తమాల వృక్షం
సిన్నమొముం తమాల, అనేది ఒక చెట్టు.ఇది ఎక్కువుగా హిమాలయాల్లో, ఉత్తర భారతదేశంలోని ప్రాంతాలలో పెరుగుతుంది.ఇది ఇంకా బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, చైనా దేశాలలో కూడా అభివృద్ధి చెందింది. దీనిని భారత బే ఆకు, లేదా తేజ్ పట్, మలబార్ ఆకు, భారత బెరడు, భారతీయ కాసియా అని కూడా అంటారు. ఇవి 20 మీ (66 అడుగుల) ఎత్తు వరకు పెరుగుతాయి. దీని ఆకులు, బెరడు వంటలలో సుగంధం కోసం, ఔషధ ప్రయోజనాల కొరకు ఉపయోగిస్తారు.వీటి ఆకులను ఆకు పత్రి అని కూడా అంటారు. వాటిలో కొన్ని రకాల జాతికి చెందిన ఆకులు నత్తి ఉన్నవారికి, నోటిలో ఉంచుకొని రసం మింగుచూ ఉంటే నత్తి తగ్గిపోతుందనే నమ్మకం ఉంది.ఇంకా డయాబెటిస్, దగ్గు, జలుబు, ఆర్థరైటిస్, గుండె, కాలేయ ఆరోగ్యం ఇతర పరిస్థితులకు సిన్నమొమం తమలా ఆకులు,బెరడు ఉపయోగించబడుతుంది. అయితే ఈ ఉపయోగాలకు మద్దతు ఇవ్వడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.ఆహారాలలో, సిన్నమొమం తమలాను మసాలా లేదా సువాసన కారకంగా ఉపయోగిస్తారు. సిన్నమొమం తమలా సంబంధిత కాసియా, దాల్చినచెక్క, సిలోన్ దాల్చినచెక్క, సిన్నమొమం బర్మాని ఇవి అన్నీ ఒకేలా ఉండవు. సిన్నమొమం తమలాను "ఇండియన్ బే లీఫ్" అని కూడా పిలుస్తారు.[1]
రుచి, వాసన, చరిత్ర
మార్చుదీని ఆకులు మిరియాలు రుచిని. లవంగం లాంటి వాసన కలిగి ఉంటాయి, అవి వంటలలో సుగంధం కోసం వాడతారు.కొన్ని రకాల ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ప్రామాణిక గ్రంథాల ప్రకారం మధ్యయుగ కాలంలో మాలాబాత్రమ్ (లేదా మలోబాత్రమ్) గా పిలువబడే ఔషధ మొక్కల ఆకుల ప్రధాన వనరులలో ఇది ఒకటిగా భావిస్తారు.[1]
వాడుక, ఇతర ఉపయోగాలు
మార్చుదీని బెరడు నిజమైన దాల్చినచెక్క (సిన్నమోముమ్ వెర్మ్) వంటి మసాలాగా ఉపయోగించబడుతుంది.సాధారణంగా ఈ జాతి బెరడు తరుచూ వాడే వ్యసనాన్ని పెంపొందించింది.దీని ఆకులను ఎండబెట్టి రుచికి, సవాసనకు ఉపయోగిస్తారు.వివిధ భారతీయ వంటలలో ఎండిన ఆకులను తరచుగా వేయించి బలమైన కలప రుచిని విడుదల చేస్తుంది.ఎండిన బెరడు కడుపు నొప్పికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.ఆకులు కోలిక్, డయేరియా చికిత్సలో ఉపయోగిస్తారు.ఆకులు 1.025 నిర్దిష్ట గురుత్వాకర్షణతో 2% నూనెను ఇస్తాయి.ఇది 70% ఆల్కహాల్, 1.2 వాల్యూమ్‌లో కరుగుతుంది. ఆకుల నుండి సేకరించేది వాణిజ్య సౌందర్య సన్నాహాలకు ఒక పదార్ధం.ఇక్కడ దీనిని చర్మ కండిషనర్‌గా ఉపయోగిస్తారు.ఆకుల నుండి పొందిన నూనె, మొక్కలపై జట్రోఫా కర్కాస్ అనే వ్యాధికారక శిలీంధ్రాలను నివారించటానికి శిలీంద్ర సంహారిణిగా వాడతారు.భూటాన్ లో టీలో కూడా ఈ ఆకులు వాడుతారు.[2]
దుష్ప్రభావాలు, భద్రత
మార్చుసిన్నమొమం తమలా సురక్షితంగా ఉందా లేదా దుష్ప్రభావాలు ఏమిటో తెలుసుకోవడానికి తగినంత నమ్మదగిన సమాచారం అందుబాటులో లేదు.
ప్రత్యేక జాగ్రత్తలు, హెచ్చరికలు
మార్చుగర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు సిన్నమొమం తమలా తీసుకోవడంపై, భద్రత గురించి తగినంత నమ్మదగిన సమాచారం లేదు.సురక్షితమైన వైపున ఉండండి.వాడకుండా ఉండండి.
డయాబెటిస్ ఉన్నవారు: వాడినందువలన సిన్నమొమం తమలా రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. రక్తంలో తక్కువ చక్కెర సంకేతాల కోసం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.
శస్త్రచికిత్స చేయించుకునేవారు: సిన్నమొమం తమలా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు. ఇది శస్త్రచికిత్స సమయంలో, తరువాత రక్తంలో చక్కెర నియంత్రణకు ఆటంకం కలిగిస్తుందనే ఆందోళన ఉంది. షెడ్యూల్ చేసిన శస్త్రచికిత్సకు కనీసం రెండు వారాల ముందు నుండి దీనిని వాడటం మానేయండి. పూర్తిగా ఇందులోని సమాచారంపై స్వంతంగా ఆధారపడటానికి ఎటువంటి శాస్రీయ ఆధారాలు లేవు.వాడే ముందు వైద్యుని సలహా తీసుకోవటం శ్రేయస్కరం.[3]
ప్రత్యేకం
మార్చుభాషలోవాడుకయొక్క ఒక అందమైన ఉదాహరణ: ఏకవీర చిత్రంలోని పాట (నీ పేరు తలచినా చాలు). నారాయణ రెడ్డి గారి కవిత్వం, శ్రీకృష్ణుడిని వర్ణించే సన్నివేశం - "మృదు సమీరకంపిత మనోజ్ఞ కుంతల తమాలపల్లవ జాలా..." అనే చరణం వినే ఉంటారు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Quattrocchi, Umberto (2020-08-01). CRC World Dictionary of Medicinal and Poisonous Plants: Common Names, Scientific Names, Eponyms, Synonyms, and Etymology (5 Volume Set) (in ఇంగ్లీష్). CRC Press. ISBN 978-1-4822-5064-0.
- ↑ "Cinnamomum tamala - Useful Tropical Plants". tropical.theferns.info. Archived from the original on 2020-08-13. Retrieved 2020-08-01.
- ↑ "Cinnamomum Tamala: Uses, Side Effects, Interactions, Dosage, and Warning". www.webmd.com. Retrieved 2020-08-01.