తీన్మార్ మల్లన్న
తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, జర్నలిస్టు.
చింతపండు నవీన్ కుమార్ | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 17 జనవరి 1982 మాధాపురం, తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
తల్లిదండ్రులు | చింతపండు భాగయ్య | ||
జీవిత భాగస్వామి | కొండాపురం మమతా | ||
సంతానం | 2 | ||
నివాసం | హైదరాబాద్ | ||
వృత్తి | జర్నలిస్ట్ |
జననం, విద్యాభాస్యంసవరించు
తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. ఆయన 1982, జనవరి 17న తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, మాధాపురం గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి హైదరాబాదు జె.ఎన్.టి.యు నుండి 2009లో ఎంబీఏ పూర్తి చేశాడు.
వృత్తి జీవితంసవరించు
తీన్మార్ మల్లన్న ఎన్ టీవీ, ఐ న్యూస్ వంటి ఛానెల్స్ లో పని చేసి 2012లో వి6 న్యూస్ లో ప్రసారమైన తీన్మార్ వార్తలు ద్వారా మంచి గుర్తింపు అందుకున్నాడు. అనంతరం 10 టీవీలో కొంతకాలం పని చేసి సొంతంగా క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేశాడు.
రాజకీయ జీవితంసవరించు
తీన్మార్ మల్లన్న వి6 న్యూస్ ఛానల్ లో ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఏర్పడ్డాక 2015లో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ -ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. ఆయన 2019లో జరిగిన హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు.[1] తీన్మార్ మల్లన్న 2021, మార్చిలో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచి ఓటమిపాలయ్యాడు.[2][3][4][5] తీన్మార్ మల్లన్న 7 డిసెంబర్ 2021న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[6][7]
పాదయాత్రసవరించు
తీన్మార్ మల్లన్న 2021 ఆగస్టు 29 నుంచి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నుంచి పాదయాత్రను ప్రారంభించి రెండు సంవత్సరాల ప్రజల్లోనే ఉంటానని 2021, జూలై 18న ఘటకేసర్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రకటించాడు.[8]
అరెస్ట్సవరించు
హైదరాబాద్‌లోని చిలకలగూడ పోలీసులు ఆగష్టు 27, 2021న తీన్మార్ మల్లన్న ను అరెస్ట్ చేశారు.[9]
మూలాలుసవరించు
- ↑ The News Minute (9 October 2019). "Meet 'Teenmaar Mallanna,' the journalist taking on TRS and Cong in Huzurnagar bye-poll" (in ఇంగ్లీష్). Archived from the original on 19 July 2021. Retrieved 19 July 2021.
- ↑ Sakshi (21 March 2021). "ఓడి.. గెలిచిన తీన్మార్ మల్లన్న". Archived from the original on 26 July 2021. Retrieved 26 July 2021.
- ↑ Sakshi (19 March 2021). "ఎమ్మెల్సీ కౌంటింగ్: మూడో ప్రాధాన్యం తప్పదా?". Archived from the original on 19 July 2021. Retrieved 19 July 2021.
- ↑ The Times of India (20 March 2021). "Teenmar show: Mallanna dances up a vote storm | Hyderabad News - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 19 July 2021. Retrieved 19 July 2021.
- ↑ V6 Velugu (21 March 2021). "దొరల పాలన ఖతం చేస్తం" (in ఇంగ్లీష్). Archived from the original on 19 July 2021. Retrieved 19 July 2021.
- ↑ Sakshi (8 December 2021). "బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న". Archived from the original on 8 December 2021. Retrieved 8 December 2021.
- ↑ Eenadu (7 December 2021). "భాజపాలో చేరిన తీన్మార్ మల్లన్న". Archived from the original on 8 December 2021. Retrieved 8 December 2021.
- ↑ EENADU (18 July 2021). "తెలంగాణలో తీన్మార్ మల్లన్న పాదయాత్ర". EENADU. Archived from the original on 19 July 2021. Retrieved 19 July 2021.
- ↑ V6 Velugu (27 August 2021). "తీన్మార్ మల్లన్న అరెస్ట్" (in ఇంగ్లీష్). Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.