తిరుగులేని మనిషి

తిరుగులేని మనిషి 1981 లో విడుదలైన తెలుగు యాక్షన్ చిత్రం. దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కె. దేవీ వర ప్రసాద్ నిర్మించగా, కె . రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్‌టి రామారావు, చిరంజీవి, రతి అగ్నిహోత్రి ముఖ్య పాత్రల్లో నటించారు.[1] కెవి మహదేవన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమైంది.

తిరుగులేని మనిషి
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం కనకమేడల దేవి వరప్రసాద్
తారాగణం నందమూరి తారక రామారావు,
చిరంజీవి,
రతి అగ్నిహోత్రి,
ఫటాఫట్ జయలక్ష్మి
సంగీతం కె.వి.మహదేవన్
సంభాషణలు సత్యానంద్
ఛాయాగ్రహణం కె.ఎస్. ప్రకాష్
నిర్మాణ సంస్థ దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

యువ న్యాయవాది రాజా (ఎన్‌టి రామారావు) తన ప్రాక్టీస్‌ను ప్రారంభించి మొదటి కేసులో విజయం సాధిస్తాడు. అతను బిగ్ షాట్ శశిభూషణ రావు (జగ్గయ్య) కుమారుడు, పద్మకు (ఫటాఫట్ జయలక్ష్మి) సోదరుడు. స్థానిక క్లబ్‌లలో గిటార్ వాయించే గాయకుడు కిషోర్ (చిరంజీవి) తో పద్మ ప్రేమలో పడుతుంది. శశిభూషణ రావు వారి ప్రేమను అంగీకరించడు. కిషోర్ పేదరికాన్ని అవమానిస్తాడు. పద్మ నిద్ర మాత్రలు వేసుకొని ఆత్మహత్యా యత్నం చేస్తుంది., కాని సోదరుడు రాజా ఆమెను సమయానికి రక్షిస్తాడు. తండ్రి లేని సమయంలో కిషోర్‌తో ఆమెకు పెళ్ళి చేస్తాడు. వారి తండ్రి వారిపై కోపం తెచ్చుకుంటాడు. కాని మనవడు పుట్టినపుడూ కుమార్తెను క్షమించి, వారికి మళ్ళీ దగ్గరౌతాడు.

మరోవైపు రాజా, డబ్బు కోసం ప్రజలను మోసం చేసే సీత (రతి అగ్నిహోత్రి) ఆమె మామ దొంగ రాముడు (అల్లు రామలింగయ్య) లను కలుస్తూ ఉంటాడు. అతను వారిని సంస్కరించడానికి ప్రయత్నిస్తాడు. వారికి తన సొంత కార్యాలయంలో ఉద్యోగాలిస్తాడు. ఊహించని సంఘటనలో, రాజా తన తండ్రికి బంగారం వజ్రాలను స్మగ్లింగు చేసే ముఠాతో సంబంధం ఉందని తెలుసుకుంటాడు. అతని తండ్రిని చంపేస్తారు. కాని అతడు ముఠా గురించి ఏమీ ఎప్పడు.

ఒకప్పుడు తన తండ్రి సహాయం చేసిన నాగులు (సత్యనారాయణ) ను రాజా కలుస్తాడు. ముఠాను ఛేదించడంలో అతని సలహా తీసుకుంటాడు. తన ప్రయత్నాలలో, కిషోరుకు ఆ ముఠాతో సంబంధం ఉందని తెలిసి షాకవుతాడు. ఆ ముఠాను విడిచిపెట్టి, వారి యజమానిని కనిపెట్టడంలో సహాయం చేయమని కిషోర్ను హెచ్చరిస్తాడుఉన్న నాగులేననీ తెలుసుకుంటారు.. హీరోలు ముఠాతో పోరాడి కిషోర్ బిడ్డను రక్షించడంతో సినిమా ముగుస్తుంది.

తారాగణం

మార్చు

సాంకేతిక సిబ్బంది

మార్చు

పాటలు

మార్చు

పాటలు ఆచార్య ఆత్రేయ రాయగా, కె.వి.మహదేవన్ సంగీతం సమకూర్చాడు.

క్ర.సం పాట గాయనీ గాయకులు నిడివి
1 "మధురం మధురం" ఎస్పీ బాలు, పి.సుశీల 4:13
2 "బరిలోకి దిగనా" ఎస్పీ బాలు, పి.సుశీల 4:07
3 "రావమ్మ రావమ్మ" ఎస్పీ బాలు, పి.సుశీల 3:58
4 "నిన్ను పుట్టించినోడు" ఎస్పీ బాలు, పి.సుశీల 3:47
5 "ఎంతసేపు ఎంతసేపు" ఎస్పీ బాలు, పి.సుశీల 4:18
6 "యవ్వనం ఒక నందనం" ఎస్పీ బాలు, పి.సుశీల 4:18

మూలాలు

మార్చు
  1. "తిరుగులేని మనిషి నటీనటులు-సాంకేతిక నిపుణులు | Tiruguleni Manishi Cast & Crew Details in Telugu - Filmibeat Telugu". telugu.filmibeat.com. Retrieved 2020-08-04.