ప్రధాన మెనూను తెరువు

మహబూబాబాద్‌

తెలంగాణ, వరంగల్ జిల్లా, మహబూబాబాద్ మండలం లోని జనగణన పట్టణం
  ?మహబూబాబాద్‌
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°37′00″N 80°01′00″E / 17.6167°N 80.0167°E / 17.6167; 80.0167Coordinates: 17°37′00″N 80°01′00″E / 17.6167°N 80.0167°E / 17.6167; 80.0167
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 44.99 కి.మీ² (17 చ.మై)
జిల్లా(లు) మహబూబాబాద్ జిల్లా
భాష(లు) తెలుగు
పురపాలక సంఘం మహబూబాబాద్


మహబూబాబాద్‌, తెలంగాణ రాష్ట్రంలోని నూతనంగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లాకు చెందిన పట్టణం, అదే పేరు గల జిల్లాకు ప్రధాన కేంద్రం,మండల కేంద్రం.[1].

మహబూబాబాద్ ను మానుకొట అని కూడా అంటారు.మహబూబాబాద్ జిల్లాలో పెద్ద పట్టణం.ఇది మైదాన ప్రాంతానికి చెందిన నగరం. ఎన్నో విద్యాసంస్థలు, సూపర్ స్పెషాలిటి సదుపాయాలు కల ఆసుపత్రిలు ఉన్నాయి. ఇది శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గ కేంద్రస్థానం.

గణాంకాలుసవరించు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,13,812 - పురుషులు 56,424 - స్త్రీలు 57,388..పిన్ కోడ్ నం.506 101.,ఎస్.టి.డి.కోడ్ = 08719.

వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు.సవరించు

లోగడ మహబూబాబాద్ వరంగల్ జిల్లాకు చెందిన ఒక పట్టణం మరియు రెవిన్యూ డివిజన్,మండల కేంద్రం.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మహబూబాబాద్ ను కొత్త జిల్లాగా ప్రకటించి, అదే జిల్లాలో రెవిన్యూ డివిజను కేంద్రంగా, మండలం కేంద్రంగా (1+19) ఇరవై గ్రామాలుతో ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

రవాణా సదుపాయాలుసవరించు

మహబూబాబాదుకు బస్సు, రైలు మార్గంలో ప్రధాన పట్టణాల నుంచి మంచి రవాణా సదుపాయాలు ఉన్నాయి. కాజీపేట్ - విజయవాడ రైలు మార్గంలో రైల్వేస్టేషన్ ఉంది. రోడ్డు మార్గంలో జిల్లా కేంద్రమైన వరంగల్లు నుంచి 61 కిమీ దూరంలో ఉంది. సమీపంలోని విమానాశ్రయం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 200 కిమీ దూరంలో ఉంది.

పట్టణ విశేషాలుసవరించు

మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఎర్ర కేశవరావు,వినోద దంపతుల కుమార్తె దీక్షిత, ప్రస్తుతం హైదరాబాదులోని స్పోర్ట్స్ పాఠశాలలో మొ.సం. ఇంటరు చదువుతుంది. ఈమె మంచి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. ఈమె తాజాగా మలేషియాలోని పెనాంగ్ నగరంలో జరుగుచున్న కామన్ వెల్త్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మొత్తం 3 రజతపతకాలు సాధించింది. ఇంతకు ముందు ఈమె 2011లో ఇటానగరులో జరిగిన నేషనల్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో బాలికల 53కి.గ్రా. విభాగంలో పాల్గొని, 1 రజతం, 2 కాంస్యపతకాలూ గెల్చుకున్నది. 2012లో న్యూజిల్యాండ్లో, కామన్ వెల్త్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మొదటిసారిగా పాల్గొని, బంగారు పతకం సాధించినది[2]

ఇవి కూడా చూడండిసవరించు

ప్రదేశాలు జలపాతంలుసవరించు

1.B.N గుప్తా(తులారం)జలపాతం,2.ఏడుబావుల జలపాతం,3.బయ్యారం చెరువుశాసనం ,4.భీమునిపదం జలపాతం,5.కంబాలపల్లి చెరువు,6.కురవి వీరభద్రస్వామి ,7.అనంతరం (అనంత్రద్రీ), 8.డోర్నకల్ చర్చీ, బాలనాయక్స్స సొనో

మూలాలుసవరించు

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. ఈనాడు వరంగల్లు,28-11-2013,2వ పేజీ.

బయటి లింకులుసవరించు