గర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు


తీసుకోవలసిన జాగ్రత్తలు : ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌస్టికాహారము అనగా ఎక్కువపాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పు, మాంసము, చేపలు వగైరా తీసుకోవాలి . మొదటి ఆరునెలలు .... నెలకొకసారి, ఏడు -ఎనిమిది నెలల్లో నెలకు రెండు సార్లు, తొమ్మిదోనెలలో వారానికొకసారి వైద్యపరీక్షలు అవసరము . సొంతముగా మందులు వాడడము, ఎక్సరేలు తీయించుకోవడము చేయకండి . ఎత్తు మడమల చెప్పులు వాడకండి, గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది. మొదటి మూడునెలలు, చివరి నెలలో దూరప్రయాణాలు, కారు స్కూటరు నడపడము, చేయరాదు . రాత్రులు 8-10 గంటలు, పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవాలి . నిద్రపోవునపుడు ఒక ప్రక్కకు (వీలైతే ఎడమ వైపు) తిరిగి పడుకోవాలి . స్త్రీలు గర్భము దాల్చిన మూడు మాసముల తరువాత, ప్రసవించిన మూడు మాసముల వరకు యోగ విద్యనభ్యసించ రాదు. ఉదయము నడక మాత్రము చేయవలయును. ధనుర్వాతం బారినుండి రక్షణ కోసము టెటనస్ టాక్షాయిడ్ ఇంజక్షన్‌లు తీసుకోవాలి . రక్తస్రావము, ఉమ్మనీరు పోవడము, శిశువు కదలిక తగ్గినట్లు అనిపించినప్పుడు, కడుపు నొప్పి వచ్చినా డాక్టర్ని సంప్రదించాలి .

గర్భిణీ స్త్రీ

గర్భవతులకు - పోషకాహారం-- గర్భస్త సమయంలో ఆహారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు -

భారతదేశంలో, ముఖ్యంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న జనాభాలో స్త్ర్రీ గర్భవతిగా లేని సమయంలోను, గర్భవతిగా ఉన్న సమయంలోను, ఒకే విధమైన ఆహారం తీసుకుంటున్నట్లు లెక్కల్లో తేలింది. బిడ్డకు, తల్లికి ఇద్దరికీ సరిపడా లేక ఎక్కువ ఆహారం తీసుకోవలసిన - అవసరం చాలా ఉంది.

నష్టాలు

మార్చు

1. గర్భవతి తీసుకోవలసిన దానికంటే తక్కువ ఆహారం తీసుకోవటంవలన, తక్కువ బరువుతో శిశువు జన్మించడం - ఇది - తల్లీ/బిడ్డల మరణాలకు దారితీయటం ఎక్కువగా కనిపిస్తుంది. 2. శిశువు బరువు వృధ్ది చెందడంలోను, తల్లికికూడా కొవ్వు శరీరంలో పెరిగేటందుకు అదనపు ఆహారం చాలా దోహద పడుతుంది. 3. పాలిచ్చే తల్లులు (బాలింతలు) సంపూర్ణ ఆహారం తీసుకుంటే, శిశువుకు కావలసినంతగా పాలు వచ్చే అవకాశం ఉంటుంది.

గర్భవతికి కావలసిన ఆహారం

మార్చు

గర్భవతి తీసుకొనే ఆహారం పుట్టబోయే బిడ్డ బరువు పై ప్రభావం చూపుతుంది. గర్భవతికి 300 cal (కాలరీల శక్తి ఎక్కువగా/అదనంగా 15గ్రా మాంసకృత్తులు/10గ్రా కొవ్వు పదార్ధాలు అయిదు/ఆరు నెలల గర్భధారణ నుండి తిసుకోవలసిన అవసరం చాలా ఉంటుంది. గర్భవతులు, బాలింతలు తీసుకొనే ఆహారంలో, అధనపు కాల్షియం ఉండాలి. శిశువు ఎముకలు దంతాలు రూపు దిద్దుకోవటానికి, రొమ్ము పాలు పెరగటానికి ఇది చాలా అవసరం. గర్భస్ధ దశలో ఇనుము లోపంతో వచ్చే రక్తహీనత, కాన్పు సమయంలో తల్లి మరణానికి దారి తీస్తుంది. శిశువు తక్కువ బరువుతో పుడతారు కనుక, ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవలసి ఉంటుంది.

గర్భవతులు ఆహారం విషయంలో పాటించవలసినవి

మార్చు

1. గర్భవతులు, బాలింతలు, అదనపు ఆహారం తప్పకుండా తీసుకోవాలి. 2. రోజుకు మూడు కన్నా ఎక్కువ పూటలు భోజనం చేస్తే మరీ మంచిది. . 3. ముడి ధాన్యాలు, మొలకెత్తిన ధాన్యాలు, పులిసిన ఆహారం (పెరుగు) అదనంగా తీసుకొవాలి. 4. పాలు/మాంసము/కోడిగుడ్లు తీసుకోవాలి. 5. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి . 6. మందులు వైద్యుని సలహా ప్రకారమే తీసుకోవాలి. 7. ఐరన్, ఫోలిక్ / కాల్షీయాన్ని (ఎక్కువ 14-16 వారాల గర్బం నుంచి ప్రారంభించాలి, తల్లి పాలు ఇచ్చేంతవరకు పోడిగించాలి. 8. గర్భవతి, రోజూవారీ చేసుకొనే పనులలో నడక ఉండాలి, కాని ఎక్కువ బరువు పనులు చెయ్యరాదు, అదీ నెలలు నిండిన సమయంలో ప్రత్యేకంగా. 9. పోగాకు లేదా మద్యపానం అనగా (సారా, విస్కీ) లాంటివి సేవించరాదు. 10. టీ, కాఫీ తాగడంవలన, శరీరానికి కావలసినంత ఐరన్ అందదు, అందువలన భోజనం తరువాత, టీ / కాఫీ తీసుకొనరాదు. 11.అనవసరమైన భయం ప్రసవ సమయాన్ని కష్టతరము చేస్తుంది, గర్భము, ప్రసవము సృష్టిలో సర్వసాధారణ విషయాలని గుర్తుంచుకోండి. 12. భార్యా భర్తలు నిత్యమూ సంభోగము చేయవచ్చును . అతిగా సంభోగము చేయరాదు . 8-9 వ నెలలో పొట్టపైన ఒత్తిడి పడకుండా రతిలో పాల్గొనాలి . 13. గర్భము ధరించిన నుండి, బిడ్డకు పాలు ఇవ్వడం ఆపేంత వరకూ రక్తదానం చేయరాదు .

గర్భము ధరించిన స్త్రీ ఏవిధముగా ఉండాలి?

మార్చు

గర్భము ధరించిన స్త్రీ ముఖ్యముగా ఎల్లవేళలూ ప్రశాంతముగా వుండాలి.

  1. మీ కుటుంబమందు ఆప్యాయత అనురాగము కలిగి వుండాలి .
  2. నీతి కథలను చదువుతూ వుండాలి.
  3. గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది.

గర్భిణులు నిద్రలో కొన్ని సమస్యలు-జాగ్రత్తలు : గర్భిణులు కంటినిండా నిద్రపోవటం ఎంతో అవసరం. అయితే గర్భం ధరించినపుడు శరీరంలో జరిగే మార్పులు నిద్రలో కొన్ని సమస్యలు సృష్టిస్తుంటాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రాత్రిపూట హాయిగా నిద్రపోవటానికి వీలుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

  • గర్భిణులు మూడోనెల నుంచి ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఎక్కువ సేపు వెల్లకిలా పడుకోకుండా చూసుకోవాలి.
  • పగలు సాధ్యమైనంత ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి. అయితే రాత్రిపూట వాటిని పరిమితం చేయాలి-లేకపోతే ఎక్కువసార్లు మూత్రవిసర్జన నిద్రలేమికి దారి తీయును. .
  • కారం తక్కువగా ఉండే పదార్థాలు తినాలి. ఛాతిలో మంట పుట్టించే మసాలా ఆహారాన్ని మానెయ్యటమే మంచిది--ఛాతిలో మంట నిద్రరానివ్వదు ..
  • పడుకునేటప్పుడు గర్భిణుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన దిండ్లు వాడుకోవాలి. అవి అందుబాటులో లేకపోతే మరో దిండును మోకాళ్ల మధ్య పెట్టుకొని పడుకోవచ్చు.
  • పగటిపూట వీలు చేసుకొని కాసేపు కునుకు తీయాలి. నిద్ర బాగా పట్టేందుకు మనసును ప్రశాంతంగా ఉంచే పద్ధతులు పాటించాలి.
  • నిద్రలేమితో బాధపడుతుంటే తప్పకుండా డాక్టరుకు చూపించుకోవటం మరవరాదు.

తల్లులకు పౌష్టికాహారం

మార్చు

తల్లులకు పౌష్టికాహారం అనుబంధ పోషకాహారం అంటే తల్లిపాలలో పాటుగా 6 నెలలు నిండినప్పటి నుండి పిల్లలకు ఇచ్చే అదనపుఆహారం. తల్లి పాలతో పాటు ఎదుగుతున్న పిల్లలకు అనుబంధ పోషకాహారం ఎంత అవసరమో, అలాగే తల్లలకూ పోష్టికాహారం అత్యంత ఆవశ్యకం.

పోషణ మానవుల మౌలిక అవసరాలలో ఒకటి. ఆరోగ్యకరమైన జీవితానికి తప్పనిసరి కూడా. పెరుగుదల, వికాసం, చురుకైన జీవితానికి సరైన ఆహారం జీవితం యొక్క తొలిదశ నుండే అవసరం.

స్త్రీ గర్భం ధరించిన నాటి నుండి తొలి దశగానే పరిగణించాలి. తల్లి తీసుకొనే జాగ్రత్తలు బిడ్డకి ఎంతగానో మేలు చేస్తాయి.

శరీర ధర్మపరంగా, పోషణపరంగా కూడా, గర్భంతో ఉన్న సమయం చాలా కీలకమైనది. గర్భంతో ఉన్నప్పుడు తన శరీరంలో క్రొవ్వు నిలువలను పెంచడం ద్వారా స్త్రీ పోషణ అవసరాలను తీర్చుకొనేందుకు తయారవుతుంది. తగినంత పాలను ఉత్పత్తి చేసేందుకు, తన ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు, పాలిచ్చే తల్లికి అదనపు ఆహారం అవసరమవుతుంది గర్భంతో ఉన్నప్పుడు, బిడ్డకు పాలిస్తున్నప్పుడు ఆహారం అదనంగా ఎందుకు కాలాలి ? శరీర ధార్మికపరంగా, గర్భంతో ఉన్న సమయం పలురకాల అవసరాలను ఎదుర్కొనవలసిన పరిస్థితిని కలిగిస్తుంది. భారతదేశంలోని పేదవర్గానికి చెందిన స్త్రీలు తీసుకొనే ఆహారాన్ని పరిశీలిస్తే గర్భానికి ముందుగానీ, గర్భంతో ఉన్నప్పుడుగానీ, ఆ తరువాత పాలిచ్చే సమయంలోగాని, వాళ్ళ ఆహారం దాదాపు ఒకే విధంగా ఉంటున్నట్లు గుర్తించారు. ఆ కారణంగా విస్తృతమైన లోప పోషణ ఏర్పడి, శిశువులు తక్కువ బరువుతో పుట్టడానికి, ఎక్కువ సంఖ్యలో మాతృ మరణాలు సంభవించడానికి దారితీస్తోంది. శిశువు తగిన బరువుతో పుట్టడావికి, తల్లి శరీరంలో తగిన క్రొవ్వు నిలువలు చేరడానికి, గర్భిణీ స్త్రీకి అదనపు ఆహారం అవసరమవుతుంది అలాగే, పాలిచ్చే తల్లులకు కూడా తాము మంచి పోషక విలువలుండే పాలను తగినంత తయారు చేయడానికి తమ ఆరోగ్యం కాపాడుకొనేందుకు అదనంగా పోషకాలు కావాలి.

ఏ పోషకాలను ఎక్కువగా ఆహారంలో తీసుకోవాలి ?

మార్చు

గర్భిణీగా ఉన్న సమయం సగం గడిచేసరికి, స్త్రీ యొక్క ఆహారంలో అదనంగా 300 కేలరీలు, 15 గ్రా!!ల మాంసకృత్తులు, 10గ్రా. క్రొవ్వు రోజూ చేర్చాలి. పాలిచ్చే సమయంలో రోజుకు 500 కేలరీలు, 25గ్రా. మాంసకృత్తులు, 25గ్రా. క్రొవ్వు ఎక్కువగా కావాలి. ఈ ప్రత్యేక పరిస్థితులలో, కొన్ని సూక్ష్మపోషక పదార్థాలు కూడా ఎక్కువగా అవసరమవుతాయి. గర్భస్థ సమయమంతట, ఫోలిక్ యాసిడ్ తీసుకొనడం ద్వారా శిశువు అవలక్షణాలతో పుట్టే ప్రమాదం తగ్గడం, ఎక్కువ బరువుతో పుట్టడం లాంటి లాభాలుంటాయి. ఎర్ర రక్తకణాల తయారీకి కావలసిన అవసరాలను తీర్చేందుకు తల్లికి, ఆమెలో పెరుగుతున్న బిడ్డకు కూడా ఇనుము ధాతువు అవసరముంటుంది. బిడ్డ పళ్ళు, ఎముకలు బాగా తయారుకావడానికి, తల్లిపాలలో కాల్షియం స్థాయి పెరిగి తద్వారా ఆమెకు ఆస్టియోపొరొసిస్ రాకుండా ఉండడానికి కాల్షియం స్థాయి అవసరం. అలాగే తగినంత అయొడిన్ తీసుకోవడం వల్ల పెరుగుతున్న పిండానికి తరువాత బిడ్డకు సరియైన మానసిక ఆరోగ్యం ఏర్పడుతుంది. బిడ్డ సవ్యంగా పెరిగి ఆరోగ్యంగా ఉండడానికి పాలిచ్చే సమయంలో తల్లికి విటమిన్-ఎ కావాలి. ఇవే కాకుండా, విటమిన్ –బి, సి-విటమిన్లను పాలిచ్చే తల్లి తీసుకోవాలి.

అదనపు పోషక అవసరాలను గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు ఎలా తీర్చుకోవాలి ?

మార్చు

గర్భిణీ స్త్రీ తన, తనలో పెరుగుతున్న పిండానికి అవసరమైన పోషకాలు అందేలా పలు విధాలైన ఆహార పదార్థాలనుతినాలి. అలాగే పాలిచ్చే తల్లుల ఆహారం కూడా శిశువు పెరుగుదలకు, తమ ఆరోగ్యానికి కావసిన పోషక పదార్థాలను అన్నింటిని అందించేలా ఉండాలి. వాళ్ళ ఆహార పద్ధతులు అన్నింటిని అందించేలా ఉండాలి. వాళ్ళ ఆహార పద్ధతులు ప్రత్యేకించి మార్చుకోవలసిన అవసరం లేదు. తీసుకొనే ఆహార పదార్థాల మోతాదును ఎక్కువ చేయడం, ఎక్కువసార్లు తినడం అవసరం. ఆమె చాలా ఎక్కువ శాతం శక్తిని (సుమారు 60%) బియ్యం, గోధుమలు, చిరుధాన్యాల నుండి సంపాదించుకోవచ్చు. వంటనూనెలు శక్తిని, పోలీ అన్ శాచ్యురేటేడ్ ఫ్యాటీ యాసిడ్లల చాలా ఎక్కువగా కలిగి ఉంటాయి. మంచి నాణ్యమైన మాంసకృత్తులు పాలు, చేపలు, మాంసం, కోడి మాంసం, గ్రుడ్ల నుండి లభిస్తాయి. కాని గింజధాన్యాలు, పప్పులు, కాయలను సరియైన నిష్పత్తులలో వాడినప్పుడు కూడా మంచి మాంస కృత్తులను పొందవచ్చు. ఆయా కాలాల్లో దొరికే కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలు, పాలు, తాజా పళ్ళ ద్వారా ఖనిజాలు, విటమిన్లు అవసరాలకు తగినంత పొందవచ్చు. శరీరానికి ఇనుము యొక్క అందుబాటు పులియబెట్టిన పదార్థాలు, మొలకెత్తిన పప్పులు, విటమిన్-సి అధికంగా ఉండే ఆహారపదార్థాలు, పుల్లటి పళ్ళ ద్వారా ఎక్కువచేసుకోవచ్చు. శరీరానికి కాల్షియం బాగా అందటానికి పాలు మంచి ఆహారంగా పనిచేస్తాయి సమతుల ఆహారం ద్వారా పోషకాలలో చాలావాటిని సంపాదించుకోగలినప్పటీకీ, గర్భిణీ, స్త్రీలు, పాలిచ్చేతల్లులు అదనపు పోషకాలను-ఇనుము, పోలిక్ యాసిడ్, విటమిన్-బి12, కాల్షియం విడిగా తీసుకోవలసిన అవసరం ఉంటుంది.

అదనంగా మరే జాగ్రత్తలు తీసుకోవాలి

మార్చు

స్త్రీ గర్భిణీగా ఉన్నప్పుడు పోషకాహారాన్ని అదనంగా తీసుకొంటూ ఉంటే ఆమె 10-12 కిలోల మేరకు బరువు పెంచుకోగలుగుతుంది. దస్త్రం:పీచుపదార్థంఎక్కువగా ఉండే నిండు గింజ ధ్యాన్యాలు, పప్పులు, కూరగాయలను తీసుకొంటూ మలబద్ధకం రాకుండా చూసుకోవాలి. రోజుకు 8-12 గ్లాసుల నీటితో సహా ఎక్కువగా ద్రవాలను త్రాగాలి. గర్భకాలంలో అధిక రక్తపుపోటు, ప్రీ ఎక్లాంప్సియా వంటి రుగ్మతలను రాకుండా చూసుకోవలసి వచ్చినప్పటికి, ఉప్పును మాత్రం తగ్గించరాదు. కాఫీ టీ లాంటి కెఫిన్ కలిగిన పానీయాలను ఎక్కువగా తీసుకొంటే పిండం పెరుగుదల దెబ్బ తింటుంది. అందుకే వాటిని ఎక్కువగా తీసుకోరాదు.

ఆ విధంగా ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవడానికి తోడు శరీర బరువు పెరుగుదల, రక్తపుపోటు, రక్తహీనత పరిస్థితి మొదలైనవి పరిశీలనలో ఉంచుకోవడానికి గర్భిణీ స్త్రీ తరచు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఆ పైన టెటనెస్ టాక్సాయిడ్ ఇంజక్షను తీసుకోవాలి. తగిన శరీర వ్యాయామం, రోజులో 2-3 గంటల విశ్రాంతి ఆమెకు అవసరం. వైద్యుని సలహా లేకుండా గర్భిణీ స్త్రీ ఎలాంటి మందులు తీసుకోరాదు. ఎందుకంటే కొన్ని గర్భస్థ పిండానికి, శిశువుకు హాని కలిగిస్తాయి. పొగ త్రాగడం, పొగాకు నమలడం, మద్యం సేవించడం పనికిరాదు. ఆహారాన్ని గురించిన నిషిద్ధాలు పాటించకుండా చేయాలి.

గర్భవతిగా ఉన్నప్పుడు, పాలిచ్చే కాలంలో ఆహారాన్ని ఎక్కువగా తినాలి. గింజధాన్యాలు (నిండువి), మొలకెత్తిన పప్పులు, పులియబెట్టిన ఆహారపదార్థాలను ఎక్కువగా తినాలి. పాలు, మాంసం, గ్రుడ్లను తినాలి. పాలి, మాసం, గ్రుడ్లను తీసుకోవాలి. కూరగాయలు, పళ్ళను ఎక్కువగా తినాలి. అపనమ్మకాలను, ఆహారం విషయంలో నిషిద్ధాలను మానాలి. మధ్యం, పొగాకును వాడవద్దు. డాక్టరు వాడమని సిఫార్సు చేసినప్పుడే మందులను వాడాలి. గర్భిణీగా ఉన్నప్పుడు 14-16 వారాల నుండి క్రమం తప్పకుండా ఇనుము, ఫోలేట్, కాల్షియం తీసుకొంటూ బిడ్డకు పాలిచ్చే సమయంలో కూడా వాటిని అలాగే తీసుకోండి. ఫోలేట్ పుష్కలంగా ఉన్న ఆహారపదార్థాలను తినండి హిమోగ్లోబిన్ తయారయ్యేందుకు ఫోలిక్ యాసిడ్ తప్పకుండా కావాలి. ఫోలిక్ యాసిడ్ లోపం మాక్రోసైటిక్ రకం అనీమియా (రక్తహీనత) కు దారి తీస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా కావాలి. గర్భిణీ సమయంలో 100 ఐరన్ ఫోలిక్ మాత్రలు తప్పకుండా తీసుకోవాలి. అదనంగా ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల బిడ్డ ఎక్కువ బరువుతో పుట్టి, పుట్టుకతో వచ్చే అవలక్షణాలు తగ్గుతాయి. ఆకుకూరలు, పప్పులు, పప్పుదినుసులు, కాయలు, కాలేయం, ఫోలిక్ యాసిడ్ ను ఎక్కువగా అందిస్తాయి

ఇనుము ధాతువు సమృద్ధిగా ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోవాలి హిమోగ్లోబిన్ ఏర్పడడానికి, మానసిక క్రియలకు, శారీరక రక్షణ వ్యవస్థకు, ఇనుము ధాతుకు అవసరమవుతుంది. ఇనుము లోపం అనీమియా (రక్తహీనత) కు దారి తీస్తుంది. ఇనుము లోపం ప్రత్యేకించి పునరుత్పత్తి దశలో ఉన్న స్త్రీల లోను, పిల్లల్లోనూ సాధారణంగా కనిపిస్తుంది. గర్భస్థ దశలో ఇనుములోపం ఉంటే, అది తల్లుల మరణాలను శిశువులు తక్కువ బరువుతో పుట్టే సంఘటనలను ఎక్కువ చేస్తుంది. ఆ లోపం వల్ల పిల్లలు ఇన్ పెక్షన్ లకు (సంక్రమణ వ్యాధులకు) గురికావడం, మానసిక గ్రాహకశక్తి మందగించడం ఎక్కువవుతుంది. పప్పులు, లెగ్యుమ్ జాతికి చెందిన పదార్థాలు, ఎండబెట్టిన పళ్ళు, పచ్చని ఆకుకూరల్లో ఇనుము ఉంటుంది. మాంసం, చేపలు, కోళ్ళ ఉత్పత్తుల నుండి కూడా ఇనుమును పొందవచ్చు. విటమిన్ – సి బాగా కలిగి ఉన్న ఉసిరిక, జామ, నారింజ, ఇతర పుల్లరకం పళ్ళు శరీరం ఇనమును గ్రహించడాన్ని మెరుగు పరుస్తాయి. శాకాహార పదార్థాల నుండి ఇనుమును శరీరానికి తక్కువగా అందుతుంది. అదే జంతు సంబంధ ఆహార పదార్థాల నుండి ఎక్కువగా అందుతుంది. టీ లాంటి పానీయాలు ఆహారంలోని ఇనముతో కనిసిపోయి, శరీరానికి ఇనుము అందకుండా చేస్తాయి. అందుకే అలాంటి పానీయాలను భోజనానికి ముందు, భోజనం చేస్తున్నప్పుడు లేదా భోజనమైన వెంటనేగాని పుచ్చుకోరాదు.

శిశువులకు 6 నెలలు వయస్సు నిండగానే అదనపు ఆహార పదార్థాలను ఇవ్వాలి శిశువులకు 6 నెలలు వయస్సు దాటిన తరువాత తల్లి పాలొక్కటే చాలవు. 6 నెలలు నిండగానే తల్లిపాలతో పాటు ఇతర ఆహార పదార్థాలను ఇవ్వడం మొదలుపెట్టాలి. అదనపు ఆహారం తగినంతగా ఇవ్వడంవల్ల చిన్నపిల్లల్లో లోప పోషణను నిరోధించవచ్చు. బిడ్డకు పై ఆహారాన్ని తయారుచేయడంలోనూ, తినిపించడంలోనూ, పరిశుభ్రతను పాటించాలి. లేకుంటే అది విరోచనాలకు దారి తీస్తుంది. శిశువుకు తల్లిపాలు ఉత్తమమైన ఆహారం అని అందరూ ఒప్పు కొంటారు. అదృష్టవశాత్తు మనదేశంలో గ్రామాల్లో చాలామంది తల్లులు ఎక్కువకాలం పాటు తమ పాలను పిల్లలకు త్రాగిస్తారు. నిజానికి ఇది మనదేశపు పిల్లలకి ఒక వరమనే చెప్పాలి. ఎందుకంటే అలాకాని పక్షంలో వారిలో లోపపోషణ ఎంతో ఎక్కువగా ఉండి ఉండేది. కాని బిడ్డలు తమంతట తాముగా ఆహారాన్ని తీసుకొని తినే వయస్సు వచ్చేదాకా వాళ్ళకు తల్లిపాలొక్కటే చాలునన్న ఉద్దేశంతో పిల్లలకు ఒక ఏడాది వయస్సు వచ్చినా వాళ్ళకు తల్లిపాలు మాత్రమే కొందరు తల్లులు ఇస్తుంటారు. దానివల్ల చిన్నపిల్లల్లో లోపపోషణ ఏర్పడుతుంది. ఇక పనికి వెళ్ళే తల్లులు బయట పనికి వెళ్ళాలి గనుక వాళ్ళ పిల్లలకు ఎక్కువకాలం పాలు ఇవ్వలేకపోతున్నారు.

అదనపు ఆహారమంటే ఏమిటి ?

పాలవంటి ద్రవ ఆహారపదార్థాలు కావచ్చు లేదా జారుడు ద్రవంగా వుండే పాయసం కావచ్చు, లేదా ఒక ఏడాది బిడ్డల విషయంలోనైతే, అన్నంలాంటి ఇతర ఘనాహారాలు కావచ్చు.

అదనపు ఆహారాన్ని ఎందుకు వాడాలి ?

పుట్టిననప్పుడు శిశువుకు తల్లిపాలు ఒక్కటే చాలు. శిశువు పెరిగే కొద్దీ, క్రమంగా అన్ని పోషకపదార్థాల అవసరాలు ఎక్కువవుతాయి. అదే సమయంలో క్రమేపి, తల్లిపాల పరిమాణం తగ్గుతూ ఉంటుంది. పెరుగుతున్న పోషక అవసరాలు, తగ్గుతున్న తల్లిపాలు ఈ రెండు కారణాల వల్ల బిడ్డకు లభించే పోషక పదార్థాలు తగ్గుతాయి. మామూలుగా ఈ పరిస్థితి బిడ్డకు 6 నెలలు వయస్సు వున్నప్పుడు ఏర్పడుతుంది. అందుకే అలాంటప్పుడు శిశువుల పెరుగుదల తగిన విధంగా ఉండాలంటే 6 నెలలు వయసు నిండినప్పటి నుండి తల్లిపాలతో పాటు అదనంగా ఇతర ఆహార పదార్థాలు ఇవ్వాలి.

ఇంట్లో తయారైన వంటకాలు అదనపు పోషకాహారంగా పనికివస్తాయా ?

మామూలుగా వాడే ఆహారపదార్థాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో అదనపు ఆహారాన్ని తయారు చేసుపోవచ్చు. వాటి తయారీలో బియ్యం, గోధుమ, రాగులు, జొన్న, సజ్జల వంటి తృణధాన్యాలు, పప్పు దినుసులు, వేరుసెనగ (పల్లీ) కాయలు, నువ్వులు వంటి నూనె గింజలు, వేరుసెనగ నూనె, నువ్వులనూనె వంటి వంటనూనెలు, చక్కెర బెల్లం లాంటివాటిని ఉపయోగించవచ్చు. అలాంటి ఆహారపదార్థాలు లోపపోషణతో బాధపడే పిల్లలతో సహా అందరు శిశువులు సులభంగా జీర్ణించుకొంటారు. మార్కెట్లో వాణిజ్యపరంగా దొరికే ఆహార పదార్థాలు మాత్రమే పుష్టినిస్తాయన్న అభిప్రాయం సరియైనది కాదు.

శిశువులకు అదనపు ఆహారాన్ని తయారుచేయడంలో ముఖ్యసూత్రాలు ఏవి ?

గింజధాన్యాలు, పప్పు-నూనె గింజలతోపాటు చక్కెర, బెల్లం చేర్చిన మిశ్రమాలు శిశువులకు చక్కని అదనపు ఆహారంగా ఉపయోగపడి, మంచి నాణ్యమైన మాంసకృత్తులను, తగినంత కేలరీలను ఇతర రక్షక పోషకాలను అందిస్తాయి. శిశువులు ఎక్కువ పరిమాణంలో ఆహారాన్ని తీసుకొనలేరు కనుక తక్కువ బరువుతో శక్తిసాంద్రత అధికంగా ఉండే క్రొవ్వు, చక్కెరను వారి ఆహారంలో వాడాలి. తక్కువ ఖర్చుతో విటమిన్లు, ఖనిజాలను అందించే ఆకుకూరలను కూడా అదనపు ఆహారం తయారీలో వాడవచ్చు. కాని ఈ విషయంలో ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఆకుకూరలను వండే ముందు శుభ్రంగా కడగాలి. లేకుంటే శిశువులకు విరేచనాలు రాగలవు. అసలు ఆకుకూరలలోని ఫైబర్ (పీచు పదార్థం) కారణంగానే పిల్లల్లో నీళ్ళ విరేచనాలు రావచ్చు. ఆకుకూరల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కనుక, మొదటి నెలల్లో ఉడికించిన ఆకుకూరల రసం మాత్రమే ఆహారంలో వాడడం మంచిది. క్రమంగా శిశువుల ఆహారంలో వేరువేరు కూరలు, పళ్ళను ప్రవేశపట్టాలి. వాడే పదార్థాలను బాగా ఉడికించి, గుజ్జుగా చేసి తినిపించాలన్న విషయం మరచిపోకూడదు. కుటుంబం ఇవ్వగలిగితే మాంసం సూప్ ఇవ్వవచ్చు. దాదాపు ఒక సంవత్సరం వచ్చేసరికి బిడ్డకు కుటుంబ సభ్యులు తినే భోజన పదార్థాలను ఇవ్వవచ్చు.

అమైలేజ్ ఎక్కువగా ఉండే ఆహారం అంటే ఏమిటి ?

మొలకెత్తిన గింజధాన్యాల పిండిలో ఆల్ఫా ఆమలైజ్ ఎంజైమ్ లు ఎక్కువగా ఉంటాయి. వాటిని అమలైజ్ రిచ్ పుడ్ (ఎ.ఆర్.ఎఫ్) అంటారు. ఈ రకమైన ఆహారపదార్థాలు, గింజ ధాన్యాలను ఆధారంగా చేసుకొని తయారుచేయబడ్డ ఆహారం, ఆహారం యొక్క బరువును తగ్గించి పల్చగా చేస్తాయి. అందుకే ఎ.ఆర్.ఎఫ్. పిల్లలకు మొదట వాడే గంజి పాయసం లాంటి పదార్థాల శక్తి సాంద్రతను ఎక్కువచేసి, వాటి బరువును తగ్గిస్తుంది. తక్కువ ఖర్చుతో తయారైన అదనపు ఆహారానికి తల్లులు ఎ.ఆర్.ఎఫ్.ను చేర్చి వాటిని శిశువులకు సులభంగా జీర్ణమయ్యేలాగా చేయవచ్చు. ఎ.ఆర్.ఎఫ్.ను తల్లులు ఇంట్లో సులభంగా తయారుచేసుకోవచ్చు.

అనుబంధ ఆహారపదార్థాలు సురక్షితంగా ఉండేలా చూడడం

అనుబంధ ఆహార కలుషితం కాకుండా ఉండడం కోసం వాటిని జాగ్రత్తగా తయారుచేసి నిల్వ చేయడం చాలా ముఖ్యం. చిన్నపిల్లలకు ఆహారం తినిపించడంలో వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్య పాత్ర పోషిస్తుంది. పరిశుభ్రతను పాటించనట్లయితే, పిల్లలకు, ఇన్ ఫెక్షన్లు సోకి అనుభంధ ఆహారం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతుంది. అందువలన శిశువులకు ఆహారం తయారుచేసే సమయంలో దానిలో ఎంటువంటి క్రిమి కీటకాలు లేకుండా చూసుకోవాలి. శిశువులకు ఆహారం తయారుచేసేటప్పుడు ఈ క్రింది విషయాలు గుర్తుంచుకోవాలి.

కంటికి కనిపించని క్రిములు, మురికి చేతుల నుంచి ఆహారంలోకి ప్రవేశిస్తాం. కనుక ఆహారం వండేటప్పుడు, తినిపించేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. గిన్నెలను బాగా రుద్ది తోమి కడగాలి. తడి లేకుండా తుడిచి మూతపెట్టి ఉంచాలి. వండడం వలన చాలా క్రిములు నశిస్తాయి. శిశువుల కోసం తయారుచేసే ఆహారపదార్థాలను బాగా ఉడికించడం వలన అందులో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉండే నశిస్తుంది. వండిన తరువాత దానిని వీలైనంత కొద్ది మొత్తంలో బయట ఉంచాలి. మిగిలిన ఆహారాన్ని మూతపెట్టిన పాత్రలో ఉంచి దుమ్ము, ఈగలు దరి చేరకుండా చూడాలి. వండిన ఆహారాన్ని ఉష్ణ వాతావరణంలో ఒకటి రెండు గంటల కన్నా ఎక్కువసేపు ఉంచకూడదు. వాటిని రిఫ్రిజిరేటర్లో పెట్టేయాలి. తల్లి తనను తాను సంరక్షించుకుంటూ, బిడ్డను సంరక్షించాలి. దానికి కుటుంబ వ్యక్తులు, సంబంధింత కార్యకర్తలు, అధికారులు, ప్రజాసంస్థల వారు తోడ్పడాలి. సరైన ఆహారం, బిడ్డలకు సకాల అనుబంధ పోషకాహారం జాతి ఆరోగ్యానికి, ప్రగతికి కీలకం అని అంగన్వాడి కార్యకర్తలు ప్రతి తల్లికి తెలియజెయాల్సిన బాధ్యతగా గుర్తించినప్పుడు పిల్లల్లో పోషకలోపాన్ని అరికట్టగలం.

గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వాడకూడని మందులు

మార్చు

ఈ ఆధునిక వైద్యయుగంలో మాత్రలు, సూదులు, టానిక్లు ఒక విధంగా చూస్తే వరం లాగా, మరోరకంగా చూస్తే శాపం లాగా కనిపిస్తుంటాయి. టైఫాయుండ్, మలేరియా, క్షయ, గుండెపోటు లాంటి విషమ వ్యాధుల నుంచి మనవి కాపాడగలిగేవి ఈ మందులే. అలాగే విచక్షణ లేకుండా ఇష్టమొచ్చినట్లు వాడినప్పుడు మనల్ని భయంకరమైన సమస్యలకు గురిచేసేవీ ఈ మందులే. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు. పాలిచ్చే తల్లులు మందులు వేసుకోవటం వలన జరగబోయే హాని గురించి తెలుసుకొందాం.

మందుల వల్ల వచ్చే దుష్ప్రభావాలు

మార్చు

అధిక మోతాదులో విటమిన్లు- విటమిన్ – ఎ, డిల వల్ల మూత్ర నాళ వ్యవస్థ, మెదడు సరిగా ఎదగకపోవటం ఉంటుంది. విటమిన్ డి వల్ల అప్పుడే పుట్టిన బిడ్డ రక్తంలో కాల్షియం ప్రమాణం మారుతంది. దీనికి క్రొవ్వులో కరిగే శక్తి ఉంటుంది. కానీ నీళ్ళతో ఉండదు. దానితో ఇది మూత్రం ద్వారా బయటికి విసర్జించబడదు.

యాంటిబయాటిక్స్

పెన్సిలిన్: పాలిచ్చే సమయంలో తీసుకోవడం వల్ల పెన్సిలిన్ పాలద్వారా పాపకి చేరి పడకపోయే అవకాశం ఉంది. తల్లికి దీనివల్ల ఏ ఇబ్బందీ లేకపోతే గర్భిణీ సమయంలోనే తీసుకోవచ్చు. టెట్రాసైక్లిన్: పుట్టబోయే బిడ్డ దంతాలకు హాని చేస్తుంది. గర్భిణీ సమయంలో గానీ పాలిచ్చేటప్పుడుగానీ అస్సలు తీసుకోకూడదు. క్లోరిమ్ ఫెనికాల్ : అస్సలు వాడకూడదు. కడుపులో బిడ్డకు చాలా ప్రమాదకరం. సల్ఫానమైడ్: అప్పుడే పుట్టిన బిడ్డకు కామెర్లు రావచ్చు. సెఫ్ట్రాన్ / బాక్ట్రిన్ కూడా ఈ కోవలోకే వస్తాయి. సెప్ట్రామైసిన్, కనామైసిన్ : కడుపులోని శిశువు వినికిడి శక్తిని దెబ్బతీస్తాయి. మెట్రోనిడజోల్: గర్బిణీ సమయంలో వాడకూడదు. మరీ ముఖ్యంగా మొదటి నాలుగు నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.

నొప్పి తగ్గించే మందులు

ఆస్ట్రిన్ (పాలిసైలేట్స్) : చాలా ఎక్కువ సమస్యలొచ్చే అవకాశం ఉంది కాబట్టి వాడకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ఇబూప్రొఫెన్, ఆక్సిఫెన్ బుటాజోన్ (బ్రూఫిన్, కామ్ బి ఫ్లామ్) : గుండెకు సమస్యలొచ్చే అవకాశం ఉంది. పెథెడిన్, సుగాన్ రిల్: వీటికి తర్వాత అలవాటుపడే ప్రమాదం ఉంది. మార్ఫిన్: దీనిని ప్రసవ నొప్పులు మొదలైన తర్వాత ఇస్తారు. దానితో పుట్టబోయే బిడ్డ మగతగా ఉండొచ్చు. అలాగే తల్లికి కూడా మత్తుగా, వికారంగా ఉండి వాంతులవుతాయి. ఒక్కోసారి మార్ఫిన్ వల్ల నొప్పులు ఆగిపోయి గర్భాశయం కదలికలు, ప్రసవం ఆలస్యం అవుతుంది.

మత్తు కలిగించే మందులు

బార్ బిచ్యురేట్స్ (గారినాల్, లూమినాల్) : మూర్ఛవ్యాధి కోసం వాడతారు. దీనివలన కడుపులో బిడ్డకు తొర్రి (చీలిక పెదవులు) ఏర్పడవచ్చు. ప్రసవ నొప్పుల సమయంలో వాడితే గనుక బిడ్డ మీద ఆ ప్రభావం ఉంటుంది. డయాజెపామ్ (కాంపోజ్) : గర్భిణీ సమయంలో ప్రత్యేక పరిస్థితులోనే దీనిని ఇస్తారు. అయితే ఇది ఎంత మాత్రమూ సురక్షితం కాదు కనుక సాథ్యమైనంత వరకు వాడకుండా ఉండాలి. బిడ్డ శరీరంలో అవలక్షణం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే నొప్పుల సమయంలో ఇస్తే బిడ్డ మగతగా ఉండే అవకాశం ఉంటుంది. హార్మోన్లు (ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్) : గర్భంలో ఉన్న శిశువుకు జనాంగంలో మగ లక్షణాలు వస్తాయి. డైధిల్-సిల్ బెస్ట్రాల్ (ఈస్ట్రోజెన్ హార్మోన్లు) ఆడ శిశువులు పుట్టిన ఇరవైయేళ్ళ తర్వాత వారిలో యోని కాన్సర్ కు కారణమౌతుంది. కార్టికో స్టెరాయిడ్స్: దీర్ఘకాలం ఉండే ఇన్ ఫెక్షన్లకి, ఉబ్బసానికి వాడతారు. దీనివల్ల కూడా తొర్రి పెదవులు వస్తాయి. థైరాయిడ్, మధుమేహం, రక్తపోటు కాన్సర్ మందులు, పరీక్షా పద్ధతుల్లో రేడియేషన్ కారకాలను ఉపయోగించటం – ఇవన్నీ కూడా తీవ్రస్థాయిలో ప్రమాదాన్ని కొనితెచ్చేవే. అందుకే వీటిని నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి. లేదా పూర్తిగా వాడటాన్ని మానేయాలి.

బాలింత సంరక్షణ

మార్చు

ప్రసవానంతరం ఆరు వారాలను (42 రోజులు) “ బాలింత కాలం ‘’ అంటారు. ప్రతి స్త్రీ జీవితంలో బాలింతకాలం ఎంతో క్లిష్టమైనది. స్త్రీ బాలింత కాలంలో శారీరకంగా నీరసించి ఉంటుంది. ప్రసవపు పుండు ఆరని దశలో అంటు క్రిములు అవలీలగా ఆమె శరీరాన్ని ఆవరించే అవకాశం ఉంది. నీరసించిన శరీరం రక్తస్రావానికి, బాలింత అంటుకు తట్టుకోలేదు. ఈ సమయంలో ఆరోగ్య కార్యకర్త సహాయం, కుటుంబ సభ్యుల శ్రద్ధ, ఆప్యాయత స్త్రీ అవసరం

బాలింతకాలంలో తీవ్ర పరిస్ధితులు :

అధిక రక్తస్రావం, బాలింత జ్వరం, వాసనతో కూడిన యోని స్రావం వంటి తీవ్రపరిస్ధితులు చాలా మందిలో వస్తాయి. ఇవి బాలింత అంటు వలన వస్తాయి. దాదాపు 10 శాతం మాతృమరణాలు దీనివలనే జరుగుతున్నాయి. బాలింతకు జ్వరం సాధారణమని తీసి వేయకూడదు. వెంటనే చికిత్స చేయించాలి. జ్వరంతోపాటు యోని స్రావాలు వాసన వస్తుంటే మరీ ప్రమాదం. ఆలస్యం అసలు చేయకూడదు.

బాలింత పర్యవేక్షణ

మార్చు

బాలింతకు జ్వరం ఉందని గుర్తించిన వెంటనే ఆసుపత్రికి పంపించాలి. అధిక రక్తస్రావం అవుతున్న, రక్తస్రావం వాసన వస్తున్నా, గుర్తించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. బాలింత సమయంలో ఆహారం, త్రాగునీటి ప్రాముఖ్యత గురించి తల్లికి, కుటుంబ సభ్యులకు అవగాహన పెంచాలి. తల్లీ బిడ్డలకు అంటు సోకకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించమని చెప్పాలి.