శంకర (2016 సినిమా)
2016లో తాతినేని సత్య దర్శకత్వంలో విడుదలైన సినిమా
శంకర 2016, అక్టోబరు 21న విడుదలైన తెలుగు చలనచిత్రం. తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నారా రోహిత్, రెజీనా, ఆహుతి ప్రసాద్, ఎం. ఎస్. నారాయణ, రాజీవ్ కనకాల, ప్రగతి తదితరులు నటించగా సాయి కార్తీక్ సంగీతం అందించాడు.[2][3] తమిళంలో విజయం సాధించిన మౌన గురు చిత్రం ఆధారంగా ఇది తెరకెక్కింది.[4][5]
శంకర | |
---|---|
దర్శకత్వం | తాతినేని సత్య |
నిర్మాత | ఆర్.వి. చంద్రమౌళి ప్రసాద్ |
తారాగణం | నారా రోహిత్, రెజీనా |
ఛాయాగ్రహణం | టి. సురేందర్ రెడ్డి |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | సాయి కార్తీక్ |
నిర్మాణ సంస్థ | శ్రీ లీల మూవీస్ |
విడుదల తేదీ | 21 అక్టోబరు 2016[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథానేపథ్యం
మార్చుశంకర్ (నారా రోహిత్) హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటుంటాడు. అనుకోని పరిస్థితుల్లో ఒక పోలీసు అధికారి (జాన్ విజయ్) వల్ల శంకర్) మాదకద్రవ్యాల కేసులో ఇరుక్కుంటాడు. శంకర్ ఆ సమస్యను ఎలా పరిష్కరించాడు అనేది మిగతా కథ.
నటవర్గం
మార్చు- నారా రోహిత్
- రెజీనా
- జాన్ విజయ్
- నీల్యా
- ఆహుతి ప్రసాద్
- ఎం. ఎస్. నారాయణ
- రాజీవ్ కనకాల
- ప్రగతి
- హజెల్ క్రౌనీ (ప్రత్యేక పాట)
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: తాతినేని సత్య
- నిర్మాత: ఆర్.వి. చంద్రమౌళి ప్రసాద్
- సంగీతం: సాయి కార్తీక్
- ఛాయాగ్రహణం: టి. సురేందర్ రెడ్డి
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- నిర్మాణ సంస్థ: శ్రీ లీల మూవీస్
ఇతర వివరాలు
మార్చు- 2013, జనవరి 24న ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. రమేష్ ప్రసాద్ క్లాప్ కొట్టగా, చాముండేశ్వరినాథ్ కెమెరా ఆన్ చేయగా వి. వి. వినాయక్ మొదటి షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు.[6]
- యు మీ ఔర్ హమ్, ఎ ఫ్లాట్ వంటి హిందీ చిత్రాలలో నటించిన బ్రిటీష్ మోడల్, నటి హజెల్ క్రౌనీపై ఒక ఐటమ్ సాంగ్ చిత్రీకరించబడింది.[7]
పాటలు
మార్చుసాయి కార్తీకం సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు అదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యాయి.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "ఓ శరభ (రచన: అభినయ శ్రీనివాస్)" | సాయి కార్తీక్, దివిజ కార్తీక్ | 1:32 | ||||||
2. | "నీ ప్రాణం (రచన: బాలాజీ)" | రంజిత్ | 4:12 | ||||||
3. | "మరదల మరదల (రచన: రామజోగయ్య శాస్త్రి)" | సాయి కార్తీక్, దివిజ కార్తీక్ | 3:25 | ||||||
4. | "శంకర (రచన: రామజోగయ్య శాస్త్రి)" | సాయి చరణ్, ఎం.ఎల్.ఆర్. కార్తీకేయన్ | 3:12 | ||||||
5. | "ఎదలోన (రచన: రామజోగయ్య శాస్త్రి)" | సమీర్ | 3:54 | ||||||
16:15 |
మూలాలు
మార్చు- ↑ "Shankara Telugu Movie, Wiki, Story, Review, Release Date, Trailers – Filmibeat". Retrieved 9 July 2019.
- ↑ "Nara Rohit, Regina's film titled 'Shankara'". timesofap.com. Archived from the original on 17 జూన్ 2013. Retrieved 9 July 2019.
- ↑ "Nara Rohit's 'Shankara' audio soon". 123telugu.com. Retrieved 9 July 2019.
- ↑ "Nara Rohit in a crime drama". timesofindia.indiatimes.com. 27 May 2013. Archived from the original on 2 December 2013. Retrieved 9 July 2019.
- ↑ "shankara-theatrical-trailer-nara-rohit-regina-cassandra". Archived from the original on 20 ఫిబ్రవరి 2015. Retrieved 9 జూలై 2019.
- ↑ "Nara Rohit's new film in the direction of Tatineni Satya Prakash". idlebrain.com. 24 January 2013. Retrieved 9 July 2019.
- ↑ "Hazel Crowney grooves to item song in 'Shankara'". newindianexpress.com. Archived from the original on 10 మార్చి 2016. Retrieved 9 July 2019.