తిమ్మాపూర్ (ఖానాపూర్ మండలం)
తిమ్మాపూర్,తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, ఖానాపూర్ మండలానికి చెందిన రెవెన్యూ గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2] ఇది జనగణన పట్టణం. తిమ్మపూర్ సెన్సస్ టౌన్ మొత్తం 3,063 ఇళ్లకు పైగా పరిపాలనను కలిగి ఉంది. దీనికి నీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను సంబంధిత స్థానిక స్వపరిపాలన సంస్థ అందిస్తుంది.పట్టణ పరిధిలో రహదారులను నిర్మించడానికి,నిర్వహించటానికి దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా స్థానిక స్వపరిపాలన సంస్థ అధికారం ఉంది.[3]
తిమ్మాపూర్ | |
— రెవిన్యూ గ్రామం, జనగణన పట్టణం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 19°03′59″N 78°37′54″E / 19.066368°N 78.631640°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఆదిలాబాదు |
మండలం | ఖానాపూర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 13,485 |
- పురుషుల సంఖ్య | 6,847 |
- స్త్రీల సంఖ్య | 6,638 |
- గృహాల సంఖ్య | 3,062 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గణాంక వివరాలు
మార్చుతిమ్మపూర్ నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలో ఉన్న సెన్సస్ టౌన్ నగరం.2011 భారత జనాభా లెక్కల ప్రకారం, తిమ్మపూర్ పట్టణపరిధిలో మొత్తం 3,063 కుటుంబాలు నివసిస్తున్నాయి.తిమ్మాపూర్ పట్టణ మొత్తం జనాభా 13,485, అందులో 6,847 మంది పురుషులు, 6,638 మంది మహిళలు.సగటు సెక్స్ నిష్పత్తి 969.తిమ్మపూర్ పట్టణంలో 0-6 సంవత్సరాల వయస్సులోపు పిల్లల జనాభా 1327, ఇది మొత్తం జనాభాలో 10%గా ఉంది.0-6 సంవత్సరాల వయస్సు మధ్య 678 మంది మగ పిల్లలు, 649 మంది ఆడ పిల్లలు ఉన్నారు.దీని ప్రకారం చైల్డ్ సెక్స్ రేషియో 957, ఇది సగటు సెక్స్ రేషియో (969) కన్నా తక్కువ.పట్టణ అక్షరాస్యత మొత్తం 75.1% గా ఉంది.తిమ్మాపూర్‌లో పురుషుల అక్షరాస్యత రేటు 84.15%, స్త్రీ అక్షరాస్యత రేటు 65.74%.[3]
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ 3.0 3.1 "Thimmapur Population, Caste Data Adilabad Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2020-10-10. Retrieved 2020-10-05.