తమిళనాడు క్రికెట్ అసోసియేషన్

 

తమిళనాడు క్రికెట్ అసోసియేషన్
దస్త్రం:Tamil Nadu Cricket Association.png
ఆటలుక్రికెట్
పరిధితమిళనాడు
పొట్టి పేరుటిఎన్‌సిఏ
స్థాపన1932 (1932)
అనుబంధంబిసిసిఐ
మైదానంఎం.ఎ. చిదంబరం స్టేడియం
స్థానంచెన్నై, తమిళనాడు
Official website
India

తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) తమిళనాడు రాష్ట్రంలో క్రికెట్ కార్యకలాపాలను నిర్వహించే పాలకమండలి. ఇది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాతో అనుబంధంగా ఉంటూ తమిళనాడు క్రికెట్ జట్టును నియంత్రిస్తుంది. BCCI శాశ్వత టెస్టు కేంద్రాలలో TNCA ఒకటి. [1]

చరిత్ర

మార్చు

1932లో మద్రాసులో రాష్ట్ర వ్యవస్థీకృత లీగ్ క్రికెట్ ప్రారంభమైనప్పుడు ఈ బోర్డు ఏర్పడింది. రెండు ప్రత్యర్థి సంస్థలైన ఇండియన్ క్రికెట్ ఫెడరేషన్, మద్రాస్ క్రికెట్ క్లబ్‌లు విలీనమై మద్రాస్ క్రికెట్ అసోసియేషన్ (MCA) గా ఏర్పడ్డాయి.[2]

MCA అధికారికంగా 1935 ఏప్రిల్ 30 న స్థాపించారు. కొంతకాలం తర్వాత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుతో అనుబంధం ఏర్పడింది. ఈ క్రికెట్ అసోసియేషన్ ఈ ప్రావిన్స్‌లో క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది.[2]

1933-34 నాటికి, అసోసియేషనులో మొదటి, రెండవ డివిజన్ లీగ్‌లు ఉన్నాయి. తరువాతి సీజనులో మూడవ డివిజన్ను జోడించారు. 1939-40 నాటికి, నాల్గవ విభాగం ఏర్పడింది. [2]

1967-68 సీజన్‌లో, MCA పేరును తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA)గా మార్చారు. 2008 నాటికి, ఇందులో మొత్తం 132 జట్లు, ఐదు విభాగాలూ ఉన్నాయి.[2]

డివిజన్ లీగ్‌లు

మార్చు

తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ జాతీయ టోర్నమెంట్‌లను నిర్వహించడంతో పాటు వివిధ లీగ్ టోర్నమెంట్‌లు, U19, U22, U25 విభాగాల్లోని వయోవర్గాల కోసం టోర్నమెంట్‌లను నిర్వహిస్తుంది. ఇది నగర అనుబంధ క్లబ్‌ల కోసం లీగ్ ఛాంపియన్‌షిప్‌ను కూడా నిర్వహిస్తుంది. [2]

మొదటి డివిజన్ నుండి ఐదవ డివిజన్ వరకు ప్రతి సంవత్సరం 726 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. మొదటి, రెండవ డివిజన్లున్న ఎ జోన్‌లో 12 జట్లు ఆడతాయి. మూడవ, నాల్గవ, ఐదవ డివిజన్‌లలో వరుసగా రెండు, మూడు, నాలుగు జోన్‌లు ఉంటాయి. మూడు రోజుల వ్యవధి లీగ్ మ్యాచ్‌లు జరిగే మొదటి డివిజన్‌లోని సిటీ లీగ్ ఫార్మాట్ రంజీ ట్రోఫీ మార్గదర్శకాలను అనుసరిస్తుంది. [2]

స్వంత మైదానం

మార్చు

చెన్నైలో ఉన్న MA చిదంబరం స్టేడియం లేదా చెపాక్ స్టేడియం టిఎన్‌సిఏకు హోమ్ గ్రౌండ్. ఈ స్టేడియంను 1916లో స్థాపించారు. ఇది దేశంలోనే అత్యంత పురాతనమైన క్రికెట్ స్టేడియం. దీనికి BCCI మాజీ అధ్యక్షుడు MA చిదంబరం పేరు పెట్టారు, ఈ స్టేడియంను గతంలో మద్రాస్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్ అని పిలిచేవారు. [3] [4]

ఇది తమిళనాడు క్రికెట్ జట్టు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ లకు కూడా హోమ్ గ్రౌండ్. బంగాళాఖాతం వెంబడి మెరీనా బీచ్ నుండి కొన్ని వందల మీటర్ల దూరంలో చెపాక్ వద్ద ఈ స్టేడియం ఉంది. [3]

TNCA నుండి వచ్చిన ఇటీవలి జాతీయ క్రీడాకారులు

మార్చు

ప్రీమియర్ లీగ్

మార్చు

TNCA తన ప్రాంతీయ ట్వంటీ20 లీగ్ తమిళనాడు ప్రీమియర్ లీగ్‌ని 2016 ఆగస్టులో ప్రారంభించింది.[5] తొలి ఏట ఎనిమిది జట్లు ఉన్నాయి. మొత్తం 31 మ్యాచ్‌లు (28 లీగ్ మ్యాచ్‌లు, రెండు సెమీ-ఫైనల్, ఫైనల్) ఆడాయి. చెన్నై, దిండిగల్ (నాథమ్), తిరునెల్వేలి వేదికలుగా ఉన్నాయి. 2020లో కోయంబత్తూర్, సేలంలలో రెండు కొత్త వేదికలను చేర్చారు.[6] తొలి ఏటి పోటీల్లో, ఆల్బర్ట్ టుటీ పేట్రియాట్స్ చెపాక్ సూపర్ గిల్లీస్‌పై 122 పరుగుల తేడాతో విజయం సాధించింది. [7]

ఇవి కూడా చూడండి

మార్చు
  • MA చిదంబరం స్టేడియం
  • తమిళనాడు క్రికెట్ జట్టు

మూలాలు

మార్చు
  1. "Srinivasan unanimously re-elected TNCA president". Rediff (in ఇంగ్లీష్). Retrieved 2020-03-10.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "TNCA - Tamil Nadu Cricket Association". www.tnca.cricket. Archived from the original on 2019-09-09. Retrieved 2020-03-10.
  3. 3.0 3.1 "MA Chidambaram Stadium | India | Cricket Grounds | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2020-02-23.
  4. "TNCA - Tamil Nadu Cricket Association". www.tnca.cricket. Archived from the original on 2020-02-21. Retrieved 2020-03-10.
  5. "TNPL - Tamil Nadu Premier League". www.tnca.cricket. Archived from the original on 2018-01-26. Retrieved 2020-03-10.
  6. "Coimbatore, Salem on TNPL map this season". The New Indian Express. Retrieved 2020-03-10.
  7. "Cricket scorecard - TUTI Patriots vs Chepauk Super Gillies, Final, Tamil Nadu Premier League, 2016". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2020-03-10.

వెలుపలి లంకెలు

మార్చు