తాతినేని సత్య

తెలుగు, తమిళ సినీ దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత

తాతినేని సత్య, తెలుగు, తమిళ సినీ దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత.[1] ఇతడు తెలుగు సినీ దర్శకుడైన తాతినేని ప్రకాశరావు మనవడు.

తాతినేని సత్య
Tatineni Satya.jpg
జననం
విద్యాసంస్థలయోలా కళాశాల, చెన్నై
వృత్తిసినిమా దర్శకుడు
స్క్రీన్ ప్లే రచయిత
క్రియాశీల సంవత్సరాలు2010 - ప్రస్తుతం

జీవిత విషయాలుసవరించు

చెన్నైలో జన్మించిన సత్య అక్కడే పాఠశాల విద్యను పూర్తి చేసి, చెన్నైలోని లయోలా కాలేజీ నుండి విజువల్ కమ్యూనికేషన్ లో డిగ్రీ అందుకున్నాడు.

సినిమారంగంసవరించు

2001లో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వచ్చిన జోడి నంబర్ 1 సినిమాకు సహాయ దర్శకుడిగా చేరాడు. డేవిడ్ దగ్గర మరో ఎనిమిది సినిమాలకు పనిచేశాడు. 2005లో ప్రియ దర్శకత్వంలో వచ్చిన కంద నాల్ ముధల్ అనే తమిళ చిత్రానికి సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాడు.[2]

2009లో తమిళంలో విడుదలై విజయం సాధించిన వెన్నిల కబాడి కుజు అనే సినిమాను 2010లో భీమిలి కబడ్డీ జట్టు పేరుతో రిమేక్ చేశాడు.[3] ఆ తరువాత 2012లో శివ మనసులో శృతి (2009లో వచ్చిన శివ మనసుల శక్తి అనే తమిళ సినిమా రీమేక్) తీశాడు.[4] ఆ తర్వాత 2016లో శంకర (2011లో వచ్చిన మౌన గురు అనే తమిళ సినిమా రీమేక్) తీశాడు.[5][6]

సినిమాలుసవరించు

సంవత్సరం సినిమా భాష ఇతర వివరాలు
2010 భీమిలి కబడ్డీ జట్టు తెలుగు
2012 శివ మనసులో శృతి తెలుగు
2016 శంకర తెలుగు
2017 యార్ ఇవాన్
వీడెవడు
తమిళం
తెలుగు

మూలాలుసవరించు

  1. "Tatineni Satya". timesofindia.indiatimes.com. Retrieved 29 April 2021.
  2. "Tatineni Satya interview - Telugu Cinema interview - Telugu film director". www.idlebrain.com. Retrieved 29 April 2021.
  3. "Satya Tatineni". filmytoday.com. Retrieved 29 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "SMS Telugu film review - Telugu cinema Review - Sudheer Babu & Regina". www.idlebrain.com. Retrieved 29 April 2021.
  5. "Shankara Movie Review". www.timesofindia.indiatimes.com. Retrieved 29 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "Shankara telugu movie review". 123telugu.com. 2016-10-21. Retrieved 29 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులుసవరించు