయతకు దారి తీస్తాయో ఈ కథలు చెబుతాయి.

తాగుడుకు అడిక్ట్‌ అయిన విషయాల నేపథ్యంలో ‘సంపుడు పంజెం' (పసునూరి రవీందర్‌) కథ, హైవేపై వెళ్లాల్సిన వెహికిల్స్‌ గ్రామాల మీదుగా పోవడం నేపథ్యంలో ‘టోల్‌గేట్‌' (గాదె వెంకటేశ్‌) కథ, పెద్ద పెద్ద హాస్పిటళ్ళు - పేరు మోషిన డాక్టర్లు డబ్బుకోసం పేద మహిళల జీవితాలతో ఆడుకునే నేపథ్యంలో ‘డబ్బుసంచి' (కె.వి.నరేందర్‌) కథ, జీవం పోయాల్సిన డాక్టర్లే మాయిముంతను మాయం జేస్తున్న నేపథ్యంలో ‘తమ్ముని మరణం' (పూడూరి రాజిరెడ్డి), ‘థర్డ్ డిగ్రీ' (మోహన్‌ రుషి) కథలు. తెలంగాణ ఉద్యమంలో జరిగిన ఆత్మహత్య గురించి నేపథ్యంలో దు:ఖాగ్ని (రామా చంద్రమౌళి) కథ, మావోయిస్టు ఉద్యమంలో బిడ్డను కోల్పోయిన తల్లి వేదన నేపథ్యంలో ‘అమ్మ' (తాయమ్మ కరుణ) కథ, మాయమైన తల్లి గురించి తల్లడిల్లుకుంటున్న నేపథ్యంలో ‘అలికిన చేతులు' (పర్కపెల్లి యాదగిరి) కథ, ప్రకృతి మీద ప్రేమ తెలంగాణ మట్టిమనిషికి తప్ప మరెవ్వరికీ ఉండదనే నేపథ్యంలో ‘చుక్కలు రాని ఆకాశం' (పెద్దింటి అశోక్‌కుమార్‌) కథ, స్ప్లిట్‌ పర్సనాలిటీ-సంఘర్షణ నేపథ్యంలో ‘పూర్తికాని కథ' (కాసుల ప్రతాపరెడ్డి) కథ, స్త్రీని ఆస్తిగా చూసే ‘రేపిస్టు మగ యిగో స్వగత దుఃఖాల నేపథ్యంలో ‘ఇండియస్ సన్’ కథ, ఆత్మలు చెప్పే అసమ అభివృద్ధి ఆత్మకథల నేపథ్యంలో ‘2047’ కథ రాయబడ్డాయి.[2]

ఆవిష్కరణ మార్చు

2015, డిసెంబరు 25న హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో ఈ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. సంగిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో కె.రామచంద్రమూర్తి పుస్తకాన్ని ఆవిష్కరించాడు. జూపాక సుభద్ర, అనిశెట్టి రజిత, కథకులు రచయితలు పాల్గొన్నారు.[3]

విషయసూచిక మార్చు

క్రమసంఖ్య కథ పేరు రచయిత పేరు
1 చౌరస్తా డా. వంశీధర్ రెడ్డి
2 టోల్ గేట్ గాదె వెంకటేష్
3 దుఃఖాగ్ని రామా చంద్రమౌళి
4 డబ్బు సంచి కె.వి. నరేందర్
5 ఇండియన్ సన్ సరస్వతి రమ్య
6 ఇల్లు భండారు అంకయ్య
7 సంపుడు పంజెం డాక్టర్ పసునూరి రవీందర్
8 చుక్కలు రాని ఆకాశం పెద్దింటి అశోక్ కుమార్
9 అలికిన చేతులు పర్కపెల్లి యాదగిరి
10 2047 వి. శ్రీనివాస్
11 పూర్తికాని కథ కాసుల ప్రతాపరెడ్డి
12 అమ్మ తాతమ్మ కరుణ
13 థర్డ్ డిగ్రీ మోహన్ రుషి
14 తమ్ముని మరణం పూడూరి రాజిరెడ్డి

అంకితం మార్చు

తెలంగాణ జీవితాన్ని కథా ప్రపంచంలో పరిపుష్టం జేసిన మహనీయులైన భండారు అచ్చమాంబ, కాళోజి నారాయణరావు, జి. రాములు, ఆవుల పిచ్చయ్య, నందగిరి ఇందిరాదేవి, మాదిరెడ్డి సులోచనాదేవి, బొమ్మ హేమాదేవి, సాహు, వారితోపాటు ఈ కథల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు తదితరులకు ఈ పుస్తకం అంకితం చేయబడింది.

మూలాలు మార్చు

  1. Pratap (2015-12-23). "2014 తెలంగాణ కథ తన్లాట: బతికుండి కొట్లాడుదాం". www.telugu.oneindia.com. Archived from the original on 2021-12-12. Retrieved 2021-12-12.
  2. "పడావు పడిన నేల పడే తన్లాట". Sakshi. 2016-02-22. Archived from the original on 2021-12-12. Retrieved 2021-12-12.
  3. "తెలంగాణ కథ-2014 ఆవిష్కరణ (ఈవెంట్)". Sakshi. 2015-12-21. Archived from the original on 2021-12-12. Retrieved 2021-12-12.