తాతా మనవడు
వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా ఆదరించాలని, ఇప్పుడు మనము అనుసరించిన మార్గాన్నే ముందు ముందు మన పిల్లలు ఆచరిస్తారని చెప్పే సందేశాత్మక చిత్రం ఇది. దాసరి నారాయణరావు సినీ ప్రస్థానం (దర్శకునిగా) ఈ చిత్రంతోనే ప్రారంభమైంది. "నీ అయ్యకు చేసిన ఈ మర్యాద రేపు నీకు చెయ్యాలి కదయ్యా" అని కొడుకు తండ్రితో అనడమే చిత్రంలోని ప్రధాన కథాశం. పిల్లలు మన చర్యల్ని, నడిచే మార్గాన్ని గమనిస్తూ ఉంటారు అని చెప్పే చిత్రం; ఒక కొత్త ఒరవడికి నాంది పలికి విజయవంతమైంది.
తాతా మనవడు (1973 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
---|---|
నిర్మాణం | కె.రాఘవ, ఏకాంబరరావు |
కథ | దాసరి నారాయణరావు |
చిత్రానువాదం | దాసరి నారాయణరావు |
తారాగణం | ఎస్వీ రంగారావు , అంజలీదేవి, రాజబాబు, విజయనిర్మల, కైకాల సత్యనారాయణ, రాజసులోచన, అల్లు రామలింగయ్య, రమాప్రభ, ఛాయాదేవి, గుమ్మడి వెంకటేశ్వరరావు |
సంగీతం | రమేష్ నాయుడు |
నేపథ్య గానం | ఘంటసాల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, పి.సుశీల, మాధవపెద్ది సత్యం ఎల్.ఆర్.ఈశ్వరి |
గీతరచన | సి.నారాయణ రెడ్డి, కొసరాజు రాఘవయ్య |
సంభాషణలు | దాసరి నారాయణరావు |
ఛాయాగ్రహణం | ఎమ్.కన్నప్ప |
నిర్మాణ సంస్థ | ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
నిడివి | 177 నిమిషాలు |
అవార్డులు | నంది అవార్డు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఎస్.వి.ఆర్, రాజబాబు అత్యద్భుత నటన, కొత్త తరహా సంభాషణలు, దర్శకత్వం, చక్కటి నేపధ్యగీతాలు(బాలు, రామకృష్ణ - అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం చి త్రవిజయానికి కారణభూత మయ్యాయి. చిత్రంలో హీరో, హీరోయిన్ల వంటి మూస పాత్రలు లేకపోయినా, తక్కువ బడ్జెట్‌తో నిర్మించినా ప్రేక్షకులు ఆదరించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ చిత్రానికి 1972 సంవత్సరానికి ద్వితీయ ఉత్తమ చిత్రంగా రజిత నంది అవార్డు ప్రకటించింది.
పాత్రలు-పాత్రధారులు
మార్చు- ఎస్వీ రంగారావు - రంగయ్య, తాత
- అంజలీదేవి - సీత, రంగయ్య భార్య
- రాజబాబు - గిరి, మనవడు
- విజయనిర్మల - రాణి
- కైకాల సత్యనారాయణ - ఆనంద్, తండ్రి
- రాజసులోచన - గీత, ఆనంద్ భార్య
- అల్లు రామలింగయ్య
- రమాప్రభ
- ఛాయాదేవి
- గుమ్మడి వెంకటేశ్వరరావు - పరమాత్మ రావు
- చంద్రకళ - సుగుణ
- రావు గోపాలరావు - కుటుంబరావు
- కొమ్మినేని శేషగిరిరావు
- శ్రీవిద్య - డాన్సర్
పాటలు
మార్చు- అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం - గానం: వి.రామకృష్ణ
- ఈనాడే బాబూ నీ పుట్టినరోజూ, ఈ ఇంటికే వెలుగు వచ్చినరోజూ - గానం: పి.సుశీల
- ఏమిటో ఈ లోకమంతా ఎంతకూ అంతుపట్టని వింత - గానం: వి.రామకృష్ణ
- సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది వీడికి పేరేదీ పుట్టే వాడికి చోటేదీ
- నూకాలమ్మని నేనే నీ పీకని నొక్కేతానే - గానం: ఎల్.ఆర్. ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- రాయంటీ నా మొగుడు రంగామెల్లీ తిరిగి రాలేదు - గానం: ఎల్.ఆర్. ఈశ్వరి
మూలాలు
మార్చు- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.