శివ మనసులో శృతి

తాతినేని సత్య దర్శకత్వంలో 2012లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా

శివ మనసులో శృతి (ఎస్ఎంఎస్), 2012 ఫిబ్రవరి 10న విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా.[1] వేగ ఎంటర్టైన్మెంట్ బ్యానరులో విక్రమ్ రాజు నిర్మించిన ఈ సినిమాకి తాతినేని సత్య దర్శకత్వం వహించాడు. ఇందులో సుధీర్ బాబు, రెజీనా నటించగా, చక్రి, యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. 2009లో తమిళంలో విజయవంతమైన శివ మనసుల శక్తి సినిమా రిమేక్ ఇది.[2]

శివ మనసులో శృతి
శివ మనసులో శృతి సినిమా పోస్టర్
దర్శకత్వంతాతినేని సత్య
రచననంద్యాల రవి(మాటలు)
స్క్రీన్ ప్లేతాతినేని సత్య
కథఎం. రాజేష్
నిర్మాతవిక్రమ్ రాజు
తారాగణంసుధీర్ బాబు
రెజీనా
ఛాయాగ్రహణంచిట్టిబాబు
కూర్పుసతీష్ సూర్య
సంగీతంచక్రి
యువన్ శంకర్ రాజా (నేపథ్య సంగీతం)
నిర్మాణ
సంస్థ
వేగ ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీ
2012 ఫిబ్రవరి 10 (2012-02-10)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా సారాంశం సవరించు

శివ (సుధీర్ బాబు) ఒక కొరియర్ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటాడు. రేడియో జాకీగా పనిచేసే శృతి (రెజీనా కాసాండ్ర)ను రైలు ప్రయాణంలో చూస్తాడు. శివ ఆమెను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. మొదట్లో శృతి అయిష్టంగానే ఉన్నా, కొన్ని రోజుల తరువాత తను కూడా ప్రేమించడం ప్రారంభిస్తుంది. శృతి తన ప్రేమను చేప్పే సమయంలో శివ నిర్లక్ష్యం కారాణంగా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. చివరికి, సినిమాలో అనుకోని మలుపు తీసుకుంటుంది. శివ, శృతి వారి భవిష్యత్తుపై ఒక నిర్ణయాన్ని తీసుకోవలసి వస్తుంది. అప్పుడు వారు ఏమి చేశారన్నది మిగతా కథ.

నటవర్గం సవరించు

విడుదల, స్పందన సవరించు

భారతదేశం, విదేశాలలో విడుదలైన ఈ సినిమాకు మంచి సమీక్షలు వచ్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు చెందిన సురేష్ కవిరాయణి 3/5 రేటింగ్ ఇచ్చాడు. ఈ సినిమా 'కొత్తగా ఉందని, సుధీర్ నటన ప్రశంసనీయం' అన్నాడు.[3] 123 తెలుగుకు చెందిన మహేష్ 3/5 రేటింగ్ ఇచ్చాడు. 'ఈ సినిమా చూడటానికి తగినదని, సుధీర్ తన డ్యాన్స్ - ఫైట్స్ తో ఆకట్టుకున్నాడు' అని ప్రశంసించాడు.[4] ఇడ్లెబ్రేన్‌కు చెందిన జీవి ఈ సినిమాకు 3/5 రేటింగ్‌ ఇచ్చాడు. 'ఈ సినిమాలో యూత్ వ్యక్తిత్వం, వినోదం ఉన్నాయని, సుధీర్ - రెజీనా నటన ఈ సినిమాకి ప్లస్ పాయింట్లుగా నిలిచాయి' అని చెప్పాడు.[5] ఎన్డిటివి నుండి సమీక్షకులు సానుకూల సమీక్ష ఇచ్చారు. 'ఈ సినిమా సుధీర్ కు మంచి ఎంట్రీ అని, డ్యాన్స్ - ఫైట్స్ సన్నివేశాలలో సులభంగా నటించాడు, రెజీనా నటనను కూడా బాగుంది' అని రాశాడు.[6] హిందూస్తాన్ టైమ్స్ పత్రిక ఈ సినిమాకి 3/5 రేటింగ్ ఇచ్చింది. 'ఈ సినిమా మంచి టైమ్ పాస్ సినిమా' అని రాసింది.[7]

పాటలు సవరించు

Untitled

ఈ చిత్రానికి చక్రి పాటలు స్వరపరిచాడు.[8] యువన్ శంకర్ రాజా స్వరపరిచిన శివ మనసుల శక్తి సినిమా నుండి "చెలియా", "ఎస్ఎంఎస్ థీమ్" పాటలు అలాగే ఉంచబడ్డాయి.

క్రమసంఖ్య పాట గాయకులు ఇతర వివరాలు సాహిత్యం సంగీతం
1 "ఇది నిజమే" కార్తీక్, రాణినారెడ్డి, కుల్లనారి కూటం నుండి వచ్చిన "విజిగలీలే" పాట రీమిక్స్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అచ్చు రాజమణి
2 "చీకి చీకి బాబే" ,అనుజ్ గురువారా, హేమచంద్ర చంద్రబోస్ అచ్చు రాజమణి
3 "అర్ధరాత్రి" రంజిత్, ఎన్. సి. కారుణ్య, కృష్ణ చైతన్య, నోయెల్ సీన్ భాస్కరభట్ల చక్రి
4 "చెలియా" విజయ్ ప్రకాష్ శివ మనసుల శక్తి నుండి "ఓరు కల్ ఓరు కన్నడి" పాట అనంత శ్రీరామ్ యువన్ శంకర్ రాజా
5 "ఓసి పెంకి పిల్లా" చక్రి, శంకర్ మహదేవన్, సుమిత్రా అయ్యర్, గీతా మాధురి కందికొండ చక్రి
6 "ఎస్ఎంఎస్ థీమ్" హేమచంద్ర శివ మనసుల శక్తి నుండి "ఓరు పార్వైయిల్" పాట రామజోగయ్య శాస్త్రి యువన్ శంకర్ రాజా

అవార్డులు, నామినేషన్లు సవరించు

వేడుక వర్గం నామినీ ఫలితం
2వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్[9] ఉత్తమ తొలిచిత్ర నటుడు (తెలుగు)కి సైమా అవార్డు సుధీర్ బాబు Won
ఉత్తమ తొలిచిత్ర నటి (తెలుగు) కి సిమా అవార్డు రెజీనా కాసాండ్రా Won
ఉత్తమ తొలిచిత్ర నిర్మాత విక్రమ్ రాజు Nominated

మూలాలు సవరించు

  1. "LucidMovies acquires SMS overseas rights". Andhravilas. Retrieved 30 April 2021.[permanent dead link]
  2. "SMS (Siva Manasulo Sruthi)". idlebrain.com. Retrieved 30 April 2021.
  3. Kavirayani, Suresh. "SMS Review". Times of India. Retrieved 30 April 2021.
  4. "SMS;Tale of a love hate relationship". 123telugu.com. Retrieved 30 April 2021.
  5. "SMS (Siva Manasulo Sruthi) Review". Cinegoer. Retrieved 30 April 2021.
  6. "SMS (Siva Manasulo Sruthi) Review". NDTV Movies. Archived from the original on 11 ఫిబ్రవరి 2012. Retrieved 30 April 2021.
  7. "SMS Review". Hindustan Times. Archived from the original on 5 ఫిబ్రవరి 2015. Retrieved 30 April 2021.
  8. "SMS (2012)". raaga.com. Retrieved 30 April 2021.
  9. "SIIMA Awards 2013 Winner List". zustglitz.com. 14 September 2013. Archived from the original on 17 సెప్టెంబరు 2013. Retrieved 30 April 2021.