తవ్వా రుక్మిణి రాంరెడ్డి
తవ్వా రుక్మిణి రాంరెడ్డి ప్రముఖ కార్టూనిస్టు, నాటక కర్త, వ్యంగ్య రచయిత.[1] ప్రజానాట్య మండలిలో పనిచేసిన రాంరెడ్డి పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. గతంలో వరంగల్ జిల్లా డోర్నకల్ ఎఈవోగా పనిచేశారు.
జీవిత విశేషాలు
మార్చు1945 ఏప్రిల్ లో డోర్నకల్ లో జన్మించిన రాంరెడ్డి బిఎస్సీ వరకు చదివారు. వృత్తిరీత్యా టీచర్ అయినప్పటికీ అనేక కథలు రాసారు. ఇటు రచయితగా, కార్టూనిస్టుగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. వివిధ వారపత్రికల్లో, మాస పత్రికల్లో 15వందలకు పైగా కార్టూన్లు వేసారు. గులాబి, కోతులు, నీడ అనే నవలల్ని కూడా రచించారు. మూడుసార్లు జాతీయ స్థాయిలో పురస్కారాలను పొందారు. 10టీవిలో ప్రసారమైన మాయా మశ్చింద్రా అనే కార్యక్రమానికి చాలాకాలం పాటు సేవలందించారు. 2013 లో తెలుగు యూనివర్శిటీ రాంరెడ్డికి కీర్తి ప్రతిష్ఠాపురస్కారం అందజేసి సత్కరించింది. రుక్మిణి అనేక పలు కథల్ని తెలుగులోకి అనువదించారు.[2]
వరంగల్ జిల్లా డోర్నకల్‌కు చెందిన రాంరెడ్డి మహబూబాబాద్ (మానుకోట) పట్టణంలో స్థిరపడ్డారు. తెలంగాణ సమాజ తీరుతెన్నులను కళ్లకు కడుతూ ‘మాయ’ అనే నాటికను రచించి విస్తృతంగా ప్రదర్శనలిచ్చారు. 1500కి పైగా కార్టూన్లు, 100కు పైగా వ్యంగ్య రచనలు చేశారు. మూడుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు.
అస్తమయం
మార్చుకొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ సెప్టెంబరు 14 2016 న మరణించారు. ఆయనకు భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.