తిరుకోవెల అంజయ్య

తిరుకోవెల అంజయ్య, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు.[1]

తిరుకోవెల అంజయ్య
తిరుకోవెల అంజయ్య
జననం
తిరుకోవెల అంజయ్య

మరణం2022, అక్టోబరు 30
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు
జీవిత భాగస్వామిసత్యవతి
పిల్లలుముగ్గురు కుమారులు, ఒక కుమార్తె

అంజయ్య జగిత్యాల జిల్లా, మల్యాలలోని ముత్యంపేట గ్రామంలో జన్మించాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

అంజయ్యకు సత్యవతితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారి కుటుంబం హైదరాబాదు నగరంలోని సైదాబాద్‌ డివిజన్‌, కరణ్‌బాగ్‌ కాలనీలో నివాసముంటున్నది.[1] పెద్దకుమారుడు రామకృష్ణ కొండగట్టు దేవాలయంలో ఆచార్యుడిగా, చిన్న కుమారుడు డాక్టర్ హరికృష్ణ హైదరాబాదు జిల్లా టిజివో కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

వృత్తి జీవితం

మార్చు

తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక సభ్యుడిగా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, కొండగట్టు అంజన్న దేవాలయ వ్యవస్థాపక సభ్యుడిగా, చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులైన జలగం వెంగళరావు, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డిలతోపాటు జువ్వాడి చొక్కారావు, గొడిశెల రాజేశం గౌడ్, శ్రీపతి రాజేశ్వర్ రావు, ముద్దసాని దామోదర్ రెడ్డి వంటి పలువురు మంత్రుల వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా కూడా పనిచేశాడు.[2]

అనారోగ్యంతో నిమ్స్‌లో చికిత్సపొందిన అంజయ్మ 2022, అక్టోబరు 30న మరణించాడు.[2]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 telugu, NT News (2022-10-31). "ఉద్యమకారుడు అంజయ్య కన్నుమూత". www.ntnews.com. Archived from the original on 2022-10-31. Retrieved 2022-10-31.
  2. 2.0 2.1 "కొండగట్టు అంజయ్య కన్నుమూత". EENADU. 2022-10-31. Archived from the original on 2022-10-30. Retrieved 2022-10-31.