తిరుప్పూర్ లేదా తిరుపూర్, భారతదేశం, తమిళనాడు రాష్ట్రం, తిరుప్పూర్ జిల్లా లోని ఒక నగరం. ఇది తిరుప్పూర్ తిరుప్పూర్ జిల్లాకు పరిపాలనా ప్రధాన కార్యాలయం. తమిళనాడులోని ఐదవ అతిపెద్ద నగరం అలాగే పట్టణ సముదాయం.నోయల్ నది ఒడ్డున ఉన్న దీనిని, వివిధ కాలాలలో, ప్రారంభ పాండ్యులు, మధ్యయుగ చోళులు, తరువాత చోళులు, మైసూర్ రాజ్యం, బ్రిటిష్ వారు పాలించారు. ఇది రాష్ట్ర రాజధాని చెన్నైకి నైరుతి దిశలో దాదాపు 450 కిలోమీటర్లు (280 మై), కోయంబత్తూర్‌కు తూర్పున 50 కిలోమీటర్లు (31 మై), ఈరోడ్‌కు దక్షిణంగా 50 కిలోమీటర్లు (31 మై), ధరాపురానికి ఉత్తరాన 50 కిలోమీటర్లు (31 మై) దూరంలో ఉంది.2008లో స్థాపించబడిన నగరపాలక సంస్థ ద్వారా తిరుప్పూర్ పరిపాలన నిర్వహించబడుతుంది. నగరం 159.6 కిమీ2 విస్తీర్ణంలో విస్తరించి ఉంది.

Tiruppur
City
A road in Tiruppur during the COVID-19 lockdown
A road in Tiruppur during the COVID-19 lockdown
Nickname(s): 
Knit Wear Capital of India, Textile City, Dollar City, Cotton City, Baniyan City, Knit City, Clothing hub of India
Tiruppur is located in Tamil Nadu
Tiruppur
Tiruppur
Tiruppur, Tamil Nadu
Coordinates: 11°06′31″N 77°20′28″E / 11.108500°N 77.341100°E / 11.108500; 77.341100
Country India
StateTamil Nadu
DistrictTiruppur
Government
 • TypeMayor-Council
 • BodyTiruppur Municipal Corporation
 • MayorN Dinesh Kumar
 • Corporation commissionerKranti Kumar, ndian Administrative Services[2]
Area
 • City159.6 km2 (61.6 sq mi)
 • Rank7
Elevation
330 మీ (1,080 అ.)
Population
 (2011)[4]
 • City8,77,778[1]
 • Rank5th in Tamil Nadu
 • Metro9,63,173
Languages
 • OfficialTamil
Time zoneUTC+5:30 (IST)
PIN
6416xx
Telephone code+91-421
Vehicle registrationTN-39, TN-42, TN-78

2011 జనాభా లెక్కల ప్రకారం నగర పరిధిలోని మొత్తం జనాభా 8,77,778. తిరుప్పూర్ నగరం తిరుప్పూర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఒక భాగం.భారతదేశంలో, తిరుప్పూర్ ఒక ప్రధాన వస్త్ర పరిశ్రమకు, అల్లిన దుస్తులకు ప్రసిద్ధి చెందిన వగరం, భారతదేశంలో మొత్తం అల్లిన కాటన్ దుస్తులు ఎగుమతులలో ఈ నగరం 90%కి దోహదం చేస్తుంది. [6] వస్త్ర పరిశ్రమ క్రింద ఆరు లక్షల మందికి పైగా ఉపాధిని అందిస్తుంది. 2014-15 సంవత్సరంలో దాదాపు 200 బిలియను (US$2.5 billion) విలువైన ఎగుమతులకు దోహదం చేసింది. [7] [8]

వ్యుత్పత్తి శాస్త్రం మార్చు

తిరుప్పూర్ అనే పేరు మహాభారత కాలంలో ఉద్భవించిందని చెబుతారు. పురాణాల ప్రకారం, పాండవుల పశువుల మందలను దొంగలు దొంగిలించారు.వాటిని తిరిగి అర్జునుడి దళాలు స్వాధీనం చేసుకున్నాయి. దీని ఫలితంగా "తిరుప్పుర్" (తిరుప్పు అంటే "తిరుగుట", ఊర్ అంటే తమిళంలో "ఒక ప్రదేశం") అనే పేరు అర్థాన్ని తెలుపుతుంది. వారు వాటి కోసం తిరిగిన ప్రదేశం అయినందున ఈ పేరు వచ్చిందని కథనం"[9]

చరిత్ర మార్చు

సంగం కాలంలో చేరులు పాలించిన కొంగునాడు ప్రాంతంలో తిరుప్పూర్ ఒక భాగంగా ఏర్పడింది.[10] ఈ ప్రాంతం భారతదేశ తూర్పు, పశ్చిమ తీరాలను అనుసంధానించే ప్రముఖ రోమన్ వాణిజ్య మార్గంలో భాగం. [11] [12] మధ్యయుగ చోళులు సా.శ. పదవ శతాబ్దంలో కొంగునాడును జయించారు.చోళ రాతిశిల్పాలు కంచి మానాది (నోయల్ నది ) దాని ఒడ్డున నిక్షిప్తమైన సారవంతమైన ఇసుక గురించి ప్రస్తావించాయి. [13] [14] [15]

ఈప్రాంతం 15వ శతాబ్దం నాటికి విజయనగర సామ్రాజ్యం ఆధీనంలోకి వచ్చింది.తరువాత మదురై నాయకుల ముఖ్యులైన పాలయక్కరర్లు ఈ ప్రాంతాన్ని పాలించారు. [16] 18వ శతాబ్దపు చివరి భాగంలో, మదురై నాయక్ రాజవంశంతో వరుసయుద్ధాల తరువాత ఈప్రాంతం మైసూర్ రాజ్యంలోకి వచ్చింది.ఆంగ్లో-మైసూర్ యుద్ధాలలో టిప్పు సుల్తాన్ ఓడిపోయిన తరువాత,బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1799లో ఈ ప్రాంతాన్ని మద్రాసు ప్రెసిడెన్సీలో కలుపుకుంది.

తిరుప్పూర్ నీటిపారుదల పొలాలతో కూడిన వ్యవసాయ పట్టణం. రైతులు 1970లలో వివిధ వస్త్ర సంబంధిత పరిశ్రమలకు చిన్న యజమానులుగా మారారు. వస్ర పరిశ్రమలో బూమ్ చిన్న తరహా పరిశ్రమలు నేయబడిన వస్ర్తాలు అంతర్జాతీయ ఎగుమతులుకు దారితీసింది.ఇది నగరం ఒక ప్రధాన వస్రపరిశ్రమ ప్రధాన అభివృద్ధి చెందడానికి దారితీసింది.[17] తిరుప్పూర్ 2008లో మునిసిపల్ కార్పొరేషన్‌గా అవతరించింది. 2009లో కోయంబత్తూరు జిల్లా, ఈరోడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుండి ప్రత్యేక తిరుప్పూర్ జిల్లా ఏర్పడింది [18]

భౌగోళికం మార్చు

తిరుప్పూర్ నగరం నోయల్ నది ఒడ్డున 11°06′27″N 77°20′23″E / 11.1075°N 77.3398°E / 11.1075; 77.3398 వద్ద ఉంది. [19] ఇది సముద్రమట్టానికి 295 మీటర్లు (967 అడుగులు) సగటు ఎత్తున, 159.6 km2 (61.6 sq mi) విస్తీర్ణంలో విస్తరించి ఉంది.

జనాభా గణాంకాలు మార్చు

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
18813,681—    
18915,235+42.2%
19016,056+15.7%
19119,429+55.7%
192110,851+15.1%
193118,059+66.4%
194133,099+83.3%
195152,479+58.6%
196179,773+52.0%
19711,13,302+42.0%
19811,65,223+45.8%
19912,35,661+42.6%
20013,46,551+47.1%
20114,44,352+28.2%
20158,77,778+97.5%

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, తిరుప్పూర్‌లో 4,44,352 మంది జనాభా ఉన్నారు. ప్రతి 1,000 మంది పురుషులకు 955 మంది స్త్రీల లింగ నిష్పత్తి ఉంది.దీనిని జాతీయ సగటు 929 తో పోల్చగా ఇది కంటే ఎక్కువ ఉంది.[20] మొత్తం జనాభాలో 48,802 మంది ఆరేళ్లలోపు వారు, 24,818 మంది పురుషులు, 23,984 మంది మహిళలు ఉన్నారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు జనాబా 5.47% మంది ఉండగా, షెడ్యూల్డ్ తెగలు జనాభా 0.06% మంది ఉన్నారు. సగటు అక్షరాస్యత 78.17%ఉంది. దీనిని జాతీయ సగటు 72.99% పోల్చగా ఇది ఎక్కువ [20] నగరం పరిధిలో మొత్తం 124,617 గృహాలు ఉన్నాయి. మొత్తం జనాభాలో 2,07,358 మంది కార్మికులు ఉన్నారు, వీరిలో 490 మంది సాగుదారులు, 721 మంది ప్రధాన వ్యవసాయ కార్మికులు, 3,492 మంది గృహ పరిశ్రమలు, 191,882 మంది ఇతర కార్మికులు, 10,773 ఉపాంత కార్మికులు, 89 ఉపాంత రైతులు, 74 మంది సన్నకారు కార్మికులు, సన్నకారు వ్యవసాయ కార్మికులు 70 మంది ఉన్నారు.[21]

2011 మత గణన ప్రకారం, తిరుప్పూర్ నగరపాలకసంస్థ పరిధిలో 86.05% హిందువులు, 10.36% ముస్లింలు, 3.33% క్రైస్తవులు, 0.03% సిక్కులు, 0.01% బౌద్ధులు, 0.07% జైనులు, 0.14% ఇతర మతాలను అనుసరించేవారు, లేదా ఏ మతపరమైన ప్రాధాన్యతను సూచించనివారు 0.14% మంది ఉన్నారు. . [22]

రాజకీయం మార్చు

 
నోయల్ నది

తిరుప్పూర్‌లో తిరుప్పూర్ ఉత్తర శాసనసభ, తిరుప్పూర్ దక్షిణ అనే రెండు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.తిరుప్పూర్ నగరం తిరుప్పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.ఇది 2008లో డీలిమిటేనేషన్ సమయంలో పూర్వపు కోయంబత్తూర్, గోబిచెట్టిపాళయం, పళని నియోజకవర్గాలు ఉన్నాయి. [23]

దేవాలయాలు, ఆసక్తికరమైన ప్రదేశాలు మార్చు

 
సుక్రీశ్వర ఆలయం, కురక్కుతాలి

తిరుప్పూర్‌లోని ప్రధాన దేవాలయాలు చోళులు, పాండ్యుల పాలనలో నిర్మించబడ్డాయి. తిరుప్పూర్ శివార్లలో ఉన్న పదవ శతాబ్దపు నాటి ఆలయం సుక్రీశ్వర దేవాలయం. ఈ దేవాలయం కొంగు ప్రాంతంలోని నాలుగు సిర్ప స్థలాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఆలయంలో నిర్వహించిన శిలాశాసన అధ్యయనం ప్రకారం, పాండ్యులచే నిర్మించబడినప్పటికీ, ఈ దేవాలయం ఐదవ శతాబ్దంలో గిరిజనులు శివలింగానికి పూజలు చేయడానికి ఉపయోగించినట్లు తెలుస్తుంది. [24]

ఇంకా నగరానికి సమీపంలో శివన్‌మలై, తిరుమూర్తి కొండలు, అమరావతి మొసళ్ల ఫారం, ఒరతుప్పాలయం ఆనకట్ట, నంజరాయన్ చెఱువు, కూలిపాళయం చిత్తడి నేలలు, ఆండిపాళయం సరస్సు, తిరుమురుగన్ పూండి, కొంగనగిరి హిల్ హాక్ దేవాలయం, తిరుప్పూర్ తిరుపతియన్‌కోవ్ దేవాలయం, అవినాశిలింగి ఠ్కోవాట్ దేవాలయం, అవినాశిలింగి ఠ్కోవాట్ దేవాలయం నగరం వెలుపల ప్రసిద్ధి చెందిన కొన్ని పర్యాటక ప్రదేశాలు.

ఆర్థిక వ్యవస్థ మార్చు

తిరుప్పూర్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి. తిరుప్పూర్ నగరం అల్లిక వస్త్రాల ఉత్పత్తి పరిశ్రమలకే కాకుండా, వంటశాలలు, హోటల్ అవసరాల కోసం ఇత్తడి, రాగి, అల్యూమినియం పాత్రల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. తిరుప్పూర్‌లోని అనుప్పర్‌పాళయం ప్రాంతం ఈ వ్యాపారంలో పాలుపంచుకుంది. తయారు చేసిన ఉత్పత్తులు తమిళనాడు, సమీప రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు సరఫరా చేయబడతాయి.

సంక్షేమం, విద్య మార్చు

తిరుప్పూర్‌లో మంచి విద్యా మౌలిక సదుపాయాలు ఉన్నాయి. నగరంలో కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి, కానీ సమీప ప్రాంతాలు, సమీపంలోని కోయంబత్తూర్ ఈరోడ్ నగరాలలో విద్యకు మంచి సౌకర్యాలు బాగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా తాలూకా స్థాయిలో 7 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలలో [25] [26] మొత్తం 896 పడకలతో 43 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఉన్నాయి.[27]

రహదారులు మార్చు

కింది ప్రధాన రహదారులు తిరుప్పూర్‌కు సేవలు అందిస్తున్నాయి:

  • ఎన్ఎచ్-381: అవినాశి - తిరుప్పూర్ - అవినాశిపాలయం
  • ఎస్ఎచ్-19: పల్లడం - తిరుప్పూర్ - పొల్లాచ్చి మీదుగా కమనైకెన్ పాళయం
  • ఎస్ఎచ్-37: అవినాశిపాలెం - ధరాపురం
  • ఎస్ఎచ్-196 / SH-81: తిరుప్పూర్ - గోబిచెట్టిపాళయం
  • ఎస్ఎచ్-169: తిరుప్పూర్ - సోమనూర్
  • ఎస్ఎచ్-172: తిరుప్పూర్ - కాంగేయం - వెల్లకోవిల్

ప్రయాణ సౌకర్యాలు మార్చు

తిరుపూర్‌లో మూడు ప్రధాన బస్ స్టాండ్‌లు ఉన్నాయి. తిరుప్పూర్ తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రధాన పట్టణాలు, నగరాలకు బస్సు సర్వీసు ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.[28] సమీప విమానాశ్రయం కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయం (45 కిమీ) దూరంలో ఉంది. తిరుప్పూర్ రైల్వే స్టేషన్ పూర్తిగా విద్యుదీకరణతో రైళ్ల ద్వారా అన్ని ప్రాంతాలకు ప్రయాణవసతి సౌకర్యాలు ఉన్నాయి.

ప్రముఖ వ్యక్తులు మార్చు

  • అథ్లెట్ ధరుణ్ అయ్యసామి - ప్రస్తుతం 400 మీటర్ల జాతీయ రికార్డు సాధించాడు
  • ఎస్. థియోడర్ బాస్కరన్-చలనచిత్ర చరిత్రకారుడు, వన్యప్రాణి సంరక్షకుడు
  • టిఎ రామలింగం చెట్టియార్ -భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త, పార్లమెంటు సభ్యుడు, వ్యాపారవేత్త
  • ఉడుమలై నారాయణ కవి- కవి, గేయ రచయిత
  • తిరుప్పూర్ కుమరన్ - స్వాతంత్ర్య సమరయోధుడు
  • టిఎస్ అవినాశిలింగం చెట్టియార్ - భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది
  • ఉత్తమ రామసామి - రాజకీయవేత్త, వ్యాపారవేత్త

మూలాలు మార్చు

  1. "Smart City Challenge-Tiruppur". Government of TamilNadu. Archived from the original on 18 డిసెంబరు 2015. Retrieved 15 డిసెంబరు 2015.
  2. "Commissioner, Tiruppur Corporation". Tiruppur corporation. Archived from the original on 19 డిసెంబరు 2012. Retrieved 15 జూన్ 2011.
  3. "About Corporation of Tirupur". Corporation of Tirupur. Retrieved 26 June 2010.[permanent dead link]
  4. "Provisional Population Totals, Census of India 2011; Cities having population 1 lakh and above" (pdf). Office of the Registrar General & Census Commissioner, India. Archived (PDF) from the original on 7 మే 2012. Retrieved 26 మార్చి 2012.
  5. "Primary Census Abstract - Urban Agglomeration" (XLS). Registrar General and Census Commissioner of India. Archived from the original on 15 మార్చి 2016. Retrieved 13 అక్టోబరు 2015.
  6. "The New Developments in Tirupur" (PDF). Fairwear Foundation. Archived (PDF) from the original on 21 September 2015. Retrieved 2 June 2015.
  7. "Knitwear exports from Tirupur cross Rs 20,000 crore". The Economic Times. Archived from the original on 2 June 2015. Retrieved 2 June 2015.
  8. "City Guide: Tirupur". India Catalog.Com. Archived from the original on 13 July 2011. Retrieved 24 September 2009.
  9. "History of Tiruppur". Government of India. Archived from the original on 3 June 2015. Retrieved 2 June 2015.
  10. Subramanian, T. S (28 January 2007). "Roman connection in Tamil Nadu". The Hindu. Archived from the original on 19 September 2013. Retrieved 28 October 2011.
  11. "Kovai's Roman connection". The Hindu. 8 January 2009. Archived from the original on 1 June 2009. Retrieved 9 June 2010.
  12. "On the Roman Trail". The Hindu. 21 January 2008. Archived from the original on 10 November 2012. Retrieved 9 June 2010.
  13. "Rivers of Tiruppur". Government of Tamil Nadu. Archived from the original on 3 March 2016. Retrieved 6 September 2015.
  14. Vanavarayar, Shankar (21 June 2010). "Scripting history". The Hindu. Archived from the original on 10 November 2012. Retrieved 9 May 2011.
  15. M, Soundariya Preetha (30 June 2007). "Tale of an ancient road". The Hindu. Archived from the original on 10 November 2012. Retrieved 9 May 2011.
  16. "The land called Kongunadu". The Hindu. 19 November 2005. Archived from the original on 28 May 2011. Retrieved 9 June 2010.
  17. "History of Tiruppur". tiruppur.com. Archived from the original on 3 September 2015. Retrieved 6 September 2015.
  18. "Tiruppur district formation". Government of Tamil Nadu. Archived from the original on 4 March 2016. Retrieved 6 September 2015.
  19. "Falling Rain Genomics, Inc - Tiruppur". Fallingrain.com. Archived from the original on 15 April 2010. Retrieved 24 September 2009.
  20. 20.0 20.1 "Census Info 2011 Final population totals". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Archived from the original on 13 November 2013. Retrieved 26 Jan 2014.
  21. "Census Info 2011 Final population totals - Tiruppur(05904)". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Archived from the original on 24 September 2015. Retrieved 26 Jan 2014.
  22. "Population By Religious Community - Tamil Nadu" (XLS). Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2011. Archived from the original on 13 September 2015. Retrieved 13 September 2015.
  23. "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu: Election Commission of India. Archived from the original (PDF) on 4 March 2009. Retrieved 11 October 2008.
  24. "Sukreeswarar Temple". The Hindu. Chennai, India. 1 October 2009. Archived from the original on 3 October 2009. Retrieved 2 October 2009.
  25. "List of Government Hospitals". tiruppur.tn.nic.in. Tamil Nadu Government. Archived from the original on 5 March 2015. Retrieved 3 May 2015.
  26. "List of Private Hospitals". tiruppur.tn.nic.in. Tamil Nadu Government. Archived from the original on 17 June 2015. Retrieved 3 May 2015.
  27. "Department of Public Health & Preventive Medicine". www.tnhealth.org. Tamil Nadu Government. Archived from the original on 2 July 2015. Retrieved 3 May 2015.
  28. "Bus Stand". Tiruppur corporation. Archived from the original on 25 April 2012. Retrieved 12 October 2011.

వెలుపలి లంకెలు మార్చు