తల్లాప్రగడ సుబ్బారావు

భారతీయ తత్త్వవేత్త

తల్లాప్రగడ సుబ్బారావు, (1856 -1890) B.A. B.L., F.T.St చదివాడు. ఇతను మేధాశాలి, మద్రాసు హైకోర్టులో న్యాయవాది గా పవిచేసాడు.[1] ఆధ్యాత్మిక, వేదాంతోపనిషత్తుల, తత్వజ్ఞాన సారాంశంలను చేతివ్రేళ్ళమీద ఉదహరించి బోధించగల బ్రహ్మజ్ఞాని అని దేశవిదేశ వేదాంతులు, తత్వవేత్తలు. సాహిత్యవేత్తలు అనేకులు వ్రాసిన వ్యాసాలతోకూడిన మూలాధారాలు ఉన్నాయి.[2] 1875 లో అమెరికాలో స్థాపింప బడ్డ దివ్యజ్ఞాన సమాజం (ధియోసాఫికల్ సొసైటీ) ముఖ్యకార్యాలయం, మద్రాసులోని అడయారుకు మార్చటానికి ముఖ్యకారకులు.[3] 1882 లో ఆసంస్థకు కార్యదర్శిగా ఎన్నికై 1886 వరకు పనిచేసాడు. 1886 లోనివారి ప్రసంగాలనాధారంగా చేసి ప్రచురించిన పుస్తకం “the Philosophy of Bhagavad Gita by T.Subba Row” (1912) అతని రచనలు “The Esoteric Writings of T. Subba Row” (1895) దైవజ్ఞాన సంస్ధవారిచే ప్రచురించ బడినవి.[4][5]

తల్లాప్రగడ సుబ్బారావు
తల్లాప్రగడ సుబ్బారావు
ఛాయాచిత్రపటం.
జననం
తల్లాప్రగడ సుబ్బారావు

కాకినాడ రాబర్టసన్ పేట లోని స్వగృహము
మరణం24/06/1890 34 ఏండ్లకి
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుఇతర పేర్లు
విద్యB.A. B.L., F.T.S.
వృత్తివృత్తి
పనిచేయు సంస్థ
తల్లిదండ్రులుశ్రీ వీరవెంకట నారాయణ
శ్రీమతి వెంకట మాణిక్యమ్మ
పురస్కారాలుసాధించిన పురస్కారాలు

సుబ్బారావుగారి బ్రహ్మజ్ఞానం గురించిన మూలాధారాలు

మార్చు

సుబ్బారావుగారి బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకోవాలంటే పాశ్చాత్య దేశ వేదాంత సాహీతీ వేత్తలు వ్రాసిన వ్యాసాలే మూలాధారాలు. వారి వ్యాసాలలో సుబ్బారావుగారి జీవిత చరిత్రని గూర్చి చాల తక్కువగా ఉంది. అలాగే మన దేశీయ వ్యాసాలలోసుబ్బారావు గారి బ్రహ్మజ్ఞానం గురించి తగినంత దీర్ఘముగా కనబడుదు. “The Philosophy of Bhagavad Gita by T. Subba Row” based on his lectures on December27,28, 29, 30 of 1886” అను పుస్తకములో సర్ యస్ సుబ్రమణ్యన్అయ్యర్ గారు వ్రాసి న ఉపోద్ఘాత వ్యాసము వారి బ్రహ్మజ్ఞానం గురించి ఎక్కువ దీర్ఘముగా లేదు.[6] ఇంకోవ్యాసము, సర్ సివస్వామి అయ్యర్ గారు వ్రాసినది సుబ్బారావుగారు న్యాయవాదిగా ప్రాముఖ్యత గురించిన వ్యాసం.[1], Madras Law Journal Volume 47</ref>దిగవల్లి వేంకట శివరావుగారు వివరంగా మూడు సార్లు 1941, 1959,1985 లో విశేషమైన వ్యాసములు వ్రాశి సుబ్బారావుగారి బ్రహ్మజ్ఞానానికి అనే క పాశ్చాత్య మూలాధారాలు ఉల్లేఖించారు. సుబ్బారావు గారి జీవిత చరిత్రలో అమూల్యఘట్టాల వల్లించారు. 1941 లోభారతిలో వ్రాసిన వ్యాసం శివరావుగారి అన్నగారు తిమ్మ రాజు గారు [1870-1936 ] జీవితకాలంలో సుబ్బారావుగారువద్దే వుండి మద్రాసులో బి.ఎ చదువుకుని సుబ్బారావుగారిని స్వయంగా ఎరిగినవారైనందున శివరావుగారు వారిని అడిగి తెలుసుకుని వ్రాసినది అది మొదటి వ్యాసం. తరువాత అనేక మూలాధారాలు చదివి, న్యాపతి సుబ్బారావుగారితో కూడా సంప్రతించి 1959 లో క్రిష్ణా పత్రికలో వరుసగా మూడు సీరియల్ వ్యాసాలు వ్రాశారు. అది చాల అమూల్య వ్యాసం. ఆతరువాత 1985 లో ఇంగ్లీషులోకూడా మద్రాసులోని The Theosophist అను ధియొసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియావారి పత్రికలో “ Swami T. Subba Row “ అను వ్యాసమును వ్రాశారు.. అదే పత్రికలో సంపుట 10., నంబరు 1982 జూలై 10 లో రామానంద భారతి గారు కూడా“ Swami T. Subba Row “ అను వ్యాసం వ్రాశారు.[7][8]

వంశం పుట్టుపూర్వోత్తరాలు

మార్చు

తల్లాప్రగడ సుబ్పారావు గారు వీరవెంకట నారాయణ వెంకట మాణిక్యమ్మ దంపతుల ఏకైక పుత్రుడు . వీరి తల్లి వెంకట మాణిక్యమ్మ గారు దిగవల్లి తిమ్మరాజు పంతులు గారి ఏకైక పుత్రిక. వీరవెంకటనారాయణగారు తిమ్మరాజుగారికి స్వయాన్న మేనల్లుడే. చూడు దిగవల్లి తిమ్మారాజు పంతులు Wikipedia Telugu. తల్లాప్రగడ సుబ్బారావుగారు 06/07/1856 న వారి మాతామహులైన దిగవల్లి తిమ్మరాజు గారి కాకినాడ రాబర్టసన్ పేట లోని స్వగృహములో జన్మించారు. బాల్యంలోనే తండ్రి వీరవెంకటనారాయణ గారు మరణించటంతో (24/02/-1857) సుబ్బారావు గారు కాకినాడలో తిమ్మరాజు గారింట్లోనే పెద్దమేనమామ దిగవల్లి వెంకట శివరావుగారి పరియవేక్షణలోనూ తన చిన మేనమామ దిగవల్లి వెంకటరత్నం గారు తోపాటుగా పెరిగారు. వెంకటశివరావు గారు (1829- 1892 ) బాలుడైన తమ్ముడు (6 ఏండ్లు) వెంకటరత్నంగారిని, పసి బాలుడైన (8 నెలల) మేనల్లుడు తల్లాప్రగడ సుబ్బారావుగారిని కూడా పెంచి చదువు చెప్పించి పెద్ద చేశారు.

ఉన్నతశ్రేణి ఉత్తీర్ణతలతో విద్యాభ్యాసం

మార్చు

సుబ్బారావు గారు చదివిన ప్రతి తరగతిలోను ప్రథమశ్రేణి రాని తరగతి లేదు బహు మతి రాని పోటి లేదు. వీరు 1870 లోకాకినాడ హిందూ హేపాఠశాలలో మూడవఫారంతో సరిసమానమైన మిడిల్ పాఠశాలలో చదివిన తరువాత ఆ పాఠశాల ప్రిన్సిపల్ ప్రధానోపాధ్యాయుడుకెన్నీ దొరగారు పిల్లవాడైన సుబ్బారావుగారి అఖండ మేధాశక్తి చూసి సరాసరి మెట్రక్యులేషన్ లోకి ప్రవేశమిచ్చారు సుబ్బారావుగారు 1871 లో మెట్రిక్యులేషన్ ఉత్తమ శ్రేణిలే నుత్తీర్ణులైయ్యారు. అప్పటికి వారికి 15 ఏండ్లప్రాయం. అప్పటి నుండే వారు స్వయం కృషితో సంస్కృతము నేర్చుకుని వేదాంతగ్రంథములు చదవసాగెను. పెదమేనమగారు దిగవల్లి వెంకట శివరావుగారు వారిని 1872 లో ప్రెసిడెంసీ కాలేజి మద్రాసులో యఫ్ ఎలో చేర్చారు. వారు యఫ్ ఎ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనందున వారికి 1874 లో వారి బియఎ చదువుకు మొదటి సంవత్సరంలో నే వారికి Lord Eliphinston Scholarship నెలకు 16 రూపాయలు చోప్పున లభించంచింది. 1876 లో20 ఏండ్ల వయస్సు కే B.A ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైయ్యారు, బి.ఎ రెండవ సంవత్సరంలో నుండగా వారు వ్రాసిన ఇంగ్లీషు వ్యాసానికి Eliphinston Prize Rs 80/-నూ విజయనగరం మహారాజు ఆనంద గజపతి రాజుగారుపేర 1869 లో సంస్ధాపించిన బహుమతి 16 రూపాయలు సైకాలజీలో ప్రావీణ్యతకి 1876లో సుబ్బారావుగారికి లభించింది. 1875 లో వారికి ప్రెసిడెంసీ కాలేజీ వారి బోర్డిల్లన్ బహుమతి 20 రూపాయలు వచ్చింది. చూడు Wikipedia Telugu దిగవల్లి వేంకట శివరావు[1898-1992]. సుబ్బారావు గారు 22 ఏండ్ల వయస్సు లోనే (1878లో) B.L పాసైయ్యారు. 1885 లోఅప్పుడే కొత్తగా వచ్చిన మద్రాసు ప్రోవెన్సియల్ సివిల్ సర్వీసు పోటీ పరీక్ష వ్రాసి సుబ్బారావు గారు అందలో గూడా అగ్రశ్రేణలో ప్యాసైరి. కాని వారు సివిల్ సరీస్ లో ఉద్యాగం చేయుటకు సమ్మతించ లేదు. వారి విద్యాభ్యాసం ఒక అమూల్య ఆదర్శంగా నిలచింది

వివాహం- కుటుంబం

మార్చు

ఆకాలంనాటి ఆచార ప్రకారం వీరికి 10 వ ఏటనే 1865 వివాహమైనది. బాల్య వివాహాలు మృత్యువాతలు అతి సాధారణమైనట్టి రోజులు. వారికన్నాచిన్నదైన తన భార్య వివాహం అయిన కొద్ది కాలంకే పరమదించింది. వివరాలు తెలియవు. ఆ తరువాత సుబ్బారావుగారు బి.ఎ పాసైనాక 15/05/1876 తారీఖున వీరికి పినమేనమామ దిగవల్లి వెంకటరత్నం గారి కుమార్తె సుందరమ్మాగారితో కాకినాడ రాబర్టసన్ పేట గృహంలో అప్పటిలో పిఠాపురం దివాన్ గాను న్న తన పెదమేనమామ దిగవల్లి వెంకట శివరావుగారి పర్యవేక్షణలో మహావైభవంగా జమీందారీ పధ్ధతిలో వివాహం చేశారు. వివాహంచేసుకుని సుబ్బారావు గారు బియల్ చదువుతూ తన తల్లి, భార్యతో సహా మద్రాసులో తిరువలిక్కేణిలో కాపురం చేశారు. వారికి సంతానం కలుగలేదు. వారు 24/06/1890 చనిపోయేనాటికి కొన్ని రోజులముందుననే తనభార్యసుందరమ్మగారికి పిల్లవానినెవరినైననూ దత్తత చేసుకొనుటకు అనుమతి నిచ్చిరి. భాస్కరతిమ్మరాజు అను ఒక బాలుని దత్తత చేసుకొనెను. ఆబాలునికి చిన్ననాటనే దిగవల్లి తిమ్మరాజు (వెంకటరత్నంగారి పెదకుమారుడు) గారి కుమార్తె మహాలక్ష్మినిచ్చి వివాహం చేశారు. అయితే ఆ బాలుడు పదనారవఏటనే 09/11/1906 నాడు మరణించెను. మహాలక్ష్మిగారు జీవితాంతం వైదవ్యం అనుభవించి వారి తమ్ముని కుమారుడు సుబ్బారావుని దత్తత చేసుకున్నారు. ఆ విధంగా బ్రహ్మజ్ఞాని తల్లాప్రగడ సుబ్బారావుగారి వంశము నిలబెట్టిన ఈనాటి తల్లాప్రగడసుబ్బారావుగారు B.E Mechanical Engineer చేసి ఇప్పడు ఏలూరులో నున్నారు. వీరు న్యాయవాదిగా అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారికి జూనియర్ గాచేసిన ఏలూరు న్యాయవాది దిగవల్లి వెంకట రత్నం M.A., B.L గారి మూడవ కుమారుడు. ఈ సుబ్పారావుగారికి ఇద్దరే కుమారులుMr.Tallapragada Ratan and Mr. Tallapragada Uday Bhaskar. వారు అమెరికాలో కంప్యూటర్ ఇంజనీరులు. ఇప్పటి తల్లాప్రగడ సుబ్బారావుగారుతో సంప్రతించుటకు వారి email id= srtallapragada@gmail.com

సాహిత్య జీవితం

మార్చు

వారు బియల్ చుదువుచున్న రోజులలోనుడీ కూడా వారు మద్రాసులో తిరువలిక్కేణిలో తల్లి, భార్యతో కాపురముండేవారు. అప్పుడు తిరువలిక్కేణి లిటరరీ సంఘము చాల పేరు పొందిన సాహిత్య వేత్తల సంఘము దానిలో సుబ్బారావుగారు సభ్యులు వారితో పాటు సమకాలీక సభ్యులు గానున్న వారు కూడా అఖండులు న్యాపతి సుబ్బారావు, G. subrahmanya Iyyer, TT Ranga Chari, C.V Ranga chari, D.Desava Pant, M. Veeraraghavachari మొదలైన వారు. ఆప్పటి యువకులైన వీరందరి కృషి వలనే ప్రఖ్యాతమైన హిందూ అనే పత్రిక మొట్టమొదట1878లో ఒక వార పత్రికగా స్ధాపింప బడింది. సుబ్బారావుగారి రచించిన దైవజ్నానగ్రంథమును ధియోసాఫికల్ సొసైటీ వారు "''Esoteric writings of T.Subba rao''" 1895 లో ముద్రించారు, అంతకుముందు 1886 లోడిసెంబరు 27,28,29,30 తారీఖులలో సుబ్బారావు గారు భగవత్గీత మీద ప్రసంగాల నాధారంగా చేసి ''The Philosophy of Bhagavadgita by T. Subba Row'' అను పుస్తకమును 1912 మద్రాసులోని యోసాఫికల్ సొసైటీవారు ప్రచురించారు. ఇది చాలగొప్పగ్రంథము. ఆ గ్రంథముమొదటి ఎడిషన్ మద్రాసు హైకోర్టుప్రధాన న్యాయమూర్తిగా చేసిన సర్ యస్ సుబ్రమణ్యన్ అయ్యర్ గారు తన సొంతంగా ప్రచురించారు తరువాత రెండవ సంకలనం ధియోసాఫికల్ సొసైటీ వారు 1912లో ప్రచురించారు. ఆ రెండవ సంకలనంకే సర్ సుబ్రమణ్యన్ అయ్యర్ గారు ఒక వ్యాసం "an appreciation of T. Subbarao" అని వ్రాసి అందులో చాల విశేషాలు సుబ్బారావు గారి గురించి అఖండ మేధాశక్తిగల వ్యక్తిగా వర్ణించారు.

న్యాయవాది వృత్తి

మార్చు

సుబ్బారావుగారు బి యల్ ప్యాసైనాక స్వంతప్రాక్టీసుప్రారంభిచక ముందు 05/04/1879న Grant & Laying అను ఆంగ్లేయ న్యాయవాదుల దగ్గర పని నేర్చుకొనుటకు అప్రంటీసుగా జేరారు. 1876 బి.ఎ తరువాత న్యాయపట్టా పుచ్చుకోకముందే బరోడా మహారాజగారి దివాన్సర్ టి మాధవరావుK.C.S.I గారి కోరికపై సుబ్బారావుగారు కొన్నాళ్ళు బరోడా హైకోర్టులో రిజిస్ట్రారుగా నెలకు 700 రూపాయల జీతం పై పనిచేశారు.[9] 1880 నుండి మద్రాసు హైకోర్టులోన్యాయవాదిగా చేశారు అతి త్వరలో నే వారు గొప్ప కీర్తి, ఆదాయం గల న్యాయవాదిగా బెంచి, బార్ లోనూ పేరు సంపాదించారు.[2] వీరు న్యాయవాదిగా చేసినది ఎరుగున్నప్రముఖ న్యాయవాది, మద్రాసు రాజనీతి నాయకులలో ప్రముఖుడైన సర్ సివస్వామి అయ్యర్ సుబ్బారావుగారు న్యాయవాదిగా ఒక గీటురాయిలాంటి వారని తన జూనియర్ అప్రంటీసులకి చ్చిన ప్రసంగాలలో ఉదహరించిన సంగతి మద్రాసు లా జర్నల్ 47 సంపుటలో ప్రచురించ బడింది.[1] సుబ్బారావు గారి తోపాటూ న్యాయవాదిగా నుండి, తదుపరి మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినట్టి సర్ యస్ సుబ్రమణ్యన్అయ్యర్ K.C.I.E గారు వ్రాసిన వ్యాసం[6] సుబ్బారావుగారి అఖండ జ్ఞాపక శక్తి, వారి న్యాయవాది వృత్తిలో గూడా గుర్తించబడింది."400 పుటలు గల కేసు రికార్డులో జ్ఞాపకం వుంచుకోవలసిన సంగతులు ఒక్క కాగింతం ముక్క కూడా చేతిలో లేకుండా కేసు వాదించడం నేను చాశాను" అని సర్ సివస్వామి అయ్యర్ గారు మద్రాసు లా జర్నల్ లో వ్రాశారు [1][7]

సుబ్బారావు బ్రహ్మజ్ఞానం

మార్చు

తన 13 వ ఏట 1869 లో వారి అమ్మగారుతోనూ, మేనమామ తోనూ కలసి కాశీకి వెళ్ళినప్పుడు వారు తనకి కాశీ అంతకు ముందే చూసినట్లున్నదని పలుమారులు చెప్పటంతో అక్కడి వారందరూ కూడా ఆ పిల్లవాడికి పూర్వజన్మ స్మ్రు తి ఉంటుదని చేప్పారు. తరువాత పెద్దైనతరువాత వారి మిత్రులకు తనకు కాశీ పట్టణం పరిచితమున్నట్లు స్మృతి కలిగినదని చెప్పారు. వారి 1869 కాశీ యాత్ర వారిలో గొప్ప మార్పు కలిగించింది. అప్పటి నుడియే వారు గాయత్రీ జపం చేయుట యోగసాధనలో అభిరుచి కలుగట జరిగింది వారు స్వయం కృషితో సంస్కృతాంధ్ర ములో పాండిత్యం సంపాదించి వేదాంతోపనిషత్తులు మధించి, 1875 లో అమెరికాలో స్థాపింప బడ్డ దైవజ్ఞాన సంస్ధ (Theosophical Society) ముఖ్య కార్యాలయమును 1882 లో మద్రాసులోని అడయారుకు మార్చటానికి ముఖ్యకారకులు. అప్పుటికే మహా జ్ఞానిగా పరిగణించబడిన తల్లాప్రగడ సుబ్బారువుగారిని అదే సంవత్సరం 1882 లో కార్యదర్సిగాను దివన్ బహదూర్ రఘునందనం గారిని అధ్యక్షులు గాను ఎన్నుకున్నారు. ఆసంస్ధ వ్యవస్ధాపకురాలుమాడమ్ బ్లవట్సకీ ( Hellena Petrovna Blavatsky) గారు సుబ్బారావుగారిని బ్రహ్మజ్ఞాని (ముఖ్యంగా దివ్యజ్ఞానంknowledge of Occult) గా గుర్తించి తను రచించిన “The Secret Doctrine” అను గ్రంథముమొట్ట మొదటి సారి (1888) విడుదలైనపుడు సుబ్బారావుగారిని సహగ్రంధకర్తగా వ్రాశారు. ఆ దైవజ్ఞానసంస్ధ లోని ప్రముఖ సభ్యులు చాలమంది దిగ్గజులు: సర్ యస్ సుబ్రమణ్య అయ్యర్ (Sir S. Subramanian Ayyar) ఎ. పి. సిన్నెట్ ( A.P. Sinnet), సి డబ్లియూ లెడ్బీటర్ (Charles Walter Leadbeater), Allan Octavian Hume [ఎ.ఒ హ్యూమ్] ఎ. జె కూపర్ ఓక్లే ( AJ. Cooper-Okley) డా నైల్ కుక్Dr. Neil Cook మొదలైన వారు సుబ్బారావుగారిని గురువుగా భావించారని, వారు గొప్ప సంస్కృత విద్వాంసుడనీ, సనాతన, వేదాంత, ప్రాచీన నిఘూడ తత్వజ్ఞాన సారాంశాలపై అపార విజ్ఞానము కలవాడనీ మహా వక్తయనీయు, వారి సమకాలీకులు దైవజ్ఞాన సంస్ద సభ్యులే కాక దేశ విదేశాల నుండి వేదాంత సాహిత్య వేత్త ప్రముఖులు తమ తమ వ్యాసములలో నొక్కివక్కాణించి చెప్పిన అనే క మూలాధారాలు కనబడుతున్నాయి.[10][11][12] మొదట్లో వీరికి ఆ దివ్యజ్ఞానం (Occult) లేదనీను సుబ్బారావుగారి సన్నిహితులైన, బరోడా ఎస్టెట్కు దివానుగాచేసిన సర్ టి. మాధవరావు K.C.S.I గారు కూడా అలానే చెప్పారనీ కానీ సుబ్బారావు గారు బ్లవట్ స్కీ గారిని చూచి నప్పటి నుండి వారిలో దాగి యున్నదివ్య జ్ఞానం (ఓకల్టు జ్ఞానం) ధారళంగా వెలువడిందనీ ఓల్కాట్ గారు ఓల్డు డైరీ లీఫ్సు అను పుస్తకం 4వ విడత (1887-92) చాప్టరు 13 242”the death of Subbarao”లో వ్రాశారు.[13] మద్రాసు హైకోర్టుకు ఛీఫ్ జస్టిస్ గా చేసిన సర్ యస్ సుబ్రమణ్యన్ అయ్యర్ గారి అమూల్య వ్యాసములో సుబ్బారావుగారి విజ్ఞానము మేధా శక్తిని గూర్చి వ్రాస్తూ వారి దివ్య జ్ఞాన విద్యను లెడ్బీటర్ (C.W.Leadbeater) తోను, ఎ.జే కూపర్ ఓక్లే (A.J.Cooper Okley) మాత్రమే చర్చించేవారనీను వ్రాశారు.[6] సుబ్బారావుగారి రచనలను“Esoteric writings of T.SubbaRao” అను పేరుతో మద్రాసు అడయారులోని Theosophical Society వారు ప్రచురించారు. వారు తత్వ జ్ఞాన మూల సూత్రముల (occult) విషయములు ఎవరికీ చెప్ప టానికి ఇష్టపడేవారు కారని చాల మంది వ్రాశారు. అయితే మాడమ్ బ్లవట్సకీ గారి మాట తీసేయలేక ఎ. పి సిన్నెటు గారిని సుబ్బారావుగారు శిష్యులుగా అంగీకరించారని మహాత్మ లెటర్సు అన్న పుస్తకములో నున్నది.సుబ్బారావుగారు రోజూ రెండుగంటలు జపతపములో పద్మాసనములో కూర్చుని ఉండేవారని ఆసమయంలో వారి గది తలుపులు వేసి యుండేవని, సందులలోంచి చూచిన కొందరు బంధువులు సుబ్బారావుగారు పద్మాసనంలో భూమి పైకి లేచనట్లు తోచేది అనిచెప్పేవారు.[7] సుబ్బారావుగారి రచనలలో (1) జ్యోతిచక్రములోనిపన్నెండు రాసుల చరిత్ర (2) నాడీ గ్రంథము (3) హఠయోగము (4) పుణ్యక్షేత్రముల అంతరార్ధము (5) అదిశంకరుల కాల నిర్ణయములు (6) బ్రహ్మ విద్యా రహస్యములు (7) బుధ్ధనిర్యాణశాలనిర్ణయము (8) ప్రకృతి పురుషుడు (9) అద్వైతము మొదలైన వ్యాసములు సుబ్బారావుగారు రచించినవి దైవజ్ఞాన సంస్ధ వారు పుస్తక రూపములో ప్రచురించారు.[7] సూబ్బారావుగారు జీవించియుండగనే వారి అఖండ పాండిత్యమునకు జోహారుగా 1883 దైవజ్ఞాన సమావేశం లోవారి పేరు మీద ఒక పతకము సంస్దాపించుటకు నిర్ణయించబడింది. ఆ పతకము ‘ T.Subba Row Medal ’ ఈ క్రింది నాలుగు విభాగములనేదానిపైనా వ్రాసి న ఉత్తమ వ్యాసముకు ఇవ్వబడును. (1) Aryan Occult Science and Philosophy (2) Buddist Esoteric Philosophy (3) Chaldean Esoteric Science and Philosphy and Zorastrianism (4) Jewish Kabalah and Esoteric interpretation of the Christian Religion.[2] 1890 లో సుబ్బారావుగారు పరమదించిన తరువాత ఆ పతకము ప్రతి సంవత్సరమూ ఇవ్వదలచినట్లుగా నిర్ణయించారు. కానీ 1890 నుండి 95 దాకా ఎవ్వరూ ఆ పతకము గెలుచుకోలేక పోయారు. 1895 లో మొదటిసారిగా ఆపతకము తీసుకోగలిగిన కీర్తిఅనీబిసెంటు (Mrs. AnnieBesant) కే దక్కినది. 1896 లో ఎ.పి సిన్నెట్ కీ 1897 లో సి డబ్ల్యూ లెడ్బీటర్ కీ ఇవ్వబడింది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 Sir Sivaswami Ayyar,Madras Law Journal, Volume 47
  2. 2.0 2.1 2.2 T.Subba Row (1856-1890) publication of Theosophical Society
  3. Old Diary Leaves,Henry Steel Olcott, 4th Series(1887-1892)Chapter XIII 242"Death of Subbarao"
  4. The Philosophy of Bhagavadgita by T. Subba Row published in 1912 by Theosophical Office, Adayar, Madras – Four lectures held at Adayar , Madras on 27,28,29,30 of December 1886
  5. Esoteric Writings of T. Subba Row (1895) Published by Theosophical Society, Madras
  6. 6.0 6.1 6.2 “An appreciation of T.Subbaro”, Subramanian Ayyar (2010), The Theos-Talk E-mail list in the book “the Philosophy of Bhagvada Gita by T. Subba Rao” 2nd Edition Thosophical Society publication of 1912 based on the lectures delivered by Swami T. Subbarao on Bagavad Gita on four days December 27.28.29.30 1886
  7. 7.0 7.1 7.2 7.3 Brahmjani Tallapragada Subba rao”,Digavalli Venkata Sivarao, Krishna Patrika June 6, 9,13 1959
  8. “Swami T. Subba Rao”, Digavalli Venkata Sivarao. Theosophist Volume 107, No.1, October 1985
  9. "Subbarow. T (1856-1890) Theosophical Encyclopedia. July 6,2001
  10. “The Masters and the Path”, C.W. Leadbeater (1925),(1927) page 15
  11. “The Genius of T. Subbarao” , Martin Euser (2010) Scribid , the World’s Digital Library
  12. “The great Esotericist of the past”, John F. Nash (2012) Esoteric Quarterly page 67-69
  13. “The Death of Subbarao", Henry Steel Olcott , Old Diary Leaves 4th Series (1887-92) Chapter XIII 242‘ Theosophical Publishing House, Adayar, Madras